Begin typing your search above and press return to search.

వైసీపీది బీఆర్ఎస్ ది ఒకే రాగం...ఒకే తాళమా ?

తెలుగు నాట రాజకీయం అందరికీ అర్ధం అవుతోంది. కానీ అది అస్పష్టంగా ఉన్నట్లుగా ఉంటుంది. కొన్ని అవగాహనలు తెర వెనక ఉంటాయి.

By:  Satya P   |   21 Sept 2025 9:19 AM IST
వైసీపీది బీఆర్ఎస్ ది ఒకే రాగం...ఒకే తాళమా ?
X

తెలుగు నాట రాజకీయం అందరికీ అర్ధం అవుతోంది. కానీ అది అస్పష్టంగా ఉన్నట్లుగా ఉంటుంది. కొన్ని అవగాహనలు తెర వెనక ఉంటాయి. కొన్ని పొత్తులు అనధికారికంగా ఉంటాయి. బయట ఫైట్ ఒకలా ఉంటుంది. అలాగే వారిని వీరు పొగుడుతారు, అదే సమయంలో ఇంకో సారి విమర్శిస్తూంటారు. దీంతో ఒకనాటి స్నేహాలు ఆ రాజకీయ క్రీనీడలో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఎవరేమిటి అని జనాలు అంచనాకు వస్తూనే ఉంటారు కానీ ఎప్పటికి అపుడు కొత్తగా ఈ ఎత్తుగడలు సాగుతూనే ఉంటాయి.

కనెక్షన్ స్ట్రాంగ్ :

కేసీఆర్ జగన్ ల మధ్య మంచి బాండింగ్ ఉంది అని అంతా అంటారు. ఈ ఇద్దరూ కలసి రాజకీయాలు చేయలేదు. ఒకే పార్టీలో పని చేయలేదు, ఏజ్ పరంగా చూసుకుంటే కూడా తేడా ఉంది. కానీ ఇద్దరూ మాత్రం చాలా విషయాలలో ఒక్కటిగా ఉంటారు. ఇద్దరికీ తెలుగు నాట రాజకీయంలో ఉమ్మడి ప్రత్యర్థి చంద్రబాబు. అంతే కాదు ఇద్దరూ వ్యతిరేకించే మరో ఉమ్మడి రాజకీయ పార్టీగా కాంగ్రెస్ ఉంటుంది. ఇలా చాలా విషయాలు మంచి కనెక్షన్ ఈ ఇద్దరి మధ్య కుదిర్చాయని చెబుతూ ఉంటారు.

విపక్షంలోనూ ఒకేలా :

ఇక ఈ ఇద్దరూ అధికారంలో ఉన్నపుడు ఇచ్చి పుచ్చుకునేవారు. జగన్ కేసీఆర్ ని ఏమీ అనేవారు కాదు, జగన్ సైతం అలాగే ఉండేవారు. అంతే కాదు జగన్ సీఎం గా ప్రమాణం చేస్తే కేసేఅర్ వచ్చి ఆశీర్వదించారు. అలాగే కేసీఆర్ ఇంటికి అనేక సార్లు జగన్ వెళ్ళి ముచ్చట్లు పెట్టారు. ఇపుడు విపక్షంలో ఈ ఇద్దరూ ఉన్నారు. అయినా బంధం బాగానే ఉంది అన్నట్లుగా సీన్ కనిపిస్తోంది. అక్కడ కేసీఆర్ అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. ఇక్కడ జగన్ కూడా అదే పని చేస్తున్నారు. అక్కడ కేసీఅర్ ఎక్కువగా ఫాం హౌస్ కే పరిమితం అవుతున్నారు ఇక్కడ జగన్ బెంగళూర్ లో ఎక్కువ సమయం ఉంటున్నారు అని చెబుతారు. జనంలోకి కేసీఆర్ పెద్దగా రావడం లేదు, జగన్ సైతం అదే విధంగా లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నారు.

మూకుమ్మడిగానే ప్లాన్ :

ఇపుడు చూస్తే మరో చర్చ సాగుతోంది. తెలుగు నాట రెండు రాష్ట్రాలలో గత కొద్ది రోజులుగా మూకుమ్మడి ఉప ఎన్నికలు అన్న మాట వినిపిస్తోంది. తెలంగాణాలో ఏపీలో కూడా అదే రాగం అదే తాళంలో వినిపించడమే విశేషం. తెలంగాణాలో ఎందుకు మూకుమ్మడి ఉప ఎన్నికలు అంటే అక్కడ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన పది మంది ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం చూస్తే స్పీకర్ నిర్ణయం తీసుకుంటే అనర్హులు అవుతారు ఆ విధంగా తొందరలో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ ఎస్ భావిస్తోంది అలా తోసుకు వచ్చే ఉప ఎన్నికల్లో తామే అన్ని సీట్లు గెలిచి కాంగ్రెస్ పార్టీని పూర్తిగా డీమోరలైజ్ చేయాలని వచ్చే ఎన్నికల కంటే ముందే రాజకీయ ఆధిపత్యం చలాయించాలని చూస్తోంది. వీలుటే ఈ ఉప ఎన్నికల తరువాత ప్రజా వ్యతిరేకత ఇంత ఉందా అని చూపించి మరి రాజకీయంగా ప్రకంపనలు రేపాలని కూడా బీఆర్ఎస్ భావిస్తోంది అని అంటున్నారు.

మినీ ఎన్నికల సమరం :

వైసీపీలో కూడా ఇపుడు అదే రకమైన చర్చ సాగుతోంది అని అంటున్నారు జగన్ తన ఎమ్మెల్యేలతో మాట్లాడుతూ మూకుమ్మడి ఎన్నికలను తెర తీద్దామని చెప్పినట్లుగా గత రెండు మూడు రోజులుగా ప్రచారం సాగుతోంది. వైసీపీకి ఉన్న మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలతో ఉప ఎన్నికలకు పోదామని జగన్ అన్నట్లుగా ప్రచారం అయితే ఉంది మరి. అదే కనుక అమలు చేయాలనుకుంటే ఏపీ నుంచి 11 మంది ఎమ్మెల్యే స్థానాలను తెలంగాణాలో పది ఎమ్మెల్యే స్థానాలకు ఒకేసారి ఉప ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు అంటే ఒక విధంగా రెండు రాష్ట్రాలలో మినీ ఎన్నికల సమరం అన్న మాట. మరి ఈ ఎత్తులు ఎత్తుగడలు యాక్షన్ లోకి ఎపుడు వస్తాయి అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా మూకుమ్మడి ఉప ఎన్నికలు అన్నది మాత్రం తెలుగు నాట వేడెక్కించే ఇష్యూగా ఉంది.