Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ పై కొండా : నాడు రోశయ్య...నేడు రేవంత్

కట్ చేస్తే తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రవేశం తరువాత కొండా సురేఖ ఆయనకు మద్దతుగా నిలిచారు.

By:  Satya P   |   17 Oct 2025 7:52 PM IST
కాంగ్రెస్ పై కొండా : నాడు రోశయ్య...నేడు రేవంత్
X

కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ పార్టీ హైకమాండ్ ఎక్కడో దూరంగా ఢిల్లీలో ఉంటుంది. నాయకులు అందరూ ఎవరికి వారుగా స్వేచ్ఛగా ఉంటారు. ఎవరు ఎవరిని అయినా టార్గెట్ చేస్తూ ఉంటారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూంటారు. ఇక హైకమాండ్ కి వెళ్ళి ఫిర్యాదు చేసేవారు ఉంటారు, అక్కడ నుంచి ఇక్కడకు వచ్చి మళ్ళీ మీడియాతో మాట్లాడుతారు. ఈ విధంగా కాంగ్రెస్ లో అతి స్వేచ్చ మూలంగా లాభాల కంటే నష్టాలే ఎక్కువ జరిగాయన్నది చరిత్ర నిరూపిస్తున్న విషయం. అయినా కాంగ్రెస్ అనే సంస్థలో అంతర్గత ప్రజాస్వామ్యమే బలం. అందుకే ఆ పార్టీలో ఉన్న వారు వేరే పార్టీలో ఉండలేరు అని కూడా చెబుతారు.

కొండా విత్ కాంగ్రెస్ :

తెలంగాణా రాజకీయాల్లో కొండా సురేఖ ఫైర్ బ్రాండ్. ఆమె రాజకీయానికి అదే బలం. అదే బలహీనత కూడా. ఆమె ఎమ్మెల్యే అయ్యాక వైఎస్సార్ తన కేబినెట్ లో మంత్రిగా తీసుకున్నారు. అలా వైఎస్సార్ కుటుంబంతో మంచి అనుబంధం పెనవేసుకున్నారు. చివరికి అదే ఆమె మంత్రి పదవిని ఎసరు పెట్టింది. వైఎస్సార్ దుర్మరణం తరువాత జగన్ ని సీఎం చేయాలని చాలా మంది నేతలు పట్టుబట్టారు. కానీ ఎవరూ కూడా హైకమాండ్ మనసు ఎరిగి మరింతగా ముందుకు సాగలేదు. కానీ కొండా సురేఖ మాత్రం జగన్ విషయంలో చాలా పట్టుదలగా వ్యవహరించారు. ఫలితంగా ఆమె మంత్రి పదవిని కూడా వదులుకున్నారు. వైఎస్సార్ తర్వాత రోశయ్య ముఖ్యమంత్రి అయితే ఆయనకు తొలి అసమ్మతి కొండా సురేఖ నుంచే ఎదురైంది. ఆయన సీఎం గా ఉండగా మంత్రిగా ఉండనంటూ ఆమె తీసుకున్న రాజకీయ వైఖరి పెద్దాయనకు తెగ ఇబ్బందిని పెట్టింది అని చెబుతారు.

రేవంత్ కి సపోర్ట్ :

కట్ చేస్తే తెలంగాణా కాంగ్రెస్ రాజకీయాల్లో రేవంత్ రెడ్డి ప్రవేశం తరువాత కొండా సురేఖ ఆయనకు మద్దతుగా నిలిచారు. కాంగ్రెస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి ఎదిగిన తరువాత ఆయనతో పాటే ఆమె ఉంటూ పూర్తి సమర్ధుకురాలిగా వ్యవహరించారు. ఇక రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆమెకు మంత్రి పదవి దక్కింది. ఇక రేవంత్ రెడ్డి పాలనకు రెండేళ్ళు దగ్గర పడుతున్న వేళ ఒక కేబినెట్ మంత్రి సీనియర్ లీడర్, బీసీ మహిళా నాయకురాలు కొండా సురేఖ ఎపిసోడ్ ఒక విధంగా ప్రభుత్వానికి ఇబ్బందికరంగానే ఉంటుందని అంటున్నారు.

రీజన్స్ ఏవైనా :

ఇక చూస్తే కొండా సురేఖ వైపు నుంచి రీజన్స్ ఉన్నాయా లేక ఆమెకు సీఎం తో గ్యాప్ ఉందా ఏ ఇష్యూ నుంచి మొదలై ఎంతదాకా అవి నడిచాయి, ఎక్కడికి వెళ్తాయి అన్నది పక్కన పెడితే ఈ కీలక సమయంలో ఇపుడు ఒక సీనియర్ మంత్రి వర్సెస్ సర్కార్ అన్నట్లుగా సాగుతున్న ప్రచారం అయితే ప్రభుత్వానికి ఏమంత మంచిది కాదనే అంటున్నారు. అంతే కాదు పార్టీ పరంగా కూడా అది కొంత ఇరకాటాన్ని కలిగించే విషయంగానే చూస్తున్నారు.

ఎటు చూసినా అంతేనా :

కొండా సురేఖ ఫైర్ బ్రాండ్. ఆమెని కేబినెట్ లో కంటిన్యూ చేసినా ఒకసారి ఏర్పడిన విభేదాలు కానీ గ్యాప్ కానీ అంత ఈజీగా సర్దుకోవు అన్నది అయితే ఉంది. అంతే కాదు ఆమెను కనుక పక్కన పెట్టాలనుకున్నా ఒక బీసీ మహిళ విషయంలో ఈ విధంగా దూకుడుగా రాజకీయాలు చేస్తారు అన్న పేరున్న ఆమె విషయంలో ఆచీ తూచీ డెసిషన్ ఉండాలనే అంటున్నారు. విస్తరణలో ఒక వేళ పక్కన పెట్టినా అది కాంగ్రెస్ కి అందునా రేవంత్ రెడ్డి రాజకీయ వ్యూహాలకు ఏ మేరకు సవాల్ గా మారుతుంది అనేది కూడా చూడాల్సి ఉందని అంటున్నారు. మొత్తానికి చూస్తే కాంగ్రెస్ మీద కొండా అన్నది ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా ఉంది. ఇది విపక్ష బీఆర్ ఎస్ కి వీలైతే బీజేపీకి కూడా పొలిటికల్ అడ్వాంటేజ్ గా ఏ మేరకు ఉంటుంది అన్నది చూడాల్సి ఉంది.