Begin typing your search above and press return to search.

ఫాంహౌస్ లో హీటెడ్ డిస్కషన్స్... మ్యాటర్ సీరియస్ !

వరుసగా గత రెండు రోజులుగా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫాంహౌస్ లో హీటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.

By:  Satya P   |   8 Sept 2025 9:27 AM IST
ఫాంహౌస్ లో హీటెడ్ డిస్కషన్స్... మ్యాటర్ సీరియస్ !
X

వరుసగా గత రెండు రోజులుగా ఎర్రవల్లిలో కేసీఆర్ ఫాంహౌస్ లో హీటెడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయని ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ సీనియర్లతో కీలక నాయకులతో ఈ వరుస భేటీలు వేస్తున్నారు అని అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన వర్తమాన రాజకీయాల గురించి పార్టీ ముఖ్యులతో చర్చించడమే కాకుండా రానున్న రోజులలో ఏ విధంగా వ్యవహరించాలి అన్నది కూడా సమాలోచనలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఆ రెండు ఇష్యూస్ మీద :

తెలంగాణాలో ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో అవినీతి మీద సీబీఐ విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా సీబీఐ డైరెక్టర్ కూడా హైదరాబాద్ వచ్చి వెళ్లారు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించిన ప్రాథమిక సమాచారం తెలుసుకోవడానికి వచ్చారు అని ప్రచారం అయితే సాగింది. అదే సమయంలో కాంగ్రెస్ సైతం సీబీఐ విచారణ మీద పట్టుదలగా ఉంది. అవసరం అయితే కేంద్ర పెద్దలను కలసి మరీ సీబీఐ విచారణను తొందరగా జరిపించాలని కోరనుంది అని అంటున్నారు. దాంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ సీబీఐ విచారణ కూడా ఫాంహౌస్ లో చర్చకు వచ్చినట్లుగా చెబుతున్నారు. అదే విధంగా ఈ నెల 9న జరిగే ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి అన్నది కూడా కేసీఆర్ పార్టీ ముఖ్యులతో చర్చించారు అని అంటున్నారు.

న్యూట్రల్ స్టాండ్ తో నేనా :

ఇక కొద్ది రోజుల క్రితం వరకూ తెలంగాణా వాదం మీద జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నిలుస్తుంది అని ప్రచారం సాగింది. అయితే ఇపుడు మాత్రం ఆలోచనలు మారాయని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సీబీఐ విచారణకు కోరుతూ తీర్మానించడం అన్నది ఈ మధ్యలో జరిగిపోయింది. అదే విధంగా సీబీఐ అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ. దాంతో బీజేపీ అక్కడ అధికారంలో ఉంటుంది. ఎన్డీయేకు మద్దతు ఇస్తే ఈ సమయంలో బాగుంటుందా అన్నది కూడా మరో చర్చగా ఉందని అంటున్నారు. అలాగని కాంగ్రెస్ కి కూడా ఇవ్వకూడదని తటస్థంగా వ్యవహరించాలని బీఆర్ఎస్ నిర్ణయించవచ్చు అని అంటున్నారు. అంటే ఈ ఎన్నికలలో తమకు రాజ్యసభలో ఉన్న నలుగురు ఎంపీలు ఓటు వేయకుండా ఉంటారని అంటున్నారు. అలా చేయడం అంటే పరోక్షంగా అది ఎన్డీయేకు మద్దతు ఇచ్చినట్లే అన్న విమర్శలు ఉన్నా కూడా బీఆర్ఎస్ ఉన్నంతలో ఉభయ కుశలోపరిగా ఈ డెసిషన్ మీదనే ఉంటుంది అని అంటున్నారు.

కవితని లైట్ తీసుకోవాలా :

ఇక బీఆర్ఎస్ నుంచి కవితని ఇటీవల సస్పెండ్ చేశారు. అయితే ఆమె తరచుగా మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తే ఎలా రియాక్ట్ కావాలి అన్న దాని మీద కూడా బీఆర్ఎస్ అధినాయకత్వం లోతుగానే ఆలోచించింది అని అంటున్నారు. ఆమె పార్టీలో లేదని ఆమె విమర్శలకు అతిగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదాని భావిస్తున్నారుట. అందుకే ఎవరూ పెద్దగా స్పందించకూడదని అంటున్నారు. ఇక కేసీఅర్ తో ఫాంహౌస్ లో గత రెండు రోజులుగా హరీష్ రావు భేటీ అయ్యారని అంటున్నారు. ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చిన వెంటనే పెద్దాయన వద్దకు వెళ్ళారని చెబుతున్నారు. అర్ధరాత్రి దాకా ఈ చర్చలు సాగాయని అంటున్నారు. మరో వైపు గత వారంగా కేటీఆర్ కూడా ఫాంహౌస్ లోనే ఉంటున్నారని కూడా ప్రచారం సాగుతోంది. మరి వరస చర్చల పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది అని అంటున్నారు.