మునుగోడులో 'రాజా' వారి రూల్స్?
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉరఫ్ `రాజా` అటు పార్టీ అధిష్టానంపైనా ఇటు రాష్ట్ర సర్కారుపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.
By: Garuda Media | 14 Oct 2025 3:24 PM ISTమునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉరఫ్ 'రాజా' అటు పార్టీ అధిష్టానంపైనా ఇటు రాష్ట్ర సర్కారుపైనా తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పదవి దక్కక పోవడంపై తీవ్రస్థాయిలో రుసరుసలాడుతున్నారు. నిన్న మొన్నటి వరకు కీలక నాయకు లపై విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత.. ఏకంగా.. సవాళ్లకు దిగారు. అయినా.. రాజా ఆశలు నెరవేరడం లేదు. ఈ క్రమంలో ఆయన తన పంథాను మరో దారి పట్టించారు.
రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీ అమలులోకి రానుంది. అయితే.. దీనిపై కొందరు హైకోర్టును ఆశ్రయించా రు. ఆ విషయం ఎలా ఉన్నప్పటికీ.. మునుగోడులో ప్రత్యేకంగా ఫ్లెక్సీలు వెలిశాయి. దీనిలో ఎమ్మెల్యే కోమ టి రెడ్డి రాజగోపాల్ పేరిట కొన్ని హెచ్చికలు, అదేసమయంలో సూచనలు కూడా కనిపించాయి. ``వీటిని పాటించకపోతే.. తర్వాత జరిగే పరిణామాలకు సిద్ధంగా ఉండాలి. నా తప్పులేదు`` అని రాసిఉండడం గమనార్హం. ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రచ్చగానే కాకుండా.. సర్కారుకు కూడా ఇబ్బందిగా మారింది.
ఇవీ.. రూల్స్!
+ అన్ని మద్యం దుకాణాలు సాయంత్రం 4- రాత్రి 9 వరకే నడపాలి.
+ ఎక్కడా బెల్ట్ షాపులు ఉండేందుకు వీల్లేదు.
+ మద్యం తాగేందుకు వచ్చిన వారిని ఎలో చేయరాదు.
+ సిట్టింగ్ కు అనుమతి తీసుకున్నామని చెబితే.. కుదరదు.
+ వైన్ షాపుల్లో సిట్టింగ్ పెట్టరాదు.
+ వైన్ షాపులు దక్కించుకున్న ఓనర్లు.. సిండికేట్ కారాదు.
+ ఎక్కడా బయట మద్యం అమ్మొద్దు.
+ అన్ని దుకాణాలు నియోజకవర్గాలకు లేదా.. ఊళ్లకు బయటే ఉండాలి.
+ ఇవన్నీ ప్రజల క్షేమం కోసం.. వారి ఆరోగ్యం కోసమే.
+ పాటించకపోతే.. పరిణామాలకు సిద్ధంగా ఉండాలి.
ప్రభుత్వ వాదన ఇదీ..
అయితే.. వాస్తవానికి ప్రభుత్వాలు ఇప్పుడు మద్యంపైనే ఆధారపడుతున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో నిధులకు కరువు వాచిపోతున్నారు. వీరికి ఉన్న ఏకైక ఆదాయ వనరు మద్యం విక్రయాలే. అందుకే ఏపీలో అర్ధరాత్రి 12 గంటల వరకు బార్లు, 11 గంటల వరకు వైన్స్‌ను అనుమతించారు. సిట్టింగులకు చాన్స్ ఇచ్చారు. ఎక్కడైనా ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించారు. ఇదే పంథాలో తెలంగాణ కూడా నడుస్తూ.. కొత్త మద్యం పాలసీని తీసుకువచ్చింది.
