Begin typing your search above and press return to search.

కేటీఆర్ గడ్డం మీద రేవంత్ సెటైర్లు !

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గడ్డం, మీసం పెంచుతూ కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సెటైర్లు వేశారు. ఎన్ని జన్మలు ఎత్తినా తనలా కేటీఆర్ కాలేరని వ్యాఖ్యానించారు. కేసీఆర్ తన కుమారుడికి చిల్లర వేషాలు తగ్గించుకోవాలని చెప్పాలంటూ విమర్శించారు. రేవంత్ వ్యాఖ్యలతో కేటీఆర్ గడ్డం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

By:  Satya P   |   8 Nov 2026 10:13 AM IST
కేటీఆర్ గడ్డం మీద రేవంత్ సెటైర్లు !
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మధ్య గడ్డం మీసం పెంచుతున్నారు. దాంతో ఆయన కొత్త లుక్ తో క్యాడర్ ని ఆకట్టుకుంటున్నారు. అదే విధంగా ఆయన సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నారు. కేటీఆర్ అంటే చాన్నాళ్ళుగా జనం మదిలో ఉన్న బొమ్మ చెదిరిపోయి కొత్తగా కనిపిస్తున్నారు అని అంటున్నారు. క్లీన్ గా మీసం గడ్డం షేవ్ చేసుకుని కనిపించే కేటీఆర్ ఎందుకు గడ్డం పెంచుతున్నారు అంటే రఫ్ లుక్ కోసం మాస్ ఇమేజ్ కోసం అన్న మాట కూడా వినిపిస్తోంది. కేటీఆర్ తన భాషలో తెలంగాణా యాసతో కలిపి కాంగ్రెస్ మీద రేవంత్ రెడ్డి మీద ఘాటు విమర్శలు చేస్తూ వస్తున్నారు, అలాగే ఆయన రేవంత్ ని పలు సార్లు సవాల్ కూడా చేస్తూ వచ్చారు. ఇలా మాస్ అవతార్ లో కనిపించాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒక ఎత్తుగా ఉన్నాయి. దానికి మరింత దట్టించి ఏకంగా మేకోవర్ లోనే కొత్తగా కనిపించాలని కేటీఆర్ అనుకున్నరో ఏమో తెలియదు కానీ గత కొన్నాళ్ళుగా గడ్డం మీసంతో ఆకట్టుకుంటున్నారు.

ఎప్పటికీ రేవంత్ కాలేవు :

ఇక రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ సభలో మాట్లాడుతూ కేటీఆర్ గడ్డం మీసం పెంచడం మీద హాట్ కామెంట్స్ చేశారు. రేవంత్ రెడ్డికి గడ్డం ఉంది అని ఎవరో చెబితే కేటీఅర్ తన మాదిరిగా కనిపించాలని గడ్డం పెంచుతున్నారని రేవంత్ సెటైర్లు వేశారు. ఎన్ని జన్మలు ఎత్తినా రేవంత్ లా కేటీఆర్ కాలేరు అని ఆయన గట్టిగానే చెప్పారు. కార్యకర్తలను గుండెలలో పెట్టుకునే రేవంత్ ఎక్కడ కేటీఆర్ ఎక్కడ అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అయినా తన కొడుకు కేటీఆర్ కి మంచి చెప్పాలని చిల్లర వేషాలు తగ్గించుకోవాలని హిత బోధ చేయాలని రేవంత్ కోరడం విశేషం.

కొత్త రకంగా ఉంది :

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ గడ్డం గురించి మాట్లాడటం కొత్తరకంగా ఉంది అని బీఆర్ ఎస్ నాయకులు అంటున్నారు. సీఎం గా ఆయన పాలించాల్సింది ప్రజలను వారి బాగోగులు చూడాల్సింది ఉందని గుర్తు చేస్తున్నారు. తమ నాయకుడు గడ్డం పెంచితే ఏమిటి అభ్యంతరం అంటున్నారు. మరో వైపు చూస్తే కేటీఆర్ గడ్డం ఇపుడు రేవంత్ రెడ్డి కామెంట్స్ తో మరింత పాపులర్ అవుతుందా అన్న చర్చ వస్తోంది. ఇదే గడ్డం పెంచిన మీసంతో ఈ మధ్యనే చెన్నై వెళ్ళి ఏపీ మాజీ సీఎం జగన్ తో అలాగే తమిళనాడు సీఎం విజయ్ తో వేదికను కేటీఆర్ పంచుకున్నారు. ఈ ముగ్గురూ ఒకే ఫ్రేంలో కనిపించడంతో వైరల్ అయింది. సోషల్ మీడియాలో ఆ ముచ్చట సాగుతుండగానే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ తో మరోసారి కేటీఆర్ గడ్డం చర్చకు వస్తోంది. దీని మీద కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది అని అంటున్నారు.