Begin typing your search above and press return to search.

గులాబీ సారూ ఏం చేస్తారూ ?

ఇక కేసీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగిన పార్టీ పాతికేళ్ళ పండుగలో పాలు పంచుకున్నారు. ఆనాడు కూడా ఆవేశంగా ప్రసంగించారు.

By:  Satya P   |   23 Dec 2025 9:35 AM IST
గులాబీ సారూ ఏం చేస్తారూ ?
X

కేసీఆర్ ఆషామాషీ నాయకుడు కాదు, చిన్న స్థాయి నుంచి ఎదిగి తన గొంతుకతో జాతీయ రాజకీయాలను ఒక దశలో శాసించారు. పార్లమెంట్ అజెండాను తీర్మానాలను కూడా ఆయన ప్రభావం చూపించగలిగారు. తెలంగాణా అన్న ఒక ఇష్యూతోనే కొన్నాళ్ళ పాటు దేశంలోని జాతీయ ప్రాంతీయ పార్టీలను తన వైపునకు తిప్పుకున్నారు వారి మేనిఫేస్టోలో సైతం తెలంగాణా రాత గీత జాగ్రత్తగా ఉండేలా చూశారు. ఇక తెలంగాణా తెచ్చాక రెండు సార్లు సీఎం అయ్యాక కేసీఆర్ వైఖరి మారింది అని అప్పట్లో విమర్శ. ఆయన పెద్దగా ఎవరినీ కలవకుండా గ్యాప్ పాటించారు అని చెబుతారు. దాంతో ఆయన 2023లో ఓటమి పాలు అయ్యారు. ఇక ఓడిన తరువాత కూడా రెండేళ్ళ పాటు జనంలోకి రాకుండా కేరాఫ్ ఎర్రవెల్లి ఫాం హౌస్ గా ఉండిపోయారు. అసెంబ్లీకి సైతం కేసీఆర్ రాని సందర్భం ఉంది.

బిగ్ సౌండ్ చేసినా :

అటువంటి కేసీఆర్ బిగ్ సౌండ్ చేశారు. చాలా కాలం తరువాత ఆయన తెలంగాణా భవన్ కి వచ్చారు మీటింగ్ పెట్టారు ఉత్సాహ పూరితంగా మాట్లాడారు, మీడియా ముందుకు వచ్చి ఎంతో ఆవేశపూరితంగా మాట్లాడారు, ఇక మీదట తాను అందరికీ అందుబాటులో ఉంటాను అని కూడా మీడియా ముఖంగా పార్టీకి చెప్పారు. ఏకంగా మూడు సభలను ఏర్పాటు చేయమని కూడా పురమాయించారు. అయితే కేసీఆర్ ఇంత చెప్పినా ఇంకా క్యాడర్ లో అయితే డౌట్లు ఉన్నాయట. తీరా కారు సారూ మీటింగ్స్ కి రాకపోతే ఏమి గానూ అని. ఇలా ఎందుకు అంటే ఫ్లాష్ బ్యాక్ ని వారు గుర్తు చేసుకుంటున్నారు.

ఏప్రిల్ తరువాత మళ్ళీ :

ఇక కేసీఆర్ ఈ ఏడాది ఏప్రిల్ 27న వరంగల్ లో జరిగిన పార్టీ పాతికేళ్ళ పండుగలో పాలు పంచుకున్నారు. ఆనాడు కూడా ఆవేశంగా ప్రసంగించారు. ఇక మీదట తాను జనంలోనే అని బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రభుత్వం చేసే తప్పులను చీల్చిచెండాడుతామని కూడా చెప్పారు. కానీ తీరా చూస్తే కనుక కేసీఆర్ మళ్లీ కనిపించలేదు. ఈ మధ్యలో చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కానీ కేసీఆర్ అయితే బయటకు వచ్చింది లేదు, మరి ఇపుడు చూస్తే రెండేళ్ళ టైం ఇచ్చామని ఇక చూస్తూ ఊరుకోమని చెబుతున్నారు. తాను జనంలో నిరంతరం ఉంటామని కూడా ఆయన అంటున్నారు. కానీ అది నిజంగా జరిగితే మాత్రం బీఆర్ఎస్ కి కొత్త కళ ఊపు జోష్ వస్తాయని క్యాడర్ అంటోంది.

ఇలా చేయండి సారూ :

ఇక కేసీఆర్ క్యాడర్ కి సమయం ఇవ్వాలని వారితో మనసు విప్పి మాట్లాడాలని అంతా కోరుకుంటున్నారు. అలాగే ఆయన పార్టీ దైనందిన కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తూ ఉంటే గులాబీ పార్టీ తిరిగి వికసించడం ఖాయమని అంటున్నారు. ఎందుకంటే ప్రతిపక్షం వైపు జనాలు ఆశగా చూస్తారు, అలాగే క్యాడర్ కూడా అధినాయకుడు మీద ఆశలు పెట్టుకుంది. అలా చేయండి సారూ అని కోరుతున్నారు. చూడాలి మరి కేసీఆర్ గట్టిగా చెప్పారు కాబట్టి ఆయన కదన రంగంలోకి దూకినట్లే అని అంటున్నారు. మరి కేసీఆర్ కనుక జనంలోకి వస్తే కనుక తెలంగాణా రాజకీయం హీటెక్కినట్లే అని అంటున్నారు.