కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫైర్... కామెంట్స్ వైరల్!
అవును... ఏమాత్రం సంబంధం లేని విషయంలో తన కుటుంబ సభ్యులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున స్పందించారు.
By: Tupaki Desk | 2 Oct 2024 1:55 PM GMTప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లోనూ, అటు సినిమా ఇండస్ట్రీలోనూ నాగ చైతన్య - సమంత విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్న వేళ 'కింగ్' నాగార్జున స్పందించారు. ఈ మేరకు ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ ట్వీట్ చేశారు.
అవును... ఏమాత్రం సంబంధం లేని విషయంలో తన కుటుంబ సభ్యులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై అక్కినేని నాగార్జున స్పందించారు. ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సినీ ప్రముఖుల జీవితాలను రాజకీయాలకు వాడుకోవద్దను సూచించారు.
ఈ సందర్భంగా ‘ఎక్స్’ లో స్పందించిన నాగార్జున... కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను, రాజకీయ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దని సూచించారు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించాలని విన్నవించారు.
అనంతరం... బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు.. మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అంటూ సీరియస్ అయిన నాగార్జున... తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నానని డిమాండ్ చేస్తూ ముగించారు.
ప్రస్తుతం ఈ ట్వీట్ కామెంట్ సెక్షన్ లో నాగార్జునకు అనుకూలంగా స్పందిస్తున్నారు నెటిజన్లు! ఇందులో భాగంగా... ఇలాంటి వ్యాఖ్యలపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సందర్భంగా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
కాగా... తాజాగా మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ... నాగ చైతన్యకు విడాకులు కావడానికి బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆరే కారణమని ఆరోపించారు. కేటీఆర్ తీరుతో సినిమా ఇండస్ట్రీలో కొంతమంది ఇబ్బంది పడ్డారని.. హీరోయిన్స్ కి ఆయన డ్రగ్స్ అలవాటు చేశారని.. కొందరు హీరోయిన్లు ఫీల్డ్ నుంచి తప్పుకుంటే, మరికొంతమంది త్వరగా పెళ్లి చేసుకున్నారని అన్నారు!
మరోపక్క కొండా సురేఖ వ్యాఖ్యలపై సీనియర్ నటుడు ప్రకాశ్ రాజ్ అసహనం వ్యక్తం చేసారు. ఇందులో భాగంగా... "ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే చిన్న చూపా?" అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో... ఆధారాలు లేకుండా మంత్రి హోదాలో ఉన్న ఓ మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటంటూ నెటిజన్లు ప్రకాశ్ రాజ్ కి మద్దతు తెలుపుతున్నారు.