4 నెలల తర్వాత.. ఖమేనీ అంత్యక్రియలు.. రోజుకు 2 లక్షల ఖర్చు!
కాగా.. ఖమేనీ మృతి చెందిన దాదాపు 4 నెలల తర్వాత.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించాలని ఇ రాన్ అధ్యక్షుడు షెజెష్కియాన్ నిర్ణయించారు.
By: Garuda Media | 24 Jun 2026 11:30 PM ISTఇరాన్‌ను సర్వంసహా చక్రవర్తిగా పాలించిన సుప్రీంలీడర్ ఖమేనీ.. ఈ ఏడాది ఫిబ్రవరి 28న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన దాడిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఉరుములు లేని పిడుగు మాదిరిగా అమెరికా, ఇజ్రాయెల్ సేనలు జరిపిన క్షిపణుల వర్షంలో ఖమేనీ సహా.. ఆయన భార్య, కోడలు, కుమార్తె, అల్లుడు, మనుమలు.. అందరూ మృతి చెందారు. ఆయన కుమారుడు మొజ్తబా మాత్రమే జీవించి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
కాగా.. ఖమేనీ మృతి చెందిన దాదాపు 4 నెలల తర్వాత.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించాలని ఇ రాన్ అధ్యక్షుడు షెజెష్కియాన్ నిర్ణయించారు. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. జూలై 5- 9 తేదీల మధ్య మార్నింగ్ డేస్(సంతాపదినాలు)గా ప్రకటించారు. ఈ రోజుల్లోనే ఖమేనీ మృతదేహాన్ని.. రాజధాని టెహ్రాన్ సహా.. ఇతర నగరాల్లో ఊరేగించి.. ప్రజల సందర్శనార్థం ఉంచ నున్నారు. అనంతరం.. ఆయన స్వస్థలం.. మషాద్‌లో పూర్వీకుల సమాధుల వద్ద ఖననం చేయనున్నా రు.
రోజుకు 2 లక్షలు..
ఫిబ్రవరి 28న దాడుల్లో మృతి చెందిన ఖమేనీ మృతదేహాన్ని అత్యంత భద్రత నడుమ భద్రపరిచారు. దీనికి గాను రోజుకు 2 లక్షల రూపాయలను(భారత కరెన్సీ) ఖర్చు చేస్తున్నట్టు సీఎన్ ఎన్ వెల్లడించింది. అత్యంత అరుదైన సుగంధ లేపనాలు, రసాయనాలను వినియోగించి.. నిత్యం మృత దేహాన్ని పరిశుభ్ర పరుస్తున్నట్టు తెలిపింది. దీంతో మృతదేహం నుంచి ఎలాంటి వాసనలు రాకపోవడంతో పాటు.. మేనిఛా య కూడా ఎక్కడా తగ్గకుండా చూస్తున్నారని.. దుస్తులు సైతం మారుస్తున్నట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే.. ఎక్కడ భద్రపరిచారన్నది మాత్రం గోప్యంగా ఉంచారని తెలిపాయి.
మోడీ వెళ్తారా?
ఖమేనీ అంత్యక్రియలకు హాజరు కావాలంటూ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఇరాన్ ఆహ్వానం పంపినట్టు కేంద్ర విదేశాంగ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్రత్యేక ఆహ్వానితుల జాబితాలో మోడీ పేరును ప్రథమ వరుసలోనే చేర్చినట్టు తెలిపాయి. అయితే.. మోడీ హాజరవుతారా? లేదా అనేది చూడాలి. నిజానికి ఇరాన్ .. భారత్ కు మిత్రదేశమే. అయినా.. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్ విషయంలో భాతర్ తటస్థ వైఖరిని తీసుకుంది. అందుకే ఖమేనీ మృతి చెందినప్పుడు.. సంతాప సందేశం కూడా వెలువరించలేదు. మరి ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి.
