వికసిత కేరళం - బీజేపీకి అచ్చి వచ్చిన ప్రయోగం
ఇటీవల జరిగిన పరిణామాలు బీజేపీ పరిగణనలోకి తీసుకుని దాని ద్వారా కేరళలో అధికారం దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. దేశమందరికీ తెలిసిన శుప్రసిద్ధ ఆలయం శబరిమల ఇక్కడ ఉంది.
By: Satya P | 24 Jan 2026 9:19 AM ISTకేరళ రాష్ట్రంలో ఎపుడూ బీజేపీకి పెద్దగా అవకాశాలు అయితే రాలేదు. అక్కడ కమ్యూనిస్టుల రాజకీయ ప్రాబల్యమే అధికంగా ఉంటూ వస్తోంది. ఇక కాంగ్రెస్ కూడా కేరళలో తన సత్తాను చాటుకుంటోంది. అలా కాంగ్రెస్ నాయకత్వలో యూడీఎఫ్, వామపక్షాల నేతృత్వంలో ఎల్డీఎఫ్ గా రెండు కూటములు పోటీ పడుతూ ఉంటాయి. ప్రజలు ఒక్కో ఎన్నికలో ఒక్కో పార్టీని గెలిపిస్తూ వస్తున్నారు. ఆ విధంగా మూడవ పార్టీ ఊసు కానీ చోటు కానీ లేని రాష్ట్రంగా కేరళ అయితే ఉంది అని చెప్పాలి.
తొలి సీఎం ఆయనే :
ఇక కేరళలో తీసుకుంటే మొదటి ముఖ్యమంత్రిగా కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఈఎంఎస్ నంబూద్రిపాద్ ప్రమాణం 1957లో ప్రమాణం చేశారు. ఆ తరువాత కాంగ్రెస్ సారధ్యంలో యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఏర్పాటు అయింది. ఇలా రెండు పార్టీల మధ్యనే రాజకీయ పోరు సాగుతూ వస్తోంది. గడచిన యాభై ఏళ్ళుగా ఇదే విధానం కొనసాగుతూ వస్తోంది. ఇక ఈ కమ్యూనిస్టు కోటలో కమలం విరబూయాలని తాపత్రయపడుతోంది.
బీజేపీ రంగ ప్రవేశం :
బీజేపీ నరేంద్ర మోడీ తొలిసారి 2014లో ప్రధానిగా అయ్యాక కేరళ మీద ఫోకస్ పెట్టింది. దాంతో అంచెలంచెలుగా బీజేపీ ఇక్కడ తన ఓటు షేర్ ని పెంచుకుంటూ వస్తోంది. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 15.50 శాతం ఓటు షేర్ లభించడంతో ఈసారి ఎన్నికల్లో తన తడాఖా చూపించాలని ఆరాటపడుతోంది. అయితే సీపీఎం కి 25.4. శాతం కాంగ్రెస్ కి 25.1 శాతం అదే ఎన్నికల్లో ఓటు షేర్ గా లభించాయి. అయితే తిరువనంతపురం మేయర్ సీటుని ఇటీవల బీజేపీ గెలుచుకుంది. అంతకు ముందు ఎంపీ సీటు కూడా ఇక్కడ నుంచి గెలిచింది. దాంతో వచ్చే ఎన్నికల్లో తాము కేరళలో జెండా పాతుతామని బీజేపీ నిబ్బరం ప్రదర్శిస్తోంది.
సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా :
ఇటీవల జరిగిన పరిణామాలు బీజేపీ పరిగణనలోకి తీసుకుని దాని ద్వారా కేరళలో అధికారం దిశగా అడుగులు వేయాలని చూస్తోంది. దేశమందరికీ తెలిసిన శుప్రసిద్ధ ఆలయం శబరిమల ఇక్కడ ఉంది. ఈ ఆలయంలో బంగారం చోరీ ఘటనను బీజేపీ అస్త్రంగా మార్చుకుంటోంది. తాజాగా శుక్రవారం మోడీ కేరళలో పర్యటించినప్పుడు కూడా స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇదే ఇష్యూ మీద గట్టిగా మాట్లాడారు.
హిందూత్వ అస్త్రమేనా :
కేరళలోని స్వామి అయ్యప్ప ఆలయంలో ఆభరణాల దారి మళ్ళింపు మీద తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సమగ్రమైఅ దర్యాప్తు జరిపిస్తామని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. దేశవ్యాప్తంగా అయ్యప్ప భక్తులు ఉన్నారని ఆయన అంటూ బీజేపీతోనే అన్నీ జరుగుతాయని అన్నారు. అంటే హిందూత్వ అస్త్రాన్ని బీజేపీ ఇక్కడ గట్టిగా ప్రయోగించనుందా అన్న చర్చ అయితే సాగుతోంది.
ఎవరి ఓట్లకు గురి :
ఇక బీజేపీ కొత్తగా రంగంలోకి దిగుతోంది. ఆ పార్టీ అధికారంలోకి రావాలీ అంటే లెఫ్ట్ ఓట్లు కానీ కాంగ్రెస్ ఓట్లు కానీ చీలిపోవాలి. ఆ రెండు పార్టీలతో జనాలు విసిగిపోయారు అని బీజేపీ అంటోంది అంతే కాకుండా అవినీతి పెద్ద ఎత్తున జరిగిందని తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ ఆయా ప్రభుత్వాల హయాంలో జరిగిన వాటి మీద జరిపిస్తామని అంటోంది. దీంతో పాటుగా అభివృద్ధిలో దేశంతో పాటు కేరళ కూడా కలసి అడుగులు వేయాల్సిన అవసరం ఉందని చాటి చెబుతుంది. మరి ప్రజలు అభివృద్ధి ప్లస్ హిందూత్వ అన్న వాటి విషయంలో బీజేపీ వైపు మొగ్గు చూపుతారా లేదా అన్నది చూడాల్సి ఉంది.
