Begin typing your search above and press return to search.

హత్యాయత్నం కేసులో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ !

దీంతో సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసి, ఘటన జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తుండడంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు.

By:  Tupaki Political Desk   |   20 Aug 2026 10:33 PM IST
హత్యాయత్నం కేసులో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ !
X

హైదరాబాద్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ తో పాటు 5 మంది మీద హత్యాయత్నం కేసు నమోదు అయింది. తన అనుచరులతో కలిసి సుమంత్ రూ.10 కోట్లు డిమాండ్ చేశారని, డబ్బు ఇవ్వలేదని ఇనుపరాడ్లతో దాడి చేసి హత్యాయత్నం చేశారని హరికృష్ణ అనే వ్యాపారి ఫిర్యాదు చేశాడు.

దీంతో సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసి, ఘటన జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పరిధిలోకి వస్తుండడంతో జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు కేసును బదిలీ చేశారు. బుధవారం కొండా సురేఖ జన్మదినం సందర్భంగా ఆమె కూతురు కొండా సుష్మిత సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, ఎంపీ వేగం నరేందర్ రెడ్డి ల మీద తీవ్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకుంది.

కాలుష్య నియంత్రణ మండలిలో కాంట్రాక్ట్ ఉద్యోగిగా ఉన్న సుమంత్ కొండా సురేఖ వద్ద ఓఎస్డీగా జాయిన్ అయ్యారు.సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి కార్యాలయంలో డెక్కన్ సిమెంట్ ప్రతినిధులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపణలు రావడంతో అతన్ని విధుల నుండి తప్పించారు.

మంత్రి కొండా సురేఖకు తెలియకుండా తొలగించడంతో పాటు, అరెస్ట్ చేసేందుకు మంత్రి నివాసానికి మఫ్టీలో పోలీసులు రావడంతో అప్పట్లో మంత్రి కుమార్తె సుష్మిత పోలీసులను అడ్డుకుని రేవంత్ రెడ్డి, పొంగులేటి ల మీద ఆరోపణలు చేసింది. తాజాగా సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో సుమంత్ కేసు తెరమీదకు రావడం గమనార్హం.