Begin typing your search above and press return to search.

లద్దాఖ్‌ లో ఆందోళనలు... వాంగ్ చుక్ పై పోలీసులకు షాకింగ్ సందేహం!

అవును... లద్దాఖ్‌ కు రాష్ట్ర హోదాతో పాటు ఆక్కడి యువత కోసం కొన్ని డిమాండ్లతో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో నలుగురు చనిపోయారు.

By:  Raja Ch   |   28 Sept 2025 10:48 AM IST
లద్దాఖ్‌  లో ఆందోళనలు... వాంగ్  చుక్  పై  పోలీసులకు షాకింగ్  సందేహం!
X

లద్దాఖ్‌ కు రాష్ట్ర ప్రతిపత్తి కల్పించడంతోపాటు అక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని పునరుద్ధరించాలంటూ ఉద్యమం సాగిస్తున్న సోనమ్‌ వాంగ్‌ చుక్‌ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. లద్దాఖ్‌ కు రాష్ట్ర హోదాతో పాటు ఆక్కడి యువత కోసం కొన్ని డిమాండ్లతో ఆందోళనలు జరుగుతున్న వేళ ఓ కీలక విషయం తెరపైకి వచ్చింది.

అవును... లద్దాఖ్‌ కు రాష్ట్ర హోదాతో పాటు ఆక్కడి యువత కోసం కొన్ని డిమాండ్లతో జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఆందోళనల్లో నలుగురు చనిపోయారు. దీంతో ఈ విషయాన్ని కేంద్రం ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ సందర్భంగా లద్దాఖ్ డీజీపీ ఎస్.డి.సింగ్ జామ్వల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలో ఇప్పటికే సోనమ్‌ వాంగ్‌ చుక్‌ ను జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి రాజస్థాన్‌ లోని జోధ్‌ పుర్‌ జైలుకు తరలించారు. ఈ సమయంలో పోలీసులు ఆయనపై కొత్త కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ సందర్భంగా స్పందించిన డీజీపీ.. వాంగ్‌ చుక్‌ ప్రసంగాన్ని పరిశీలిస్తే.. ఆయన ప్రజల్ని ఉసిగొల్పారని అర్థమవుతోందన్నారు.

ఈ నిరసనల్ని ఒక పాకిస్థానీ గూఢచారి తమ దేశంతో పంచుకున్న నేపథ్యంలో వాంగ్‌ చుక్‌ కు పాకిస్థాన్‌ తో సంబంధాలున్నాయా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నామని వెల్లడించారు. తాము కాల్పులు జరపకపోతే లద్దాఖ్‌ యావత్తూ కాలి బూడిదయ్యేదని చెప్పారు. మూడు రోజులుగా విధించిన కర్ఫ్యూను సడలించినట్లు వెల్లడించారు.

కాగా... ప్రస్తుతం లద్దాఖ్ యువత దృష్టిలో హీరోగా మారిన సోనమ్ వాంగ్ చుక్ గురించి దేశ ప్రజలకు పరోక్షంగా తెలిసిందే! విద్యా వ్యవస్థపై వచ్చిన అమీర్ ఖాన్ సినిమా 'త్రీ ఇడియట్స్ సినిమాలో అమీర్ ఖాన్ పాత్ర పాత్ర కు స్ఫూర్తి సోనమ్ వాంగ్‌ చుక్. ఆయన ఓ వినూత్నమైన విద్యాసంస్థను నెలకొల్పారు.