Begin typing your search above and press return to search.

పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి .. కేసీఆర్ తో అనుబంధం ఇదీ!

న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2018లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న పెద్దికి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మ‌ధ్య ప్ర‌త్యేక అనుబంధం ఉంది.

By:  Garuda Media   |   31 July 2026 9:00 PM IST
పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి  .. కేసీఆర్ తో అనుబంధం ఇదీ!
X

బీఆర్ఎస్ సీనియ‌ర్‌ నేత‌, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి.. గ‌త అర్ధ‌ రాత్రి ఆసుప‌త్రిలో క‌న్నుమూశారు. గ‌త నాలుగు రోజులుగా హైద‌రాబాద్‌లోని య‌శోద ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న పెద్ది.. తుది శ్వాస విడిచారు. ప్ర‌స్తుతం ఆయ‌న వ‌య‌సు 52 ఏళ్లు. న‌ర్సంపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2018లో తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న పెద్దికి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మ‌ధ్య ప్ర‌త్యేక అనుబంధం ఉంది.

బీఆర్ఎస్ ఆవిర్భావం స‌మ‌యంలో కేసీఆర్‌.. ఊరూ వాడా తిరిగిన‌ప్పుడు.. న‌ర్సంపేట నుంచి ముందుకు వ‌చ్చిన తొలినేత‌.. పెద్ది సుద‌ర్శ‌న్‌.. అప్ప‌టి నుంచి కేసీఆర్ అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ.. ఆయ‌న‌కు అత్యంత న‌మ్మిన‌బంటుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. హ‌నుమ‌కొండ జిల్లాలో ఎంతో మంది నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ.. పార్టీ అదికారంలో ఉన్న‌ప్పుడు. .. త‌ర్వా త‌ కూడా పెద్ది నుంచే కేసీఆర్ స‌మాచారం రాబ‌ట్టేవారు. ఇరువురు ఒకే కంచంలో తినేవారా? అన్నంత చ‌నువుగా కూడా ఉండేవార‌ని నాయ‌కులు గుర్తు చేసుకుంటున్నారు.

ఎంతో మంది నేత‌లు బీఆర్ ఎస్‌లోకి వ‌చ్చిన వారు ఉన్నారు.. వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. ముఖ్యంగా హ‌నుమ‌కొండ నుంచే చాలా మంది వ‌చ్చారు వెళ్లారు. కానీ, పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డి మాత్రం.. బీఆర్ఎస్ కండువా క‌ప్పుకొన్న నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఆ పార్టీతోనే కొన‌సాగారు. 2018లో కూడా చిట్ట‌చివ‌రి నిమిషంలో ఎమ్మెల్యే టికెట్ ఖ‌రారైంది. అయినా.. ఆయ‌న ఆగ్ర‌హం చెంద‌లేదు. క‌ల‌తా చెంద‌లేదు. త‌న గుండెల నిండా కేసీఆర్ ఉన్నార‌ని ప‌దే ప‌దే చెప్పుకొనే సుద‌ర్శ‌న్ రెడ్డి ప‌ట్ల కేసీఆర్ కూడా అలానే ఆప్యాయత ప్ర‌ద‌ర్శించారు.

మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని..

త‌నకు అత్యంత ఆప్తుడైన సుద‌ర్శ‌న్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ చాలా ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ, ఈక్వేష‌న్లు కుద‌ర‌క‌పోవ‌డంతో ఆయ‌న‌ను తెలంగాణ పౌర సరఫరాల సంస్థకు ఛైర్మన్‌ను చేశారు. ఇక‌, మూడో విడ‌త‌లో అంటే.. 2023లో మ‌ళ్లీ బీఆర్ ఎస్ గెలిస్తే.. ఖ‌చ్చితంగా పెద్ది సుద‌ర్శ‌న్‌రెడ్డికి మంత్రి ఇస్తామ‌ని నాటి ఎన్నిక‌ల ప్ర‌చారంలోనే కేసీఆర్ హామీ ఇచ్చారు. అయితే.. పార్టీ ఘోరంగా ప‌రాజ‌యం పాలైంది.

ఇటీవ‌ల ఆసుప‌త్రిలో..

పార్టీ సీనియ‌ర్ నేత‌, త‌న‌కు అత్యంత ఆప్తుడు కావ‌డంతో పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డిని ఇటీవ‌ల కేసీఆర్ స్వ‌యం గా ప‌రామ‌ర్శించారు. గ‌త కొన్నాళ్లుగా ఫాం హౌస్‌కే ప‌రిమితం అయిన‌.. కేసీఆర్‌.. కేవ‌లం సుద‌ర్శ‌న్ రెడ్డి కోస‌మే బ‌య‌ట‌కు వ‌చ్చారు. ఆసుప‌త్రికి వెళ్లి సుద‌ర్శ‌న్‌రెడ్డిని ప‌రామ‌ర్శించారు. అయితే.. అప్ప‌టికే ఆయ‌న ఆరోగ్యం ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకుంద‌ని వైద్యులు చెప్పారు. కానీ.. ఎంత ఖ‌ర్చ‌యినా పెద్దిని బ‌తికించుకునేందుకు ప్ర‌య‌త్నించాల‌ని పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఆనాడే కేసీఆర్ చెప్పారు.