ఖైరతాబాద్ ఉప ఎన్నిక.. కేటీఆర్ అలెర్ట్
ఈ సందర్భంగానే ఖైరతాబాద్ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుందని.. పార్టీని గెలిపించుకోవడం.. అత్యంతకీలకమని కేటీఆర్ వ్యా ఖ్యానించారు.
By: Garuda Media | 15 Jun 2026 9:13 AM ISTహైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కీలక అసెంబ్లీ నియోజకవర్గం ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక వస్తుందా? మరోసారి తెలంగాణ రాజ కీయాలు ధూం ధాంగా సాగనున్నాయా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే ఖైరతాబాద్ అసెంబ్లీ ఉన ఎన్నిక జరుగుతుందని.. పార్టీ నాయకులు, శ్రేణులు అలెర్టుగా ఉండాలని బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన పార్టీ నాయకులకు సూచించారు. దీనిని బట్టి.. ఖైరతాబాద్ ఉప ఎన్నిక వ్యవహారం మరోసారి చర్చకు వచ్చింది. తాజాగా ఆయన ఖైరతాబాద్ బీఆర్ ఎస్ నాయకులతో భేటీ అయ్యారు. స్థానిక రాజకీయాలపై చర్చించారు.
ఈ సందర్భంగానే ఖైరతాబాద్ ఉప ఎన్నిక త్వరలోనే జరగనుందని.. పార్టీని గెలిపించుకోవడం.. అత్యంతకీలకమని కేటీఆర్ వ్యా ఖ్యానించారు. పార్టీ ద్రోహులకు బుద్ధి చెప్పేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని పరోక్షంగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ ఎస్ పార్టీపై ప్రజల్లో సానుకూల పెరిగిందని.. దీనిని మరింత పెంచుకునేందుకు కార్యకర్తలు ఇంటింటికీ తిరగాలని.. ప్రజలను చైతన్య పరచాలని ఆయన సూచించారు. చిన్న ప్రయత్నంతో పెద్ద విజయం సాధించేందుకు అందరూ సమాయత్తం కావాలని కేటీఆర్ సూచించారు. ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దన్నారు.
ఖాయమేనా?
ఖైరతాబాద్ నుంచి 2023 ఎన్నికలలో బీఆర్ ఎస్ తరఫున దానం నాగేందర్ విజయం దక్కించుకున్నారు. ఆయన కొద్ది కాలం లోనే అధికార కాంగ్రెస్ పార్టీకి జైకొట్టారు. ఈయనతోపాటు.. మరో 9 మంది కూడా కాంగ్రెస్‌కు అనుకూలంగా మారిపోయారు. దీనిపై బీఆర్ ఎస్ పార్టీ అటు న్యాయ పోరాటం.. ఇటు రాజకీయ పోరాటం కూడా సాగించింది. అయితే.. దానం నాగేందర్ వ్యవహారం కీలకమలుపు తిరిగింది.ఇతర నాయకుల్లా కాకుండా.. నాగేందర్.. కాంగ్రెస్‌కు మద్దతు పలికితే తప్పేంటని ప్రశ్నించా రు. గతంలో బీఆర్ ఎస్ పార్టీ కూడా అనేక మందినిచేర్చుకోలేదా ? అని నిలదీశారు. ఇక, స్పీకర్ విచారణకు కూడా పలుమార్లు ఆయన రాలేదు.
ఈ పరిణామాలకు తోడు..సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని ఆదేశిస్తే.. తాను ఇప్పుడే చేస్తానని కూడా దానం వ్యాఖ్యానిం చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గ్రేటర్ హైదరాబాద్ పై తరచుగా సభల్లో ప్రస్తావిస్తున్నారు. మూసీ ప్రక్షాళన సహా.. ధాన్యం, కేసీఆర్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ వాదాన్ని కూడా బలంగా వినిపిస్తున్నారు. ఇలా.. ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు ఇస్తున్న నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలతోపాటు.. ఖైరతాబాద్ సహా.. కడియం శ్రీహరి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్.. తన పార్టీని అలెర్టు చేయడం విశేషం.
