Begin typing your search above and press return to search.

సురేఖ పోస్టు సంచ‌ల‌నం.. ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ నాయ‌కురాలు.. తాజా మాజీ మంత్రి కొండా సురేఖ ఎక్క‌డా వెనక్కి త‌గ్గ‌డం లేదు.

By:  Garuda Media   |   4 Sept 2026 6:33 PM IST
సురేఖ పోస్టు సంచ‌ల‌నం.. ఏం జ‌రిగింది?
X

కాంగ్రెస్ నాయ‌కురాలు.. తాజా మాజీ మంత్రి కొండా సురేఖ ఎక్క‌డా వెనక్కి త‌గ్గ‌డం లేదు. తాజాగా ఆమెను మంత్రి వ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేశారు. దీంతో ఒకింత మెత్త‌బ‌డ‌తార‌ని అనుకున్నారు. కానీ, ఆమె ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. పైగా సంచ‌ల‌న పోస్టుతో రాజ‌కీయాల‌ను వేడెక్కించారు. 'త్వ‌ర‌లోనే బిగ్ అప్‌డేట్‌' ఉంటుందని సురేఖ స్ప‌ష్టం చేశారు. అంతే కాదు.. 'కొంత వేచి చూడండి.. మొత్తం అయిపోయింది.' అని కామెంట్ రాసుకొచ్చారు.

ఈ ప‌రిణామాలు ప్ర‌స్తుత రాజ‌కీయాల‌ను మ‌రింత వేడెక్కించాయి. అంటే.. ఇక కాంగ్రెస్ పార్టీలో కొండా క‌థ ముగింపున‌కు దారి తీసే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. సీఎం రేవంత్ ను టార్గెట్ చేయ‌డాన్ని స‌హించ‌ని అధిష్టానం.. కొండాను మంత్రివ‌ర్గం నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేయాల‌న్న ఆదేశాల మేర‌కు ఆ ప‌ని నిర్విఘ్నంగా పూర్త‌యింది. ద‌రిమిలా.. ఇది ఇత‌ర మంత్రుల‌కు కూడా ఒక భారీ సంకేతమే ఇచ్చిన‌ట్టు అయింది.

అదే స‌మ‌యంలో సీఎం టార్గెట్‌గా వ్యాఖ్య‌లు గుప్పించిన చిన్నారెడ్డిని కూడా నామినేటెడ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించిన త‌ర్వాత‌.. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వంటివారు కొంత గొంతు స‌వ‌రించుకునే అవ‌కాశం ఉంటుంద‌ని అంచ‌నా వేశారు. అయితే.. కొండా సురేఖ తాజాగా చేసిన త్వ‌ర‌లోనే బిగ్ అప్‌డేట్ పోస్టు.. ఆమె కాలుదువ్వేందుకే ముందుకు వెళ్తున్న‌ట్టు స్ప‌ష్ట‌మైంది. ఈ ప‌రిణామంతో ఆమె కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసే అవ‌కాశం ఉందన్న అంచ‌నాలు వ‌స్తున్నాయి.

నెక్ట్స్ ఎటు?

ఒక‌ వేళ సురేఖ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తే.. ఎటు వైపు వెళ్తారు? అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. ప్ర‌స్తుతం బీఆర్ఎస్ ఫామ్‌లో ఉంది. అయితే.. ఆమె అక్క‌డ కూడా గిల్లిక‌జ్జాలు పెట్టుకునే బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఇక‌, ఇప్పుడు మిగిలింది క‌విత పార్టీ తెలంగాణ ర‌క్ష‌ణ‌సేన‌. మ‌రి దీనిలోకి సురేఖ కుటుంబం ప‌య‌నిస్తుం దా? లేదా? అనేది చూడాలి. ఒక‌వేళ ఆమె టీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపితే.. మ‌ళ్లీ మొద‌టి నుంచి సురేఖ రాజ‌కీయాలు ప్రారంభం అవుతాయ‌ని అంటున్నారు.