Begin typing your search above and press return to search.

అపర చాణక్యుడి స్ట్రాటజీ ఏమిటో !

రాజకీయం అంటే అంతే మరి. ఉల్టా సీదా అవుతుంది. ఓడలు బళ్ళు అవుతాయి. ఎవరేమిటి అన్నది రాజకీయంలో త్రాస్ తేల్చేస్తుంది.

By:  Satya P   |   18 Sept 2025 9:35 AM IST
అపర చాణక్యుడి స్ట్రాటజీ ఏమిటో !
X

రాజకీయం అంటే అంతే మరి. ఉల్టా సీదా అవుతుంది. ఓడలు బళ్ళు అవుతాయి. ఎవరేమిటి అన్నది రాజకీయంలో త్రాస్ తేల్చేస్తుంది. ఎత్తు పల్లాలు చూపిస్తుంది. రాజు లెవరో తరాజులు ఎవరో కూడా కచ్చితంగా తేడా చూపించి మరీ ప్లేస్ డిసైడ్ చేస్తుంది. ఈ దెబ్బకు సైడ్ అయిన వారికి మంచి రోజులు రావా అంటే వస్తాయి. కానీ ఓపిక పట్టాలి. అప్పటి వరకూ ఎంతటి వారికైనా అజ్ఞాత వాసం తప్పదంతే. ఇదంతా ఎందుకు అంటే తెలంగాణాను ఒకనాడు తన గొంతుతో ఒక్కటి చేసి మాటతో ఏకత్రాటిపైకి నడిపి ఢిల్లీని గల్లీని గడగడలాడించిన తెలంగాణా ఉద్దండ పిండం అయినా కేసీఆర్ గురించి చెప్పడానికే.

రెండేళ్ళుగా కేరాఫ్ ఫాం హౌస్ గా :

కేసీఆర్ 2023 చివరిలో జరిగిన ఎన్నికల మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆరు నూరు కావచ్చు కానీ గెలుపు మాత్రం తనదే అని గట్టిగా నమ్మారు అవతల వైపు సీఎం అభ్యర్థిగా ఉన్న వారు కూడా తనకు సరిసాటి కారని జనం కూడా తన కళ్ళ జోడు నుంచే చూసి తీర్పు తనకే అనుకూలంగా చెబుతారని కూడా పెద్ద అంచనావే కట్టారు. కానీ ఈవీఎంలు చూస్తే సీన్ రివర్స్ అయింది. విపక్షంలోకి బీఆర్ఎస్ వచ్చింది రేవంత్ రెడ్డి సీఎం అయిపోయారు. మంత్రిగా కూడా చేయని రేవంత్ ఈ విధంగా ముఖ్యమంత్రి అవుతారని గులాబీ బాస్ అనుకోక పోవచ్చు కలలో కూడా ఊహించ లేకపోవచ్చు కానీ అదే ప్రజాస్వామ్యం గొప్పదనం అంటేను మరీ.

గ్రాఫ్ చూస్తే అలా :

కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్ లో ఉన్నారు పోనీ ప్రశాంతగా ఏమైనా ఉన్నారా అంటే లేదుగా అన్నదే బదులు వస్తుంది. కుమార్తె కవిత లిక్కర్ కేసులో అరెస్టు అయి అయిదారు నెలలు ఢిల్లీలో జైలులో ఉన్నారు. అలా మొదలైన షాకులు ఆ తరువాత మితిమీరాయి, శృతి మించాయి. అది కాస్తా చివరికి కాళేశ్వరం ప్రాజెక్ట్ దాకా వ్యవహారం వచ్చింది. సీబీఐకి ఈ కేసుని రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. మరో వైపు చూస్తే కవిత బీఆర్ఎస్ కే ఎదురు నిలిచి పార్టీకి దూరం అయ్యారు. ఇంకో వైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు. ఇలా రెండేళ్ళలో ఏ మాత్రం గ్రాఫ్ పెరగకపోగా మరిన్ని ఇబ్బందులు వస్తున్నాయని విశ్లేషణలు ఉన్నాయి.

వేరే జైలు ఎందుకు అంటూ :

ఇంకో వైపు కేసీఅర్ ని వేరేగా అరెస్ట్ చేసి జైలులో ఎందుకు పెట్టాలి అని ఆ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా ముందు ప్రశ్నించారు. ఆయన తనకు తానుగా స్వీయ నిర్బంధనంలోకి వెళ్లి ఫాం హౌస్ లో ఉంటున్నారు కదా అని సెటైర్లు పేల్చారు. జనాలకు అధికారానికి దూరం అయిన ఆయనకు అంతకంటే శిక్ష వేరే ఎందుకు అని ఒక విధంగా గట్టిగానే గుచ్చేశారు. అది కూడా పెద్దాయనకు బాధే కదా అని అంటున్నారు.

సరైన టైం లోనట :

ఇవన్నీ ఇలా ఉంటే కేసీఅర్ అసెంబ్లీకి రావడం లేదు ఏప్రిల్ లో జరిగిన పార్టీ రజతోత్సవ వేడుక తరువాత మళ్ళీ జనాలకు ముఖం చూపించలేదు. దాంతో పెద్దాయన ఎపుడు జనంలోకి వస్తారు అన్న చర్చ కూడా సాగుతోంది. దాంతో పాటు చూస్తే కనుక గులాబీ పార్టీ క్యాడర్ కూడా ఆయన బయటకు వస్తే బాగుంటి, ఆ కిక్కే వేరు అని కూడా భావిస్తోంది. అయితే తాజాగా కేటీఆర్ ఒక మాట అయితే చెప్పారు. కేసీఅర్ కి ఎపుడు జనాల్లోకి రావాలో తెలుసు అని అన్నారు. ఆయన సరైన సమయంలోనే జనంలోకి వస్తారు అని అన్నారు.

అంటే కాంగ్రెస్ పాలన పక్వానికి వచ్చింది అని తేలినపుడు కేసీఅర్ బయటకు వచ్చి జనానికి చేరువ అవుతారా అన్న చర్చ సాగుతోంది. రెండేళ్ళ రేవంత్ రెడ్డి పాలన పూర్తి అయింది మెల్లగా యాంటీ ఇంకెంబెన్సీ మొదలవుతుందని అది కాస్తా మరింతగా ముదిరాక కేసీఆర్ రంగంలోకి దిగుతారు అని అంటున్నారు. అన్నీ అనుకూలిస్తే 2026 లో గులాబీ బాస్ కారెక్కి జనం వద్దకు వస్తారని అంటున్నారు.