కొడాలి నాని ఆ పని మాత్రం చేయడం లేదా ?
కొడాలి నాని చూస్తే నిజానికి బలమైన నాయకుడు. ఆయన వరుసగా నాలుగు ఎన్నికలు ఇరవై ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు
By: Satya P | 30 May 2026 6:00 AM ISTవైసీపీలో ఫైర్ బ్రాండ్ నాయకుడు ఎవరూ అంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు కొడాలి నాని. నాని పంచులకు ఒక స్టైల్ ఉంటుంది. ఆయన సెటైర్లు వేసినా కౌంటర్లు ఇచ్చినా అవనీ తెగ వైరల్ అవుతాయి. గతంలో వైసీపీ మంత్రిగా ఉన్నపుడు కొడాలి నాని డైరెక్ట్ గానే టీడీపీ అధినాయక్త్వం మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేవారు. అవి కాస్తా హద్దులు దాటిపోవడంతో వైసీపీకే రివర్స్ లో తగులుకున్నాయి. అలా ఫైర్ బ్రాండ్ నాని చేసిన కామెంట్స్ అన్నీ బూమరాంగ్ అయి వైసీపీని ఇబ్బందుల పాలు చేశాయి అన్న మాట కూడా ఉంది. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో కొడాలి నాని ఓటమి పాలు కావడం మాత్రం అతి పెద్ద సంచలనం అయింది. ఏకంగా నాలుగు సార్లు గెలిచి గుడివాడ గడ్డ నాది అని గుండె మీద చేయి వేసుకుని చెప్పిన మొనగాడు నాని ఓటమి ఆయన వర్గానికే కాదు వైసీపీకి షాక్ గా మారింది.
ఒట్టు పెట్టుకున్నట్లుగా :
ఇదిలా ఉండగా కొడాలి నాని ఓటమి తరువాత గుడివాడ దరిదాపులకు కూడా రావడం లేదు. సరిగ్గా రెండేళ్ళు అయింది ఈ ఇరవై నాలుగు నెలలలో ఆయన హైదరాబాద్ లోనే ఎక్కువగా గడుపుతున్నారు. ఆ మధ్య అనారోగ్యం కారణం వల్ల కూడా ఆయన సొంత నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు అని ప్రచారం సాగింది. అయితే ఆరోగ్యం కుదుటపడిన తరువాత కూడా కొడాలి నాని గుడివాడ వైపు చూడకపోవడం మీద చర్చ సాగుతోంది. మరో వైపు చూస్తే విజయవాడ దాకా కొడాలి నాని వచ్చినా గుడివాడ రాకపోవడం మీద ఆయన అభిమానులు అనుచరులూ అసంతృప్తిగా ఉన్నారు.
ఇంచార్జి ఆయనే :
వైసీపీకి గుడివాడ ఇంచార్జిగా నాని కొనసాగుతున్నారు. అయినా సరే ఆ నియోజకవర్గం కార్యకర్తలతో ఒక్క మీటింగ్ కూడా ఆయన ఇప్పటి దాకా నిర్వహించలేదని అంటున్నారు. పార్టీ ఓడిన తరువాత ఆత్మ పరిశీలన చేసుకోవడం క్యాడర్ ని ముందుకు నడిపించడం వంటివి ఉంటాయి. అలాగే పార్టీ ఆదేశించిన మేరకు ఉద్యమాలను నిర్వహించడం జనంతో కలసి మెలసి పార్టీని పటిష్టం చేయడం వంటివి కూడా ఉంటాయి. కానీ కొడాలి మాత్రం గుడివాడ వైపే చూడడం లేదు అని అంటున్నారు దానికి కారణాలు ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని అంటున్నారు.
ఆవేదన చెందారా :
కొడాలి నాని చూస్తే నిజానికి బలమైన నాయకుడు. ఆయన వరుసగా నాలుగు ఎన్నికలు ఇరవై ఏళ్ళ పాటు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు అంటే అది ఆయనకు ఉన్న సొంత బలం అని చెబుతారు. అంతే కాదు మాస్ లీడర్ కూడా. తన నియోజకవర్గంలో ఎక్కువ మందిని గుర్తించి పలకరించగలిగిన వారు కూడా. ఇక ఎమ్మెల్యేగా ఉంటూ అందరితో కలసిపోతూ వీలైనంతగా మంచి పనులు చేసిన నానికి తన ఓటమి అయితే మింగుడు పడడం లేదని అంటున్నారు. ఎంత బాగా చేసినా జనాలు ఓడించారు అన్న ఆవేదన అసంతృప్తి ఆయనకు ఉన్నాయని అంటున్నారు. అయితే రెండేళ్ళ కాలంలో ఆయన కొంతవరకూ వాటిని అర్థం చేసుకున్నారు కానీ ఇప్పట్లో అయితే గుడివాడ వచ్చే సూచనలు అయితే నాని నుంచి కనిపించడం లేదు అని అంటున్నారు.
అప్పటి నుంచేనా :
ఏపీలో ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. దాంతో ఇప్పటి నుంచే ఎందుకు అన్న భావనతో నాని ఉన్నారని అంటున్నారు. సరిగ్గా ఏడాది ముందు ఎన్నికలకు నాని గుడివాడలో ప్రత్యక్షం అవుతారని అపుడే గేర్ మార్చి స్పీడ్ పెంచుతారని అంటున్నారు. అయితే నాని పార్టీ నేతల్తో సన్నిహితులతో మాత్రం హైదరాబాద్ లో టచ్ లో ఉంటున్నారు అని వారికి దిశా నిర్దేశం చేస్తున్నారు అని అంటున్నారు మొత్తానికి కొడాలి నాని గుడివాడ వచ్చేది అయితే ఇప్పట్లో లేదని అంటున్నారు.
