Begin typing your search above and press return to search.

తాను ఏ బాణాన్నో.. చెప్పేసిన క‌విత‌!

తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సొంత పార్టీ పెట్టుకున్న త‌ర్వాత‌.. ఆమెపై స‌హ‌జంగానే కామెంట్లు వ‌స్తున్నాయి.

By:  Garuda Media   |   21 Sept 2026 9:49 PM IST
తాను ఏ బాణాన్నో.. చెప్పేసిన క‌విత‌!
X

తెలంగాణ ర‌క్ష‌ణ సేన అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత సొంత పార్టీ పెట్టుకున్న త‌ర్వాత‌.. ఆమెపై స‌హ‌జంగానే కామెంట్లు వ‌స్తున్నాయి. క‌విత కాంగ్రెస్ వదిలిన బాణ‌మ‌ని బీఆర్ ఎస్ నాయ‌కులు కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు. కాదు కాదు.. ఆమె బీజేపీ వ‌దిలిన బాణ‌మ‌ని కాంగ్రెస్ నాయ‌కులు విమ‌ర్శిస్తున్నారు. ఈ బాణం వ్యాఖ్య‌ల‌పై తాజాగా క‌విత స్పందిస్తూ.. తాను ఎవ‌రి బాణాన్నీ కాద‌ని పేర్కొన్నారు. తాను `బ‌హుజ‌నుల బాణాన్ని` అని నొక్కి చెప్పారు. తాను తెలంగాణలో అణ‌గారిన వ‌ర్గాల త‌ర‌ఫున గ‌ళం వినిపించేందుకు అధికారం సాధించేం దుకు వ‌చ్చిన బాణాన్న‌ని తేల్చి చెప్పారు. అయితే.. ఆమె ఎవ‌రి బాణ‌మో అంటూ ఇప్ప‌టి వ‌ర‌కు విమ‌ర్శ‌లు చేసిన వారు ఈ వ్యాఖ్య‌ల‌పై ఏమంటారో చూడాలి.

ఎవ‌రి మ‌ద్ద‌తు త‌న‌కు అవ‌స‌రం లేద‌ని క‌విత చెప్పుకొచ్చారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజ‌క‌వ‌ర్గం కొడంగ‌ల్‌లో నిర్వ‌హించిన టీఆర్ ఎస్ కార్య‌క్ర‌మంలో క‌విత మాట్లాడారు. తాను ఎవ‌రి చెప్పు చేత‌ల్లోనూ లేన‌న్నారు. ఎవ‌రికీ తాను త‌ల వంచేది లేద‌న్నారు. ఒక్క తెలంగాణ ప్ర‌జ‌ల కోసమే తాను ఏమైనా చేస్తాన‌ని చెప్పారు. వారి ముందే తాను మోక‌రిల్లాన‌ని, ఎలాంటి మ‌ద్ద‌తు లేకుండానే ఒక మ‌హిళ రాజ‌కీయాల‌లో ఎలా నిల‌బ‌డుతుందో చూపించేందుకే తాను రాజ‌కీయాల్లో సొంత పార్టీ పెట్టుకున్నాన‌ని ఆమె వివ‌రించారు. ఇదంతా త‌న కోసం కాద‌న్న క‌విత‌.. కేవ‌లం తెలంగాణ‌లో వెనుక‌బ‌డిన వ‌ర్గాల అభ్యున్న‌తి కోస‌మేన‌ని పేర్కొన్నారు.

గిన్నెల‌పై మ‌గ‌వారి పేరెందుకు?

దేశంలో మ‌హిళ‌ల‌ను మ‌హ‌రాణుల‌ని మాట‌లు చెబుతార‌న్న క‌విత‌.. ఇంట్లో గిన్నెల‌పై మాత్రం మ‌గ‌వారి పేర్లు ఉంటాయ‌ని ఎద్దేవా చేయ‌డం గ‌మ‌నార్హం. ఇదేం సంస్కృతి అని మండిప‌డ్డారు. మ‌హిళ‌ల‌కు స్వేచ్ఛ ఉంద‌ని అనుకోవ‌డం మాట‌లవ‌ర‌కే న‌ని వ్యాఖ్యానించారు.. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని విమ‌ర్శించారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయ‌ని.. కానీ ఒక్క రాష్ట్రానికి మాత్ర‌మే మ‌హిళ ముఖ్య‌మంత్రిగా ఉన్నార‌ని తెలిపారు. ఈ ప‌రిస్థితిని మార్చాల‌ని .. తెలంగాణ‌కు మ‌హిళా ముఖ్య‌మంత్రి అయ్యే అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. ఈ దిశ‌గా ఆలోచ‌న చేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు.

ఇన్ని శాఖ‌లు ఉన్న‌..

సీఎం రేవంత్ రెడ్డి ద‌గ్గ‌ర మంత్రుల శాఖ‌లు గుట్ట‌లు గుట్ట‌లుగా ఉన్నాయ‌ని కవిత చెప్పారు. ఇన్ని శాఖ‌లు ఇత‌ర రాష్ట్రాల్లోని ముఖ్య‌మంత్రుల ద‌గ్గ‌ర లేవ‌న్నారు. విద్య నుంచి హోం వ‌ర‌కు ఇన్ని శాఖ‌లు ఉన్నా.. ఒక్క దానిని కూడా సంపూర్ణంగా నెర‌వేర్చ‌లేక‌పోతున్నార‌ని విమ‌ర్శించా రు. రాష్ట్రంలో విద్యావ్య‌వ‌స్థ‌ను స‌రిదిద్ద‌లేక పోతున్నార‌ని అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల‌ని క‌విత పిలుపుని చ్చారు. అయితే.. క‌విత ప్ర‌సంగిస్తున్న స‌మయంలో స‌భ‌లో నుంచి చాలా మంది లేచి వెళ్లిపోయిన దృశ్యాలు క‌నిపించాయి. దీనిపై ఆమె స్పందించ‌లేదు.