Begin typing your search above and press return to search.

అసెంబ్లీకి కేసీఆర్ : ఇలా వచ్చారు.. అలా వెళ్లిపోయారు..

నిన్నటి నుంచి ఒకటే హైప్.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేస్తున్నారహో అంటూ మీడియా అంతా ఊదరగొట్టింది.

By:  A.N.Kumar   |   29 Dec 2025 11:33 AM IST
అసెంబ్లీకి కేసీఆర్ : ఇలా వచ్చారు.. అలా వెళ్లిపోయారు..
X

నిన్నటి నుంచి ఒకటే హైప్.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చేస్తున్నారహో అంటూ మీడియా అంతా ఊదరగొట్టింది. సోషల్ మీడియా అయితే మీమ్స్ , ట్రోల్స్ తో దద్దరిల్లిపోయింది. కొందరు కేసీఆర్ కు అనుకూలంగా.. మరికొందరు రేవంత్ వల్లే కేసీఆర్ సభకు వస్తున్నారంటూ వ్యతిరేకంగా వీడియోలు రూపొందించి హోరెత్తించారు. కేసీఆర్ సభకు వచ్చి ఏం చేస్తారు? ఎలా ముందుకెళుతారు అన్న ఉత్కంఠ అందరిలోనూ ఊపందుకుంది. అయితే అంత ఉత్తదే అయిపోయింది. కేసీఆర్ సభకు ఇలావచ్చారు. అసెంబ్లీ రిజిస్ట్రర్లో సంతకం చేశారు.. మధ్యలో రేవంత్ వస్తే షేక్ హ్యాండ్ ఇచ్చారు. అనంతరం అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారు. ఇదీ కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నారన్న హంగామాకు ఈరోజు తెరపడింది.అందరినీ నిట్టూర్చేలా చేసింది.

తెలంగాణ రాజకీయాల్లో మనసులు మారిపోయారు. ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్ అసలు అసెంబ్లీకే రావడం లేదు. ప్రభుత్వంపై పోరాడడం లేదు. ఇటీవలే రెండేళ్లు ఎదురుచూశానని.. ఇక కాంగ్రెస్ సర్కార్ వెంట పడుతానంటూ ప్రెస్ మీట్ పెట్టి చీల్చిచెండాడాడు. ఈ క్రమంలోనే మరో షాకింగ్ నిర్ణయం తీసుకొని కేసీఆర్ ఆశ్చర్యపరిచాడు.

తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు.. ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతం కూడా పలికారు. అనంతరం అసెంబ్లీలోకి కేసీఆర్ ను ఎమ్మెల్యేలు తొడుక్కొని వెళ్లారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకునపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించనుందని తెలుస్తోంది. అందుకోసం అస్త్రశస్త్రాలను ఆ పార్టీ సిద్ధంచేసుకుంది.

ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీలతోపాటు నీటిపారుదల అంశాలు.. ప్రాజెక్టుల నిర్మాణంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈరోజు జరిగే బీఏసీ సమావేశంలో ఈ శీతాకాల సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు విపక్షపార్టీల విమర్శలను సమర్దవంతంగా తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఈరోజు సమావేశాలకు హాజరుకానున్నారు. 2023 ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో పదేళ్ల పాటు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్అధినేత కేసీఆర్ ప్రతిపక్షనాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఈ రెండేళ్లలో ఆయన కేవలం రెండు సార్లు మాత్రమే తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు.

తెలంగాణలో ఓడిపోయాక కేసీఆర్ తన ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీనిపై రేవంత్ కూడా గట్టిగా స్పందించారు. అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు చర్చిద్దామంటూ కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయం తెలిసిందే..ఈక్రమంలోనే అసెంబ్లీకి వచ్చారు.

అయితే కేసీఆర్ ఇలా అసెంబ్లీకి వచ్చి అలా వెళ్లిపోయారు. అసెంబ్లీ అటెండెన్స్ రిజిస్టర్ లో సంతకం చేసి బయటకు వెళ్లిపోయారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ మరణించిన ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్ రెడ్డి, కొండ లక్ష్మన్ రెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలిపింది. స్పీకర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన కాసేపటికే సభను వీడారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి.. సభకు వచ్చిన కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితిపై సీఎం ఆరాతీశారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ ను కలిశారు.