షాకింగ్: రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు..!
కట్ చేస్తే.. సదరు గ్లోబరీనా సంస్థకు.. సీబీఎస్ ఈ నుంచి కాంట్రాక్టు ఇప్పించింది.. కేటీఆరేనని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు.
By: Garuda Media | 23 July 2026 11:44 PM ISTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్.. బీఆర్ ఎస్ నాయకుల మధ్య రాజకీయ పోరాటం జరుగు తున్న విషయం తెలిసిందే. పలు అంశాలపై ఇరు పక్షాలు వాడివేడిగా విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ దుమారం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనకు తక్షణమే సీఎం క్షమా పణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
వివాదం ఏంటి?
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ ఈ) సంస్థకు సంబంధించి విద్యార్థులు రాసే జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు.. హైదరాబాద్‌కు చెందిన `గ్లోబరీనా` అనే సంస్థ కాంట్రాక్టు తీసుకుంది. అయితే.. సరిగా మూల్యాంకనం చేయకపోవడం.. తక్కువ మార్కులు వచ్చి న వారికి ఎక్కువ వేయడం.. బాగా రాసిన వారికి తక్కువ మార్కులు వేయడం వంటి అనేక అవకతవకలు వెలుగు చూశాయి. దీనిపై పెద్ద ఎత్తున జాతీయస్థాయిలో దుమారం రేగింది.
కట్ చేస్తే.. సదరు గ్లోబరీనా సంస్థకు.. సీబీఎస్ ఈ నుంచి కాంట్రాక్టు ఇప్పించింది.. కేటీఆరేనని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఆరోపించారు. విద్య , విద్యార్థులు గురించి మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని కూడా ఆయన ఆక్షేపించారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న గ్లోబరీనా సంస్థను భుజాలపైకి ఎత్తుకుని మోసింది కేటీఆరేనని దుయ్యబట్టారు. ఆయనకు ఈ క్రమంలో భారీగా ముడుపులు అందాయని కూడా ఆరోపించారు.
ఈ ఆరోపణలపైనే కేటీఆర్ తాజాగా స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ముడుపుల ఆరోపణలను నిరూపించాలని కేటీఆఆర్ సవాల్ రువ్వారు. నిరూపించకపోతే.. గడువు లోగా తనకు బహిరంగ క్షమాపణ లు చెప్పాలని అన్నారు. ఈ మేరకు తాజాగా గురువారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి నివాసానికే నేరు గా లీగల్ నోటీసులు పంపించారు. తనకు గ్లోబరీనా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని.. పొద్దుపోక.. పాలన చేతకాక.. రేవంత్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.
