నా అఫైర్ తో మిగతా వాళ్లకేంటి సమస్య.. కిస్ క్యామ్ ‘క్రిస్టిన్’ స్టేట్ మెంట్ వైరల్
సోషల్ మీడియా యుగంలో ఒక చిన్న పొరపాటు లేదా అనుకోని క్షణం ఒఖ వ్యక్తి జీవితాన్ని ఎంతలా తలకిందులు చేయగలదో చెప్పడానికి ఇటీవలి ‘కిస్ క్యామ్’ ఘటనే నిదర్శనం.
By: A.N.Kumar | 19 Dec 2025 11:10 AM ISTసోషల్ మీడియా యుగంలో ఒక చిన్న పొరపాటు లేదా అనుకోని క్షణం ఒఖ వ్యక్తి జీవితాన్ని ఎంతలా తలకిందులు చేయగలదో చెప్పడానికి ఇటీవలి ‘కిస్ క్యామ్’ ఘటనే నిదర్శనం. కోల్డ్ ప్లే కన్సర్ట్ లో జరిగిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న ‘క్రిస్టిన్’ తాజాగా తన మౌనాన్ని వీడారు. ఈ మొత్తం వ్యవహారంపై ఆమె వ్యక్తం చేసిన ఆవేదన.. సమాజం స్పందించిన తీరు ఇప్పుడు వైరల్ గా మారింది.
కోల్డ్ ప్లే కన్సర్ట్ అంటేనే వేలమంది అభిమానుల కోలాహలం. అక్కడ సరదాగా సాగే ‘కిస్ క్యామ్’ ఈసారి వివాదానికి కేంద్రబిందువైంది. కెమెరా క్లిక్ మన్న క్షణంలో క్రిస్టిన్ చేసిన పని ఆమె కెరీర్ ను, వ్యక్తిగత ప్రతిష్టను ప్రశ్నార్థకం చేసింది.
తాజా ఇంటర్వ్యూలో క్రిస్టిన్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఆమె ప్రధానంగా లేవనెత్తిన అంశాలున్నాయి. ‘నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నాను. దానికి పూర్తి బాధ్యత నాదే’ అని ఆమె అంగీకరించారు. ‘నాకు ఎవరితో అఫైర్ ఉంటే మిగతా వారికి ఎందుకు సమస్య? ఇది నా వ్యక్తిగత జీవితం ’ అని ఆమె ప్రశ్నించారు.
కేవలం ఒక వీడియో వల్ల తన ఉద్యోగాన్ని కోల్పోవడం.. సమాజం తనను ఒఖ ‘మీమ్’ గా మార్చేయడం తనను మానసిక క్షోభకు గురిచేసిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సోషల్ మీడియా ట్రోలింగ్.. ఒక శాపం
ఈ ఘటన సోషల్ మీడియాలోని చీకటి కోణాన్ని మరోసారి బయటపెట్టింది. ఒక వ్యక్తి నేపథ్యం ఏంటో తెలియకుండానే ఒక చిన్న వీడియో క్లిప్ ఆధారంగా వేలమంది వారి క్యారెక్టర్ ను నిర్ణయించేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో జరిగిన పొరపాట్లకు వృత్తిపరమైన జీవితం బలికావడం ఎంతవరకూ సమంజసమనే చర్చ మొదలైంది.విమర్శల పేరుతో చేసే వ్యక్తిత్వ హననం ఒక మనిషిని నిరుద్యోగిగా , మానసిక రోగిగా మారుస్తుంది.
మనం నేర్చుకోవాల్సిన పాఠం
క్రిస్టిన్ ఘటన మనకు ఒక హెచ్చరిక. బహిరంగ ప్రదేశాల్లో మన ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండడంతోపాటు , ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకునేటప్పుడు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసేటప్పుడు కొంత సంయమనం పాటించడం అవసరం. ‘నేను మనిషిని.. నన్ను మనిషిగా చూడండి’ అని క్రిస్టిన్ చేసిన విజ్ఞప్తి నేటి డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.
