పేదరికాన్ని జయించిన రాష్ట్రం...దేశంలోనే కొత్త రికార్డు
పేదరికం అన్నది ఒక శాపం. ఒక దారిద్ర్యం. అయితే పేదరికాన్ని ఆసరాగా చేసుకుని హామీలు గుప్పించే పార్టీలే ఎక్కువగా కనిపిస్తూటాయి.
By: Satya P | 25 Oct 2025 6:00 AM ISTపేదరికం అన్నది ఒక శాపం. ఒక దారిద్ర్యం. అయితే పేదరికాన్ని ఆసరాగా చేసుకుని హామీలు గుప్పించే పార్టీలే ఎక్కువగా కనిపిస్తూటాయి. వాటిని నిర్మూలించే విషయంలో మాత్రం పెద్దగా దృష్టి పెట్టవు అన్న విమర్శలు ఉన్నాయి. ఈ రోజుకీ రేషన్ సరుకు తీసుకుంటున్న వారు ఈ దేశంలో 80 కోట్ల మంది దాకా ఉన్నారని చెబుతారు. ఈ నేపధ్యంలో పేదరికం మీద పూర్తి శ్రద్ధ పెట్టి దాని మూలాల్లోకి వెళ్ళి దానిని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా దేశంలో కేరళ నిలవబోతోంది. అయితే ఇక్కడ పేదరికం అంటే పూర్తిగా కాదు అత్యంత పేదరికం అని చెప్పాలి. అంటే కనీసం పూట గడించేందుకు కూడా లేని వారు అయితే ఇక మీదట కేరళలో కనిపించరు అన్న మాట. నిజంగా ఈ రకమైన అచీవ్మెంట్ ని సాధించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే.
లక్ష్యాన్ని సాధిస్తూ :
ఇక కేరళలో అయితే లెఫ్ట్ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. 2021లో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరువాత ముఖ్యమంత్రి పినరయి విజయన్ అయితే తీవ్రమైన పేదరికం మీద దృష్టి పెట్టారు. అంతే కాదు ప్రత్యేకంగా సర్వేను రాష్ట్రమంతా చేయించారు. ఆ విధంగా చేయిస్తే ఈ సమగ్రమైన సర్వే చాలా సైంటిఫిక్ గా సాగింది. ప్రధానంగా ఆహారంతో పాటు వారి ఆరోగ్యం, జీవనానికి ఉపాధి, అలాగే గృహ నిర్మాణం వంటి అంశాల మీద సాగిన ఈ సర్వేలో చూస్తే ఏకంగా 64 వేల దాకా తీవ్రాతి తీవ్రమైన పేద కుటుంబాలు ఉన్నట్లుగా తేలింది. వీరందరికీ జీవితమే ఒక సవాల్ గా మారింది. అంతే కాదు దైనందిన జీవితమే కష్టమవుతఒంది. అందుకే వారిని అత్యంత పేదలుగా గురించిన రాష్ట్ర ప్రభుత్వం వీరిని తీవ్రమైన పేదరికం నుంచి బయటకు తీసుకుని రావడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.
సీఎం స్వీయ పర్యవేక్షణ :
ఈ నిరుపేదల జీవితాలలో వెలుగులు నింపడానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వీయ నేతృత్వంలోనే కార్యాచరణ మొదలైంది. వారిని అవసరం అయిన సాయం అందించడం అలాగే వారి జీవితాలు మెరుగుపడేందుకు తీసుకోవాల్సిన చర్యలు అన్నీ కూడా కేరళ ప్రభుత్వం సమకూర్చి పెట్టింది. దాంతో అనూహ్యంగా కేవలం నాలుగేళ్ళ కాలంలోనే వీరంత తీవ్రమైన పేదరికం నుంచి బయటపడ్డారు. ఇది చాలా గొప్ప విషయంగా కేరళ ప్రభుత్వం భావిస్తోంది.
ఘనమైన ప్రకటన :
కేరళ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అయిన నవంబర్ 1న ఈ విషయాన్ని ఘనంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటిస్తారు అని అంటున్నారు. రాష్ట్రం అత్యంత పేదరికాన్ని జయించింది అని సీఎం ప్రకటించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలా వేడుకగా నిర్వహించనున్నారు కేరళ రాజధాని తిరువనంతపురంలో జరిగే ఒక కార్యక్రమంలో ఈ విషయం ప్రకటిస్తారు. ఈ కార్యక్రమానికి కేరళ ప్రభుత్వంలోని మంత్రులు ప్రతిపక్ష నాయకులతో పాటు ప్రముఖ సినీ నటులు కమల్ హాసన్, ముమ్ముట్టి, మోహన్ లాల్ వంటి వారు హాజరవుతారు అని చెబుతున్నారు.
జీవితాలలో పెను మార్పులు :
ఇలా అత్యంత పేద కుటుంబాలు;అలో ప్రభుత్వం చేసిన సర్వేలో 4,421 కుటుంబాలు మరణించాయని చెబుతున్నారు. ఇక మరో 261 సంచార కుటుంబాల జాడ తెలియడం లేదని చెబుతున్నారు. లేదా వీరంతా ఇతర రాష్ట్రాలకు వలసపోయినట్లుగా భావిస్తున్నారు. ఇవన్నీ తీసివేయగా అత్యంత పేద కుటుంబాలుగా 59,277ని నిర్ణయించారు. వారి కోసమే గత నాలుగేళ్ళుగా ప్రత్యేక ప్రణాళిక అమలు చేయడం ద్వారా వారి జీవితాలలో పెను మార్పులు తీసుకుని వచ్చారని చెబుతున్నారు. ఇది నిజంగా దేశానికే ఆదర్శంగా చూడాల్సి ఉంది. ఎందుకంటే పేదలు సంక్షేమ పధకాలు ఏ ఏటికి ఆ ఏడు బడ్జెట్ లో పెరిగిపోతున్నారు కానీ ఆ రేటు తగ్గడం లేదు, అందువల్ల ప్రత్యేక పథకాలు ప్రత్యేక ఫోకస్ తో దీనిని నిర్మూలించవచ్చు అని కేరళ ప్రభుత్వం ఆచరణాత్మకంగా నిరూపించింది.
