కొడాలి రెడీ కావాల్సిందేనా ?
అయితే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫలానా వారిదే ఇక వంతు అని చర్చ అయితే ఘాటుగానే జరుగుతోంది.
By: Satya P | 4 Aug 2025 9:00 AM ISTవైసీపీలో మాజీ మంత్రులు ఫైర్ బ్రాండ్ లీడర్లకు గత పదిహేను నెలలుగా రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. చాలా మంది నేతల మీద కేసులు పడుతున్నారు. అందులో కొందరు అరెస్టు అవుతున్నారు. మరి కొందరు జైళ్ళకు వెళ్తున్నారు. బెయిల్ రాక అక్కడే చాలా రోజులు ఉండాల్సి వస్తోంది. మొత్తానికి చూస్తే కనుక వైసీపీలో మాజీలకు అయితే చాలా విషయాలు అర్ధం అవుతున్నాయి. అందుకే గుట్టుగానే అనేక మంది ఉంటున్నారు. అయితే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫలానా వారిదే ఇక వంతు అని చర్చ అయితే ఘాటుగానే జరుగుతోంది.
కొడాలి నాని ఎక్కడ :
వైసీపీ అధికారంలో ఉన్నపుడు బిగ్ సౌండ్ చేసే ఫైర్ బ్రాండ్ లీడర్లలో అగ్రభాగం ఆయనదే అలా వైసీపీ వేదిక మీద నుంచి కొడాలి చేసే రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. అయితే వైసీపీ ఓటమి పాలు కాగానే ఆయన ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఆ మధ్యన అయితే ఆయన అనారోగ్యం పాలు కూడా అయ్యారు. దాంతో కొన్నాళ్ళ పాటు చికిత్స సైతం పొందారు. అయితే ఇపుడు ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని చెబుతున్నారు. గుడివాడ ఆయన సొంత నియోజకవర్గం అక్కడికి ఆయన పెద్దగా రావడం లేదు అని అంటున్నారు.
కేసుతో మళ్ళీ సంచలనం :
విశాఖలో ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. ఈ కేసు కింద ఐటీ చట్టం ప్రకారం 41ఏ 41 సీఆర్పీసీ సెక్షన్ కింద కొడాలి నానికి కేసు నమోదు చేశారు. ఈ నోటీసులను కొడాలి నానికి అందచేశారు. దాంతో నాని మీద ఫోకస్ మళ్ళిందని అంటున్నారు. ఏపీలో ఇప్పటికే పలు కేసులను నాని ఎదుర్కొంటున్నారు. అయితే వాటి మీద ఆయన అరెస్టు కాకుండా ఉపశమనం అయితే పొందుతున్నారు. ఇపుడు ఈ కొత్త కేసు ఆయనకు ఇబ్బందిపెడుతుందా అన్న చర్చ సాగుతోంది.
నాని అరెస్టు అవుతారా :
నాని అనారోగ్యంతో ఉన్నారు. ఆయన ఆపరేషన్ చేయించుకుని రెస్టు తీసుకుంటున్నారు. మరి ఆయన మీద కేసు కొత్తగా పెట్టడంతో ఇది అరెస్టు దాకా వెళ్తుందా అన్నదే హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా చంద్రబాబునే ఎదురొడ్డి విమర్శలు తీవ్ర స్థాయిలో నాని చేస్తూ వచ్చారు. అప్పట్లోనే టీడీపీ ఆయనను టార్గెట్ చేసిందని చెబుతారు తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరినీ వదలమని కూడా స్పష్టంగా నాడే చెప్పారు. ఇక చూస్తే నాని సన్నిహితుడు అయిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చాలా కాలం క్రితమే జైలు జీవితం చూసారు. ఏకంగా ఆయన అయిదు నెలల పాటు జైలులో ఉన్నారు. ఎట్టకేలకు ఆయన ఈ మధ్యేఅ రిలీజ్ అయ్యారు. దాంతో నాటి నుంచే ఇక తరువాత వంతు నానిదే అని చర్చ సాగింది. ఇపుడు కేసులు నోటీసులతో అందరి దృష్టి నాని మీద పడుతోంది. మరి నాని రెడీ అవుతారా అన్నదే చర్చగా ఉంది.
ఏం జరుగుతుంది :
కొడాలి నాని ఆరోగ్యం అయితే ఇంకా కుదుట పడలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆయనకు శస్త్ర చికిత్స జరిగింది. దాంతో ఆయన నెమ్మదిగా కోలుకుంటున్నారు. అయితే మరో వైపు ఆయన అనుచరులు అందరినీ గుడివాడలో వివిధ కేసుల మీద అరెస్టు చేస్తున్నారు. తనకు అత్యత సన్నిహితులైన వారు కేసులతో ఇబ్బందులు పడుతున్నా నాని గుడివాడ వెళ్ళలేని పర్సిథితి ఉంది అని అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే టీడీపీ అధినాయకత్వం మీద చంద్రబాబు కుటుంబం మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారని నానిని అరెస్టు చేయాల్సిందే అని టీడీపీలో ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. మరి అది ఇపుడు సాకారం అవుతుందా నాని అరెస్ట్ తప్పదా అన్నదే ఏపీలో ఇపుడు వేడి వేడిగా సాగుతున్న చర్చ. చూడాలి మరి ఏమి జరుగుతుందో.
