Begin typing your search above and press return to search.

16 ఏళ్ల తర్వాత మోడీగారి 'ఘర్ వాపసీ'.. ఐపీఎల్ బాస్‌పై కేసుల సీరియల్ ముగిసినట్టేనా?

'ఫెమా' కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఊరటతో లలిత్ బాబు లండన్ సోఫా దిగి స్వదేశానికి రావడానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.

By:  A.N.Kumar   |   22 July 2026 10:32 PM IST
16 ఏళ్ల తర్వాత మోడీగారి ఘర్ వాపసీ.. ఐపీఎల్ బాస్‌పై కేసుల సీరియల్ ముగిసినట్టేనా?
X

"క్యాష్ రిచ్ లీగ్" ఐపీఎల్‌కు శ్రీకారం చుట్టి 2010లో లండన్ ఫ్లైట్ ఎక్కిన ఐపీఎల్ సృష్టికర్త, బీసీసీఐ మాజీ బాస్ లలిత్ మోడీ ఐయామ్ కమింగ్ బ్యాక్ అంటున్నారు. దాదాపు 16 ఏళ్ల విదేశీ అజ్ఞాతవాసం తర్వాత ఆయన మనసు ఇండియా వైపు మళ్లింది. 'ఫెమా' కేసులో అప్పీలేట్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఊరటతో లలిత్ బాబు లండన్ సోఫా దిగి స్వదేశానికి రావడానికి రూట్ క్లియర్ చేసుకుంటున్నారు.

దక్షిణాఫ్రికా మ్యాచ్‌.. ఈడీతో లచ్ఛనంగా లొల్లి

కథలోకి వెళ్తే... 2009లో ఎలక్షన్స్ వల్ల ఐపీఎల్‌ను అర్జెంట్‌గా దక్షిణాఫ్రికాకు షిఫ్ట్ చేసిన సంగతి గుర్తుందేగా? ఆ టైమ్‌లో కోట్లు పక్కదారి పట్టించారని.. ఆర్‌బీఐ పర్మిషన్ లేకుండా నిధులు మళ్లించారని ఈడీ మోడీపై భారీ లెవెల్లో కేసులు పెట్టేశారు. అప్పటినుంచి "నేను లండన్ లోనే ఉంటా నా కేసులు నాతోనే ఉంటాయి" అని మోడీ గారు సైలెంట్‌గా ఉండిపోయారు.

తీరా 16 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత అప్పీలేట్ ట్రిబ్యునల్ "అబ్బా.. అవన్నీ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్లేనయ్యా, మీరు ఊరికే ఆరోపిస్తున్నారు" అని ఈడీ విధించిన ఫైన్లను రద్దు చేస్తూ లలిత్ మోడీకి బిగ్ రిలీఫ్ ఇచ్చింది. దాంతో పొంగిపోయిన మోడీ గారు "కనిపించిందా నా నిజాయితీ? 16 ఏళ్లకు న్యాయం గెలిచింది!" అని సెలబ్రేట్ చేసుకున్నారు. అక్టోబర్‌లో మనవరాలు పుట్టాక వచ్చే ఏడాది తొలినాళ్లలో దిగిపోతానని డేట్ కూడా ఇచ్చేశారు.

ఐతే... కహాణి ఇంకా ఖతమ్‌ కాలేదే

అయితే అభిమానులు, నెటిజన్లు పండగ చేసుకునేలోపే అసలు ట్విస్ట్ బయటపడింది. ఫెమా కేసు పోయినంత మాత్రాన, లలిత్ మోడీపై ఉన్న 'కేసుల క్లబ్' ఖాళీ అయినట్టు కాదండోయ్. ఇంకా మిగిలిన పాత కేటలాగ్‌లు రెడీగానే ఉన్నాయి. బీసీసీఐ , ఐటీ డిపార్ట్‌మెంట్ పాత లెక్కల ఖాతాలు తెరచి చూసేందుకు రెడీగా ఉన్నాయి.

ఫెమా కేసు క్లియర్ అయి ఒక పెద్ద అడ్డంకి తొలగిపోవచ్చు గాక కానీ ఇండియాలో అడుగుపెట్టగానే ఆయనకు రెడ్ కార్పెట్ వేస్తారా లేక విచారణల వినోదం ముంగిట్లోనే ఉంచుతారా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా ఐపీఎల్ సీజన్ లాగే లలిత్ మోడీ 'రీ-ఎంట్రీ' కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.