Begin typing your search above and press return to search.

కేటీఆర్ ఢిల్లీ టూర్స్...ప్లాన్ అదుర్స్ !

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ఢిల్లీ టూర్స్ చేస్తున్నారు. తెలంగాణాలో అధికారంలో ఆ పార్టీ లేదు కదా మరి ఏమిటి పని అంటే అక్కడే మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు.

By:  Satya P   |   30 July 2026 1:18 AM IST
కేటీఆర్ ఢిల్లీ టూర్స్...ప్లాన్ అదుర్స్ !
X

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుసగా ఢిల్లీ టూర్స్ చేస్తున్నారు. తెలంగాణాలో అధికారంలో ఆ పార్టీ లేదు కదా మరి ఏమిటి పని అంటే అక్కడే మాస్టర్ ప్లాన్ ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ ఒకనాడు జాతీయ పార్టీగా మారాలని అనుకుంది అన్నది తెలిసిందే. అందుకే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా పేరు మార్చారు అన్నది కూడా అందరికీ విధితమే. ఇక 2023లో ఆ పార్టీ అధికారంలో నుంచి ప్రతిపక్షంలోకి వచ్చింది. అయితే కేసీఆర్ కి జాతీయ రాజకీయాలు ఇష్టం. ఆయన కొన్నాళ్ళు యూపీయే వన్ లో కేంద్ర మంత్రిగా పనిచేశారు.

జాతీయం దృష్టితో :

ఇక చూస్తే బీఆర్ఎస్ ఢిల్లీలో సొంతంగా పార్టీ భవనం నిర్మించింది. బీఆర్ స్ కి 2024 ఎన్నికల్లో చూస్తే లోక్ సభలో ఎంపీలు అయితే గెలిచింది లేదు, రాజ్యసభలో కూడా బాగా తగ్గిపోయారు. అయినా సరే ఢిల్లీలో బీఆర్ఎస్ తనదైన పాత్ర పోషించాలని ఆరాటపడుతోంది. 2028 లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ కచ్చితంగా తెలంగాణాలో గెలుస్తామని బీఆర్ఎస్ కి గట్టి నమ్మకం ఉంది. అంతే కాకుండా 2029 లో తెలంగాణాలో ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుని కేంద్రంలో కొత్తగా ఏ ప్రభుత్వం ఏర్పాటు కావాలన్నా కూడా తన పాత్ర ఉండేలా చూసుకోవాలని ఆలోచిస్తోంది అని అంటున్నారు.

రేవంత్ మీద ఒత్తిడికి :

ఈ క్రమంలో జాతీయ స్థాయిలో తమ పరపతి మళ్ళీ పెంచుకునే ప్రయత్నంలోనే కేటీఆర్ తరచూ ఢిల్లీ పర్యటనలు చేపడుతున్నారు అని అంటున్నారు. అంతే కాదు ఈ పర్యటనలో భాగంగా ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. తెలంగాణాలోని సమస్యలను చెబుతున్నారు. పలు అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తున్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఆగిన వాటిని పూర్తి చేయమని కోరుతున్నారు. తెలంగాణాకు అవసరమైన సాయం చేయమని అంటున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గట్టి ఒత్తిడి పెట్టడమే రాజకీయ వ్యూహం అని అంటున్నారు. ప్రతిపక్షంలో ఉన్న తాము తెలంగాణా అభివృద్ధి కోసం గట్టిగా కృషి చేస్తున్నామని కేంద్ర మంత్రులను కలిసి పలు ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నామని చెప్పడం కూడా అందులో భాగం. ఒకవేళ వాటి విషయంలో అధికార కాంగ్రెస్ కనుక మాట్లాడకపోతే మాత్రం దానిని జనంలో పెట్టి టార్గెట్ చేయాలన్న వ్యూహం కూడా పక్కాగా ఉంది అని అంటున్నారు.

వరస భేటీలతో :

ఈ మధ్యనే కేటీఅర్ ఢిల్లీ వెళ్ళి కేంద్ర మంత్రులు కుమార స్వామి అలాగే రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లతో సమావేశం అయ్యారు. తద్వారా వారికి తెలంగాణాలో సమస్యలు చెప్పారు. రైల్వే ప్రాజెక్టులు ఐటీ ప్రాజెక్టుల గురించి చర్చించారు. అలాగే ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కూడా కేటీఆర్ కోరారు. వీటి ద్వారా తెలంగాణా అభివృధి పట్ల బీఆర్ఎస్ కి ఉన్న చిత్త శుద్ధిని చాటుకుంటున్నట్లుగా బీఆర్ ఎస్ తెలియచేస్తోంది. దాంతో పాటుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీటి మీద ఏమి చేస్తోంది అని గట్టిగా ప్రశ్నిస్తోంది. మొత్తం మీద బీఆర్ఎస్ వర్తమాన భవిష్యాతు ఆలోచనలతోనే ఢిల్లీ పర్యటనలు చేస్తోంది అని అంటున్నారు. వీటి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాల్సిందే.