హీరోయిన్ పై కిడ్నాప్ కేస్.. మరో ముగ్గురు నిందితులు కూడా!
మలయాళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ అంటే అందరికీ సుపరిచితమే.. ఈ హీరోయిన్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి.
By: Madhu Reddy | 27 Aug 2025 2:03 PM ISTమలయాళ హీరోయిన్ లక్ష్మీ మీనన్ అంటే అందరికీ సుపరిచితమే.. ఈ హీరోయిన్ నటించిన సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ పై తాజాగా కిడ్నాప్ కేసు నమోదు అయింది. మరి ఈ హీరోయిన్ నిజంగానే కిడ్నాప్ చేసిందా? ఎందుకు ఈ హీరోయిన్ పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
కొచ్చిలో జరిగిన కిడ్నాప్ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెనర్జీ రోడ్డు లోని ఓ బార్ లో ఆదివారం రోజు లక్ష్మీ మీనన్, మిథున్, అనీష్, సోనామోల్ లకి ఓ ఐటీ కంపెనీలో వర్క్ చేసే ఉద్యోగితో గొడవ జరిగిందట.అయితే ఈ గొడవ ముదిరి పోవడంతో అక్కడి నుండి ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. కానీ అదే సమయంలో బార్ నుండి ఆ ఐటీ ఉద్యోగి బయటికి రాగా.. కొంతమంది కారులో కిడ్నాప్ చేసి ఆయనపై దాడి చేశారట. ఈ విషయంలో ఆ బాధితుడు హీరోయిన్ లక్ష్మీ మీనన్ తో పాటు ముగ్గురిపై ఎర్నాకులం నార్త్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
ఇక విషయంలోకి వెళ్తే.. అలువాకు చెందిన అలియార్ షా సలీంతో లక్ష్మీ మీనన్ గ్యాంగ్ కి బార్ లో గొడవ జరిగింది. ఆ తర్వాత సలీం బార్ నుండి బయటికి వెళ్లిపోగా లక్ష్మీ మీనన్ గ్యాంగ్ ఆయన వాహనాన్ని వెంబడించి , రాత్రి 11:45 గంటలకి నార్త్ రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గర సలీం కారుని ఆపి బలవంతంగా బయటికి లాగారట. ఆ తర్వాత సలీంని మరో వాహనంలోకి ఎక్కించి శరీరం, మొహం మీద దారుణంగా కొట్టి సైలెంట్ గా ఉండకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని బెదిరించి అక్కడి నుండి వెళ్లిపోయారట. దీంతో భయపడిన బాధితుడు కేస్ పెట్టాడు. బాధితుడు పెట్టిన కేసుని విచారించిన ఎర్నాకులం పోలీసులు లక్ష్మీ మీనన్ అలాగే మరో ముగ్గురిపై కేసు పెట్టారు. అయితే వీరిలో ఇప్పటికే అనీష్ , మిథున్, సోనామోల్ లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ లక్ష్మీ మీనన్ మాత్రం పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది.. అరెస్టు చేసిన వ్యక్తులు పోలీసుల కస్టడీలోనే ఉన్నప్పటికీ లక్ష్మీ మీనన్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.. ప్రస్తుతం లక్ష్మీ మీనన్ పై కిడ్నాప్ ఆరోపణలు మలయాళ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఇక 2011లో రాఘవింటే స్వాంతం రజియా అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీ మీనన్.. ఆ తర్వాత ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది. అలా తమిళ,తెలుగు, మలయాళ భాషల్లో రాణించిన లక్ష్మీ మీనన్ చివరిగా శబ్దం అనే మూవీలో కనిపించింది.
