అసెంబ్లీకి కేసీఆర్... .టీవీలకు అతుక్కుపోవడమేనా ?
అంత కాదు కేసీఆర్ సభకు వస్తే ఎన్నో ఇష్యూని సభలో ఉంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు.
By: Satya P | 28 Dec 2025 4:00 AM ISTఎట్టకేలకు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయించుకున్నారు అని అంటున్నారు. ఈ విషయంలో కేసీఅర్ సీరియస్ గానే ఉన్నారు అని అంటున్నారు. ఆయన తాజాగా పార్టీ వాదులతో ఒక మీటింగ్ ని తెలంగాణా భవన్ లో నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద నిప్పులు చెరిగారు. అయితే దానికి కౌంటర్ ఇస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే అన్నీ చర్చిద్దామని రావాలని సవాల్ చేశారు. దానికి కేసీఆర్ వైపు నుంచి ఓకే అని స్వీకరించినట్లుగా ప్రచారం జరుగుతోంది.
మండే నుంచి హీటే :
ఇక తెలంగాణా శీతాకాలం అసెంబ్లీ సెషన్ ఈ నెల 29 మండే నుంచి మొదలు కాబోతోంది. మామూలుగా అయితే నాలుగైదు రోజుల పాటు అసెంబ్లీ జరుగుతుందని అంటున్నారు అయితే రేవంత్ రెడ్డి కొడంగల్ సభలో మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఆయన ఎన్ని రోజులు కోరుకుంటే అన్ని రోజులు సభను నడుపుదామని చెప్పుకొచ్చారు. తొలి రోజే బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం అవుతుంది. బీఏసీలోనే ఎన్ని రోజులు సభను జరుపుదామని నిర్ణయిస్తారు. మరి కేసీఅర్ సభకు హాజరై ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పూర్తి స్థాయిలో చర్చిచాలని పట్టుదల మీద ఉన్నారని అంటున్నారు ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్టులు తెలంగాణా ఏర్పాటు తరువాత వాటి పొజిషన్ ఏంటి అన్న దాని మీద పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలని అనుకుంటోంది. దాంతో సభా సమయం చాలా ఎక్కువగానే కావాల్సి వస్తుందని అంటున్నారు.
హాట్ ఇష్యూస్ ఎన్నో :
అంత కాదు కేసీఆర్ సభకు వస్తే ఎన్నో ఇష్యూని సభలో ఉంచాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. అందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ మ్యాటర్ ఒక హైలెట్ గా ఉండబోతోంది అని అంటున్నారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కూడా మరో ఇష్యూగా అధికార పార్టీ బయటకు తీసి చర్చకు పెట్టవచ్చు అని అంటున్నారు పదేళ్ల కేసీఆర్ పాలనలో అక్రమాలు అవినీతి అని కాంగ్రెస్ వైపు నుంచి సౌండ్ వస్తే రెండేళ్ళ రేవంత్ రెడ్డి పాలన మీద చర్చ అని బీఆర్ ఎస్ కూడా రీసౌండ్ చేసే అవకాశాలు మెండుగా ఉంటాయని అంటున్నారు. దాంతో వింటర్ సెషన్ హీటెత్తిపోవడం ఖాయంగా కనిపిస్తోంది అని అంటున్నారు.
పదకొండేళ్ళ తరువాత :
ఇక నిజంగా కేసీఅర్ సభకు వచ్చి పూర్తి స్థాయిలో చర్చలలో పాల్గొంటే మాత్రం తెలంగాణా అసెంబ్లీ చూసేందుకు రెండు కళ్ళూ చాలవని అంటున్నారు. ఒక వైపు సీఎం గా రేవంత్ రెడ్డి విపక్షంలో మాజీ సీఎం కేసీఆర్ ఉంటే కనుక ఆ సీన్ వేరే లెవెల్ అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికి పదకొండేళ్ళ క్రితం టీడీపీ పక్షం వైపు నుంచి రేవంత్ రెడ్డి ఉంటే నాడు సీఎం గా కేసీఆర్ ఉన్నారు. ఇపుడు సీన్ రివర్స్ అన్న మాట. దాంతో ఇంకా ఇంట్రెస్టింగ్ గా అసెంబ్లీ డిస్కషన్స్ మారుతాయని అంటున్నారు. ఏది ఏమైనా ఈ నెల 29 నుంచి తెలంగాణా అసెంబ్లీ స్టార్ట్ అవుతోంది. కేసీఅర్ వస్తే కనుక రెండు రాష్ట్రాలకు చెందిన జనాలు అంతా టీవీలకు అతుక్కుపోవడమే అని అంటున్నారు.
