Begin typing your search above and press return to search.

క‌ర్నూలు ఘోరం: బ‌స్సు ఓన‌రుకు రిమాండ్‌!

క‌ర్నూలు జిల్లా చిన్న‌టేకూరులో గ‌త నెల 23న తెల్ల‌వారు జామున జ‌రిగిన ఘోర బ‌స్సు ప్ర‌మాదంలో 19 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే.

By:  Garuda Media   |   7 Nov 2025 3:44 PM IST
క‌ర్నూలు ఘోరం:  బ‌స్సు ఓన‌రుకు రిమాండ్‌!
X

క‌ర్నూలు జిల్లా చిన్న‌టేకూరులో గ‌త నెల 23న తెల్ల‌వారు జామున జ‌రిగిన ఘోర బ‌స్సు ప్ర‌మాదంలో 19 మంది ప్ర‌యాణికులు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ కేసులో డ్రైవ‌ర్ ల‌క్ష్మ‌య్య‌ను మాత్ర‌మే పోలీసులు అరెస్టు చేశా రు. ఈయ‌న‌ను ఈ కేసులో ఏ-1గా పేర్కొన్నారు. అనేక కోణాల్లోనూ విచారించారు. ప‌ల్నాడు జిల్లాకు చెందిన ల‌క్ష్మ‌య్య‌.. 5వ తర‌గ‌తి వ‌ర‌కు చ‌దివి 10వ త‌ర‌గ‌తి ఫెయిలైన‌ట్టు స‌ర్టిఫికెట్లు సృష్టించాడు.

దీని ఆధారంగా హెవీ లైసైన్సు సంపాయించి.. బ‌స్సులు న‌డుపుతున్న‌ట్టు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌ను అరెస్టు చేశారు. మ‌రోవైపు.. బ‌స్సు య‌జ‌మానిపైనా కేసు న‌మోదు చేసినా.. గురువారం వ‌ర‌కు ఆయ‌న ఆచూకీ తెలియ‌లేద‌ని పోలీసులు తెలిపారు. అయితే.. అనూహ్యంగా శుక్ర‌వారం ఉద‌యం ఆయ‌న‌ను అరెస్టు చేసిన‌ట్టు క‌ర్నూలు పోలీసులు చెప్పారు. ఆ వెంట‌నే ఆయ‌న‌ను కోర్టులో హాజ‌రు ప‌ర‌చ‌గా 14 రోజ‌లు రిమాండ్ విధించిన‌ట్టు పేర్కొన్నారు.

అస‌లేం జ‌రిగింది?

చిన్నటేకూరు ర‌హ‌దారిపై శివ‌శంక‌ర్ అనే యువ‌కుడు, ఎర్రిస్వామితో క‌లిసి బైకుపై వ‌స్తూ.. స్కిడ్ అయి.. ప‌డిపోయారు. ఈ క్ర‌మంలో శివ‌శంక‌ర్ మృతి చెంద‌గా.. బైకు రోడ్డుపై అడ్డంగా ప‌డింది. ఇది జ‌రిగిన 10 నిమిషాల‌కు అర్ధ‌రాత్రి దాటిని త‌ర్వాత‌.. 2.45 ప్రాంతంలో వేమూరి కావేరి బ‌స్సు హైద‌రాబాద్ నుంచి బెంగ‌ళూరుకు వెళ్తూ.. ఈ బైకును ఢీ కొట్టి దూసుకుపోయింది. దీంతో మంట‌లు రాజుకుని. బ‌స్సు పూర్తిగా త‌గ‌ల‌బ‌డింది. ఈ ఘ‌ట‌న‌లో 19 మంది ప్ర‌యాణికులు కాలి బుగ్గ‌య్యారు.

య‌జ‌మానిని ముందే ప‌ట్టుకున్నారా?

తాజాగా వేమూరి కావేరీ ట్రావెల్స్ య‌జ‌మాని వేమూరి వినోద్‌ను గుట్టు చ‌ప్పుడు కాకుండా.. పోలీసులు రి మాండ్‌కు త‌ర‌లించారు. వాస్తవానికి గురువారం సాయంత్రం వ‌ర‌కు కూడా య‌జ‌మాని ఆచూకీ ల‌భించ‌లే ద‌ని పోలీసులు తెలిపారు. కానీ, ఉరుములు లేని పిడుగులా.. ఆయ‌న‌ను రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్టు మీడి యాకు స‌మాచారం ఇచ్చారు. వాస్త‌వానికి ఇలాంటి కేసుల్లో నిందితుల‌ను మీడియాకు కూడా చూపిస్తారు. అయితే.. దీనివెనుక ఏం జ‌రిగింద‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. 19 మంది మ‌ర‌ణించిన నేప‌థ్యంలో ఈ కేసును మ‌రింత వివాదం చేయడం ఇబ్బంది అవుతుంద‌ని భావించిన పోలీసులు ఆయ‌న‌ను నేరుగా కోర్టుకు హాజ‌రుప‌రిచిన‌ట్టు తెలిసింది.