ఆ విషయంలో బాబు జగన్ ఒక్కటి ... కుమారస్వామి కామెంట్స్ వైరల్ !
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జేడీఎస్ అగ్ర నేత డీకే కుమారస్వామి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించే క్రమంలో ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు.
By: Satya P | 7 July 2026 9:15 AM ISTకేంద్ర ఉక్కు శాఖ మంత్రి జేడీఎస్ అగ్ర నేత డీకే కుమారస్వామి కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించే క్రమంలో ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. ఇపుడు ఇవే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అభివృద్ధి విషయంలో ఏపీని చూసి కర్ణాటక ప్రభుత్వం నేర్చుకోవాలని కుమారస్వామి క్లాస్ పీకారు. రాజకీయాలకు అతీతంగా ఏపీలోని నేతలు అంతా ఏకం అవుతారు అని ఆయన ప్రశంసలు కురిపించారు. వారు అన్ని విధాలుగా ఏపీలో సాధించుకుంటున్నారు అంటే పార్టీలు చూసుకోకుండా కలిసికట్టుగా ముందుకు సాగడం వల్లనే అని కుమారస్వామి అర్ధం వచ్చే విధంగా వ్యాఖ్యానించారు.
వాటిని సాధించుకున్నారంటూ :
విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఘనమైన ఆర్థిక ప్యాకేజి ఏపీ రాజకీయ నేతలు అంతా ఒక్కటిగా ఉండి సాధించుకున్నారని కుమారస్వామి గుర్తు చేశారు. అలాగే అనకాపల్లిలో మిట్టల్ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ కూడా ఏపీ రాజకీయ పార్టీల నేతలు అంతా ఒక్కటిగా ఉండడం వల్లనే సాధ్యపడింది అని కూడా అన్నారు. రాజకీయాలను అభివృద్ధి విషయంలో పక్కన పెట్టి ఏపీ నేతలు ముందుకు పోతున్నారు అని దానిని చూసి కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు నేర్చుకోవాలని కుమారస్వామి హితబోధ చేశారు.
ఐక్యతలో విఫలం :
కర్ణాటక రాష్ట్రంలో అభివృద్ధికి రాష్ట్ర ప్రయోజనాలను సాధించే విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయింది అని కుమారస్వామి ఫైర్ అయ్యారు. ఆయన బెంగళూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీరుని పూర్తిగా తప్పు పట్టారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఏపీ నేతలకు ఉన్న చొరవ కర్ణాటక కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన మండిపడ్డారు.
చంద్రబాబు చొరవ :
ఇదిలా ఉంటే అనకాపల్లి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు చంద్రబాబు తనను స్వయంగా ఆహ్వానించారు అని కుమారస్వామి గుర్తు చేసుకున్నారు. విశాఖ ప్రజలు అంతా తనకు ఘన స్వాగతం పలికారు అని కూడా చెప్పారు. కేంద్రంతో కో ఆర్డినేట్ చేసుకుంటూ ఏపీఎకి పరిశ్రమలు తెచ్చుకుంటున్నారు అని కుమారస్వామి అనడం విశేషం. తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు అయినప్పటికీ కేంద్ర సహకారాన్ని పదే పదే కోరుతూ తెలంగాణాకు ఎలక్ట్రిక్ బస్సులు, స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులకు ప్రయత్నం చేస్తున్నారు అని గుర్తు చేసారు. తెలంగాణా అభివృద్ది విషయంలో అనేక సార్లు కేంద్ర పెద్దలను కలిసి రేవంత్ రెడ్డి వింజప్తులు చేస్తూ వస్తున్నారు అని అన్నారు.
కేంద్రంతో కో ఆర్డినేషన్ లేదు :
ఇదిలా ఉంటే తాను కేంద్ర మంత్రిగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తనతో కానీ కేంద్రంతో కానీ ఏ విషయం కో ఆర్డినేషన్ చేసుకోవడం లేదని కుమారస్వామి ఆగ్రహించారు. అందుకు ఉదాహరణ కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీకి సంబంధించిన మైనింగ్ కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వమే అడ్డంకులు సృష్టిస్తోందని ఆయన విమర్శించారు. దీని వల్ల వేలాది మంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఈ కంపెనీకి ఏ రకమైన సమస్యలు వచ్చినా దానికి రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యక్ష బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు. అంతే కాదు బెంగళూరు నగరంలో చెట్లను పెంచామని కాంగ్రెస్ మంత్రి చెబుతున్నారని అయితే గ్రౌండ్ లెవెల్ లో వరి నాటు వేసినట్లుగా చెట్లను నాటారని కుమార స్వామి విమర్శించారు. ఇక తాను కేంద్రంలో తాను భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా ఇబ్బందులు పెడుతోదని కుమారస్వామి ఫైర్ అయ్యారు. :
ఏపీలో అలా ఉన్నారా :
కేంద్ర మంత్రి చెప్పినట్లుగా ఏపీలో రాజకీయాలకు అతీతంగా అంతా కలసి ఉన్నారా అంటే అది ఏపీ ప్రజలకే తెలుస్తుంది అని అంటున్నారు. అయితే కుమారస్వామి కేంద్ర సహాకారం విషయంలో అని అంటున్నారు. ఈ విధంగా చూస్తే బాబు జగన్ ఇద్దరూ ఒక్కటిగా ఉంటున్నారు అన్నది తెలిసిందే. కేంద్ర ప్రాజెక్టుల విషయంలో జగన్ ఏ రకమైన ఇబ్బందులు పెట్టడం లేదు, పైగా కేంద్రాన్ని విమర్శించడం లేదు, దాంతో ఏపీలో అంతా ఒక్కటి అన్నది ఇప్పటిదాకా నెగిటివ్ గానే విమర్శలు చేస్తూ వచ్చాయి వామపక్షాలు. కానీ తొలిసారి కేంద్ర మంత్రి కుమారస్వామి మాత్రం కేంద్ర సాయం అందుకోవడంలో రాజకీయాలకు ఏపీలో అతీతంగా అంతా ఏకం అవుతున్నారని కొత్త కోణాన్ని కొత్త చర్చకు తెర పైకి తీసుకుని వచ్చారు. ఇది వేరీ ఇంట్రెస్టింగ్ గానే ఉంది మరి.
