Begin typing your search above and press return to search.

కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ... 24 గంటల తర్వాత ఏమి జరగబోతోంది?

అవును... బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   2 Oct 2024 4:46 PM GMT
కేటీఆర్ వర్సెస్ కొండా సురేఖ... 24 గంటల తర్వాత ఏమి జరగబోతోంది?
X

కేటీఆర్ పై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. బీఆరెస్స్ ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ మొదలుపెట్టి.. నాగచైతన్య - సమంత విడిపోవడానికి సైతం కేటీఆర్ కారణం అని సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు! ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కేటీఆర్ ఆమెకు డెడ్ లైన్ పెట్టారు!


అవును... బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే అటు నాగార్జున, ప్రకాశ్ రాజ్, ఆర్కే రోజా తో పాటు పలువురు స్పందించారు. ఈ సమయంలో సురేఖకు డెడ్ లైన్ విధించారు కేటీఆర్!

ఇందులో భాగంగా... కేటీఆర్‌ కు బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కొండా సురేఖకు లీగల్‌ టీమ్‌ పరువునష్టం నోటీసు పంపింది. ఆమె చేసిన ప్రకటనలు నిరాధారమైనవని, కేటీఆర్ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని లీగల్ నోటీసులో పేర్కొన్నారు. సినీ నటుల వ్యక్తిగత విషయాల్లో కేటీఆర్‌ కు ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు.

ఈ నేపథ్యంలోనే... 24 గంటల్లోగా కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని లేఖలో కోరారు. మంత్రి క్షమాపణలు చెప్పడంలో విఫలమైతే, ఆయన ప్రతిష్టను కాపాడేందుకు తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ లీగల్ టీమ్ పేర్కొంది. ఇందులో భాగంగా... క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావాతో పాటు క్రిమినల్ కేసులు వేస్తామని తెలిపింది.

ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో.. 24 గంటలు గడిచే లోపు మంత్రి కొండా సురేఖ ఈ విషయంపై స్పందిస్తారా.. క్షమాపణలు చెబుతారా.. వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారా..? మరోవైపు మంత్రి సురేఖ నుంచి స్పందన రానిపక్షంలో కేటీఆర్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతారనేది ఆసక్తిగా మారింది!