పిచ్చోడిని లైవ్ లో చూడడం అంటే.. అది పాక్ రక్షణ మంత్రే
పిచ్చోళ్ల గురించి వినడమే కానీ లైవ్ లో చూస్తున్నా అనేది హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పాపులర్ డైలాగ్..! దీనిని నిజం చేస్తున్నాడు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్.
By: Tupaki Political Desk | 9 Oct 2025 9:15 AM ISTపిచ్చోళ్ల గురించి వినడమే కానీ లైవ్ లో చూస్తున్నా అనేది హాస్య బ్రహ్మ బ్రహ్మానందం పాపులర్ డైలాగ్..! దీనిని నిజం చేస్తున్నాడు పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. బహుశా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలిశాక ఇతడి మైండ్ లోనూ చిప్ కొట్టేసిందేమో..? లేదా ఆసియా కప్ లో ఫైనల్ సహా హ్యాట్రిక్ పరాజయాలతో దిమ్మ తిరిగిందేమో..? అదీకాదంటే ఆపరేషన్ సిందూర్ తో పై ప్రాణాలు పైనే పోయాయమో..? అని రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకు అంటే.. భారతదేశం ఔరంగ జేబు పాలనలో తప్ప ఎప్పుడూ ఐక్యంగా లేదని ఆసిఫ్ అన్నాడు. వాస్తవానికి చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు అఖండ భారత దేశాన్ని పాలించారు.
చరిత్ర తెలియదు.. వర్తమానం అర్థంకాదు..
ఆసిఫ్ తాజా వ్యాఖ్యల ఉద్దేశం అఖండ భారత్ ను ఉద్దేశించి. కానీ, ఆయనకు చరిత్ర తెలియదని అనుకోవాలి. చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడు మొఘలుల కంటే ముందే ఉన్నారు. ఇక ఆసిఫ్ కు వర్తమానం కూడా అర్థం కావడం లేదు. ఆపరేషన్ సిందూర్ దెబ్బకు కాళ్ల బేరానికి వచ్చినా సరే.. అతడు భారత్ తో మళ్లీ యుద్ధం వస్తుందని, తామే గెలుస్తామని అంటున్నాడు.
భారత ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలకు కౌంటర్ గానా?
ఇటీవల భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ పాక్ గనుక దుస్సాహసానికి ఒడిగడితే ఈసారి ఆపరేషన్ సిందూర్-1 తరహాలో సహనం చూపబోమని.. పాక్ ను ప్రపంచ పటంలో లేకుండా చూస్తామని హెచ్చరించారు. దీనికి స్పందనగానే ఆసిఫ్ మాట్లాడినట్లు కనిపిస్తోంది. పాకిస్థాన్ కు ముప్పు పొంచి ఉంది అని ఆసిఫ్ అనడం ఇందులో భాగమే. అయితే, అసలు చేస్తున్నది ఏమిటి? అనేది మర్చిపోయి.. చరిత్ర తెలుసుకోకుండా స్థాయికి మించి మాట్లాడడమే ఇక్కడ ఆసిఫ్ ను పిచ్చోడు అని అనుకునేలా చేస్తోంది.
