కొండాకు ఢిల్లీ పిలుపు...లెటర్ కి రెస్పాన్స్ ?
కుమార్తె చేసిన దానికి తల్లిని శిక్షిస్తారా అన్నది అయితే రాజకీయ వర్గాలతో పాటు బలమైన బీసీ సామాజంలోనూ చర్చగా వెళ్ళిపోయింది. దాంతో కాంగ్రెస్ అధినాయకత్వం దీని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.
By: Satya P | 12 Sept 2026 11:07 PM ISTతెలంగాణా కాంగ్రెస్ ప్రభుత్వంలో బర్తరఫ్ అయిన ఒక బీసీ మహిళా మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. ఆమె విషయంలో జరిగింది తప్పు అయినా శిక్ష కూడా పెద్దది అన్న భావన అయితే అంతటా కలిగింది. అంతే కాదు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకురాలిగా ఆమె ఉన్నారు. దాంతో బీసీలలో కూడా కొంత అలజడి చెలరేగింది. ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. కొండా సురేఖ కుమార్తె సుస్మిత నేరుగా ముఖ్యమంత్రి మీద తీవ్ర విమర్శలు చేయడాన్ని ఎవరూ సపోర్ట్ చేయడం లేదు, అది తప్పే అంటున్నారు, అదే సమయంలో కొండా సురేఖ డైరెక్ట్ గా ఈ విషయంలో తప్పు చేయలేదు కదా అన్న వాదన ఉంది. కుమార్తె చేసిన దానికి తల్లిని శిక్షిస్తారా అన్నది అయితే రాజకీయ వర్గాలతో పాటు బలమైన బీసీ సామాజంలోనూ చర్చగా వెళ్ళిపోయింది. దాంతో కాంగ్రెస్ అధినాయకత్వం దీని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టినట్లుగా చెబుతున్నారు.
లేఖలో సారాంశం :
ఇక కొండా సురేఖ తనను ఒక పద్ధతి ప్రకారం అణచాలని కొందరు పార్టీలో చూస్తున్నారు అని ఆరోపించారు. దాని ఫలితంగానే వ్యవహారం ఇంతదాకా తెచ్చారు అని అన్నారు. తన మంత్రిత్వ శాఖలో స్వేచ్చ లేకుండా చేశారు అని కొందరు జోక్యం చేసుకుంటున్నారు అని ఆమె కీలక విమర్శలు చేశారు. ప్రస్తుతం తెలంగాణా కాంగ్రెస్ లో ప్రభుత్వంలొ జరుగుతున్న పరిణామాలను ఆమె ప్రస్తావిస్తూ తన బర్తరఫ్ తరువాత సోనియా గాంధీకి మల్లికార్జున ఖర్గే కు లేఖ రాశారు. దాని మీదనే రియాక్ట్ అయిన కాంగ్రెస్ అగ్ర నాయకత్వం ఆమెను ఢిల్లీకి పిలిపిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ప్రాధాన్యత ఇస్తారా :
ఇక మంత్రి వర్గంలో ఎటూ ఆమెని తొలగించారు. ఆ విధంగా ఆమెకు పడిన శిక్ష కంటే కొంత అవమానం కూడా జరిగింది అని అంటున్నారు. దాంతో ఆమెలో ఏర్పడిన అసంతృప్తిని తీర్చడం కోసం ఢిల్లీ పిలిపిస్తున్నారు అని చర్చ సాగుతోంది. అంతే కాదు వీలైతే ఆమెకు కేబినెట్ హోదాతో సమానం అయిన ఒక నామినేటెడ్ పదవిని కట్టబెట్టేందుకు కూడా కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం పరిలీశిస్తోంది అని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణా కాంగ్రెస్ వ్యవహారాలను చూస్తున్న మీనాక్షీ నటరాజన్ అయితే కొండా సురేఖతో నేరుగా మాట్లాడి ఆమెకు పార్టీ తరఫున భరోసా ఇచ్చారు అని ప్రచారం సాగుతోంది. పార్టీలో ఆమె తిరిగి చురుకుగా వ్యవహరించాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం కోరనుంది అని అంటున్నారు.
బీసీలకు సందేశంగా :
కొండా సురేఖను తిరిగి యాక్టివ్ చేయడంతో పాటు ఆమెకు పార్టీలో ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పిస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది. ఇదిలా ఉంటే తాజాగా జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకు సైతం కొండా సురేఖ దూరంగా ఉన్నారు. దాంతో ఆమెను బుజ్జగించేందుకు ఢిల్లీ పిలుస్తున్నారు అని అంటున్నారు. అదే విధంగా ఆమె వెంట పార్టీ ఉంటుందని చెప్పడం ద్వారా తెలంగాణాలో హెచ్చు సంఖ్యలో ఉన్న బీసీలకు ఒక సానుకూల సందేశం పంపించాలని కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి చూస్తే త్వరలో కొండా సురేఖ ఢిల్లీ వెళ్ళనున్నారు అని తెలుస్తోంది. అక్కడ ఆమెకు ఏ రకమైన హామీ లభిస్తుంది అన్నదే అంతా చర్చించుకుంటున్నారు.
