Begin typing your search above and press return to search.

దుర్గా ఉత్సవాలలో ఘోర విషాదం ... 17 మంది మృతి

పండుగంటే ఇంటింటా వెలుగులు నింపే వేడుక. ఆనందాలు, ఉత్సాహాల మధ్య అమ్మవారి దర్శనంతో పులకించిపోవాల్సిన భక్తుల జీవితాల్లో ఆ అకస్మిక విషాదం తీరని శోకాన్ని మిగిల్చింది.

By:  A.N.Kumar   |   17 Oct 2026 11:16 PM IST
దుర్గా ఉత్సవాలలో ఘోర విషాదం ... 17 మంది మృతి
X

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ సర్వజనీన్ దుర్గామాత మండపం వద్ద జరిగిన ఘోర తొక్కిసలాటలో కనీసంగా పదిహేడు మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దురదృష్టకర సంఘటన శనివారం రాత్రి సుమారు 7:40 గంటల సమయంలో, దుర్గాష్టమి పండగ వేడుకల వేళ చోటు చేసుకుంది. దీంతో దుర్గా నవరాత్రి ఉత్సవాలలో అతి పెద్ద దుర్ఘటనగా భావిస్తున్నారు.

ఘటన జరిగింది ఇలా :

ఈ ఘటన జరగడానికి కారణం పండగ పూట అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. రాత్రి సమయంలో ఒక్కసారిగా ఈ ప్రాంతంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం ప్రారంభమైంది. దాంతో వర్షం నుండి తప్పించుకోవడానికి బయట వేచి ఉన్న వేలాది మంది భక్తులు ఒక్కసారిగా బయటకు వెళ్లే గేట్ నుంది మండపం లోపలికి చొచ్చుకురావడానికి ప్రయత్నించారు. భారీగా అక్కడ జనాలు రావడంతో జనసందోహం ఒత్తిడి కారణంగా గేట్ కూలిపోయింది. ఈ హఠాత్పరిణామంతో భయాందోళనలకు గురైన జనం ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. బాధితులలో ఎక్కువ మంది మహిళలు, చిన్న పిల్లలు ఉన్నారని అంటున్నారు. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడగా వారిని స్థానిక మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.

సీఎం పర్యవేక్షణ :

ఘటనా స్థలానికి వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాద ఘటన విషయం తెలుసుకున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, రాష్ట్ర సీఎస్ మనోజ్ అగర్వాల్ పరిస్థితిని సమీక్షించేందుకు కలకత్తా మెడికల్ కాలేజీకి చేరుకున్నారు. ఈ ఘటనపై మాజీ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. ఘటన సమయంలో మండపం వద్ద ఒక్కసారిగా రద్దీ పెరగడంతో ఈ ఘటన జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రుల్లో చాలా మందిని బైకులపై ఆస్పత్రులకు తరలించారు. మండపంలోకి ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు చాలా ఇరుకుగా ఉండటంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా ఈ చోర్‌బగాన్ దుర్గా పూజ మండపాన్ని అధికారులు పూర్తిగా మూసివేశారు.

బెంగాల్ అంటేనే :

ఇదిలా ఉంటే బెంగాల్ అంటేనే దుర్గా ఉత్సవాలకు పెట్టింది పేరు. మొత్తం తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా అక్కడ ఉత్సవాలు జరుపుతారు. ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు కోల్ కట్టాలో సాగుతున్నాయి. సమీప జిల్లాల ప్రజలు కూడా ఈ ఉత్సవాలకు హాజరవుతూ వస్తున్నారు. మరో మూడు రోజులలో దసరా ఉత్సవాలు ముంగిట ఉన్నాయి. . దాని కంటే ముందు నవరాత్రి సందడి పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో అనేక చోట్ల భారీగానే కర్యక్రమాలు జరుగుతాయి. దుర్గ ఉత్సవాల ఆనందాన్ని ఆవిరి చేసేలా కోల్‌కతాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.