Begin typing your search above and press return to search.

కేసీఆర్ సంచలన నిర్ణయం...అందుకే అలా ?

తెలంగాణా జాతిపిత అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు కితాబు ఇస్తాయి. వారు అన్నారని కాదు కానీ మలి విడత తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎంతో వ్యూహాత్మకంగా చేశారు.

By:  Satya P   |   5 Dec 2025 5:00 AM IST
కేసీఆర్ సంచలన నిర్ణయం...అందుకే అలా ?
X

తెలంగాణా జాతిపిత అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆయనకు కితాబు ఇస్తాయి. వారు అన్నారని కాదు కానీ మలి విడత తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ఎంతో వ్యూహాత్మకంగా చేశారు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించారు. ఆ మీదట రెండు సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చారు. 2023 లో మూడవసారి గెలిస్తే తెలుగు నేల మీద వరసగా విజయం సాధించిన హ్యాట్రిక్ సీఎం గా రికార్డు క్రియేట్ చేయాలని అనుకున్నారు. కానీ జనాలు మాత్రం అనూహ్యమైన తీర్పు ఇచ్చారు. దాంతో గత రెండేళ్ళుగా కేసీఆర్ జన క్షేత్రానికి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఫాం హౌస్ లోనే :

కేసీఆర్ ఓటమి తర్వాత పెద్దగా బయటకు వచ్చినది లేదు, అంతే కాదు ఆయన ఫాం హౌస్ కే పరిమితం అయిపోయారు. ఈ మధ్యలో ఉప ఎన్నికలు జరిగాయి. అలాగే ఇపుడు లోకల్ బాడీ ఎన్నికలకు తెర లేచింది. అయినా సరే కేసీఆర్ పార్టీ సమావేశాలను నిర్వహించడం లేదు, పార్టీ నేతలతో భేటీలు వేయడం లేదు, ఒక విధంగా ఆయన విశ్రాంతిని తీసుకుంటున్నారనే అంటున్నారు. అయితే కేసీఆర్ ఎందుకు ఇలా చేస్తున్నారు అన్న ప్రశ్నలు అయితే అందరి మదిని తొలిచేస్తున్నాయి.

అసెంబ్లీకి దూరమే :

కేసీఆర్ ఈ విధంగా వ్యవహరించడం వెనక ఒక వ్యూహం ఉంది అని అంటున్నారు. తన కుమారుడు కేటీఆర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేశారు. అదే విధంగా పార్టీలో మేనల్లుడు హరీష్ రావుని కీలకంగా ఉంచారు. దాంతో ఈ ఇద్దరే పార్టీని ముందుకు తీసుకుని వెళ్ళాలని కేసీఆర్ భావిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో ప్రతిపక్షంలో ఉంటేనే నాయకత్వం సత్తా తెలుస్తుందని కూడా ఆయన విశ్వసిస్తున్నారు. అలాగని కేసీఆర్ కాడే వదిలేసినట్లు కాదని సరైన సమయంలో ఆయన బయటకు వస్తారు అని అంటున్నారు.

ఇబ్బంది పెడుతున్నాయా :

అయితే మరో వైపు వినిపిస్తున్న వార్తలు ఏంటి అంటే కుటుంబంలో సమస్యలు కూడా ఆయనను ఇబ్బంది పెడుతున్నాయని అంటున్నారు. కుమార్తె కవిత బీఆర్ఎస్ నుంచి దూరం కావడం మీద ఆయన మధనం చెందుతున్నారు అన్న వారూ ఉన్నారు. ఓటమి తరువాత ఎన్నో జరుగుతాయి కానీ ఈ విధంగా పార్టీలో కీలక నేతలు వెళ్తే ఓకే కానీ సొంత కుటుంబమే ఎదురు రావడం అసలు ఊహించని పరిణామంగానే చెబుతున్నారు. వీటి సంగతి పక్కన పెడితే కేసీఆర్ అసలు ఎన్నికల సమయానికే జనంలోకి వస్తారు అని అంటున్నారు. దానికి ఇంకా మూడేళ్ళ సమయం ఉంది. అంతవరకూ ఆయన ఫాం హౌస్ కే పరిమితం అవుతారని కేటీఅర్ పార్టీని నడిపిస్తారు అని అంటున్నారు ఇపుడు తెలంగాణాలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి, రానున్న రోజులలో మండలాలు జిల్లా పరిషత్తులు, మునిసిపాలిటీలు కార్పోరేషన్లకు ఎన్నికలు ఉన్నాయి. వీటిలో బీఆర్ఎస్ జెండా ఎగవేయించే బాధ్యత అయితే కేటీఆర్ మీద ఉంది. ఆ విధంగా ఆయన నాయకత్వం గట్టి పరచుకోవాల్సి ఉంది. అదే విధంగా అసెంబ్లీలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆయన ధీటుగా ఎదుర్కోవాలని అంటున్నారు. చూడాలి మరి కేసీఅర్ ఈ వైఖరి వెనక ఉన్న చాణక్య వ్యూహం ఏమిటో ఏ రకమైన అలితం ఇస్తుందో అన్నది.