Begin typing your search above and press return to search.

‘నాతో పెట్టుకోకు’.. అన్న కేటీఆర్ కు డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చేసిన కవిత

ఇప్పుడు డైలాగులు మారిపోయాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి, ఆయన చెల్లెలు కవిత నేరుగా “నాతో పెట్టుకోకు బాసూ... సీన్ రివర్స్ అయిపోద్ది” అని హెచ్చరించడంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

By:  A.N.Kumar   |   29 Sept 2026 3:31 PM IST
‘నాతో పెట్టుకోకు’.. అన్న కేటీఆర్ కు డైరెక్టుగా వార్నింగ్ ఇచ్చేసిన కవిత
X

తెలంగాణ రాజకీయం అంటేనే ఓ డ్రామా.. సీట్ ఎడ్జ్ త్రిల్లర్. అయితే ఈసారి థియేటర్లలో కాదు.. సొంత ఇంటి కాంపౌండ్ వాల్‌లోనే అసలు సీన్ ప్లే అవుతోంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు అన్నా-చెల్లెళ్ల సవాళ్లు పార్ట్-2 సూపర్ హిట్‌గా నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బహిష్కరించిన తర్వాత కేటీఆర్ తో కవితకు దూరం బాగా పెరిగింది. ఇప్పుడు డైలాగులు మారిపోయాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కి, ఆయన చెల్లెలు కవిత నేరుగా “నాతో పెట్టుకోకు బాసూ... సీన్ రివర్స్ అయిపోద్ది” అని హెచ్చరించడంతో పొలిటికల్ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

విషయం ఏంటంటే... పార్టీ ఎందుకు ఓడిపోయింది? నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సుప్రీం అని కేసీఆర్ ఇచ్చిన ఓవరాక్షన్ ఆప్షనే ముంచేసిందా? అంటూ కేటీఆర్ గారు రివ్యూలు, అనాలిసిస్‌లు మొదలుపెట్టారు. పోనీలే ఏదో వారి పార్టీలో ఆత్మపరిశీలన చేసుకుంటున్నారని అంతా అనుకునేలోపే... చెల్లెమ్మ కవిత రంగంలోకి దిగారు. “ఏంటి అన్నయ్యా... నీ చేతగానితనాన్ని తీసుకెళ్లి పెద్దాయన కేసీఆర్ ఖాతాలో వేస్తున్నావా?” అంటూ గట్టిగానే క్లాస్ పీకారు. అంతేకాదు కేటీఆర్ ఎవరో “గుంటనక్క మైండ్ గేమ్”లో పడిపోయారని.. మైండ్ బ్లాక్ అయ్యేలా ఒక రేంజ్‌లో సెటైర్లు పేల్చారు.

ఇంతటితో ఆగిపోతే అది పొలిటికల్ సీరియల్ ఎందుకు అవుతుంది? గణేష్ నిమజ్జనం రోజున డబ్బులిచ్చి మరీ కేసీఆర్ పాటలు పెట్టించారంటూ కవిత గారు ఒక బాంబు పేల్చారు. "నా దగ్గర అన్నిటికీ కచ్చితమైన ప్రూఫ్‌లు ఉన్నాయిరా భాయ్... నాతో పెట్టుకుంటే ఆధారాలు బయటపెడతా" అని వార్నింగ్ ఇవ్వడంతో అసలు కథ ఇప్పుడే మొదలైంది.

ఎమ్మెల్యేల జోక్యం, నాయకత్వ లోపాలు, వర్గపోరు అంటూ కేటీఆర్ ఎంత కవర్ చేద్దామని చూసినా కవిత మాత్రం "అంతేలే... విజయం వస్తే మీది.. ఓటమి వస్తే మాత్రం డ్యాడీదా?" అని పాయింట్ టు పాయింట్ లాజిక్‌లతో కౌంటర్లు ఇచ్చేశారు. మొత్తానికి విపక్షాలకు మైక్ దొరకకముందే సొంత ఇంట్లోనే "నాతో పెట్టుకోకు" అంటూ డైరెక్ట్ వార్నింగ్స్ నడుస్తుంటే గులాబీ కేడర్ మాత్రం "అన్నా చెల్లెలు ఫైటింగ్ చూసి మేమేం అయిపోవాలి సామీ" అని తలలు పట్టుకుంటోంది. మరి ఈ ఆధారాల కథ ఏ మలుపు తిరుగుతుందో.. రాబోయే రోజుల్లో ఈ అన్నాచెల్లెళ్ల సవాల్ ఇంకెన్ని ట్విస్టులు ఇస్తుందో చూడాలి..