Begin typing your search above and press return to search.

ఏమైంది.. ఈ రాజుల‌కు.. ఇంత అసంతృప్తా.. !

క్షత్రియ సామాజిక వర్గంలో అసంతృప్తి నెలకొంది. పైకి కనిపించకపోయినా అంతర్గతంగా మాత్రం క్షత్రియ సామాజిక వర్గం తీవ్ర స్థాయిలో ఆవేదన ఆందోళన కూడా వ్యక్తం చేస్తుండడం గమనార్హం

By:  Garuda Media   |   2 Feb 2026 5:00 AM IST
ఏమైంది.. ఈ రాజుల‌కు.. ఇంత అసంతృప్తా.. !
X

క్షత్రియ సామాజిక వర్గంలో అసంతృప్తి నెలకొంది. పైకి కనిపించకపోయినా అంతర్గతంగా మాత్రం క్షత్రియ సామాజిక వర్గం తీవ్ర స్థాయిలో ఆవేదన ఆందోళన కూడా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఒకటి తమకు సరైన ప్రాతినిథ్యం లేదనే వాదన వినిపిస్తుంటే, మరో వాదన కొంతమంది క్షత్రి సామాజిక వర్గంలో చీలికలు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అన్నది. కానీ, పైకి అందరూ బాగానే ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. కానీ, అంతర్గతగా మాత్రం క్షత్రియ సామాజిక వర్గంలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందని తెలుస్తోంది.

గత ఏడాది జరిగిన కీలక పరిణామాల నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు కేసు ఇప్పటికీ తేలక పోవడం, పైగా ఓ అధికారి ఆయనను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించి నానా రభస సృష్టించినప్పటికీ సదరు అధికారిపై ఎటువంటి చర్యలు చేపటకపోవడం.. అదేవిధంగా రఘురామ‌ కృష్ణరాజుకు మద్దతుగా ఎవరు నోరు విప్పకపోవడం వంటివి ఆ వర్గంలో ఒకింత ఆవేదనకు దారి తీసిన పరిస్థితులు క‌నిపిస్తున్నాయి. అదే ఇత‌ర నాయ‌కుల‌ను అంటే ఆ సామాజిక వ‌ర్గాలు స్పందిస్తున్నాయ‌ని.. త‌మ‌కు మాత్రం మద్ద‌తుగా ఎవ‌రూ ఉండ‌డం లేద‌ని అంటున్నారు.

అలాగే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు కీలక నాయకులు గత ఎన్నికల్లో తమ సీట్లను త్యాగం చేసి అధినేత చెప్పినట్టు నడుచుకున్నారు. కానీ, దాదాపు రెండేళ్లు అవుతున్నా వారికి ఎలాంటి గుర్తింపు లేకపోగా నామినేటెడ్ పదవులు కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా క్షత్రియ సామాజిక వర్గాన్ని ఆలోచనలో పడేసేలా చేసింది. ఇక వ్యాపారాల పరంగా కూడా గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు పరిస్థితులు లేవని వారు చెబుతున్న మాట తరచుగా వినిపిస్తోంది.

మరి దీనికి కారణం ఎవరు ఏం జరుగుతోంది.. క్షేత్రస్థాయిలో ఎవరు ప్రలోభాలకు గురవుతున్నారు అనేది ప్రభుత్వం, పార్టీ స్థాయిలో చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే ఈ వర్గం పార్టీకి దూరమైనా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదనేది విశ్లేషకులు చెబుతున్న మాట. బిజెపి వైపుకు మళ్ళితే అది వచ్చే ఎన్నికల నాటికి ఏ విధంగా మారుతుంది.. రాజకీయ పరిణామాలు ఎలా మారతాయి అనేది కూడా ఆసక్తిగా మారింది. ఏదేమైనా ప్ర‌స్తుతం క్ష‌త్రియ సామాజిక వ‌ర్గంలో అసంతృప్తి నివురుగ‌ప్పిన నిప్పులా ఉంద‌న్న‌ది వాస్త‌వం.