Begin typing your search above and press return to search.

క‌విత పార్టీ అంత‌ర్గ‌త‌ స‌ర్వేలు.. విష‌యం ఇదే!

ఇప్ప‌టి వ‌రకు ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. స‌ర్వేల ఆధారంగానే ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు క‌విత కూడా ఇదే బాట ఎంచుకున్న‌ట్టు చెబుతున్నారు.

By:  Garuda Media   |   29 Sept 2026 12:00 AM IST
క‌విత పార్టీ అంత‌ర్గ‌త‌ స‌ర్వేలు.. విష‌యం ఇదే!
X

తెలంగాణ ర‌క్ష‌ణ సేన‌(టీఆర్ ఎస్‌) పేరుతో కొత్త రాజ‌కీయ పార్టీని ప్రారంభించిన మాజీ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌.. భ‌విష్య‌త్తు రాజ‌కీయాల‌పై అంతర్గ‌తంగా నాయ‌కులు, మేధావుల‌తో చ‌ర్చించ‌డ‌మే కాదు.. స‌ర్వేలు కూడా చేయిస్తు న్నార‌ని తెలుస్తోంది. ముఖ్యంగా 3 రూపాల్లో ఆమె స‌ర్వే చేయించి.. తెలంగాణ స‌మాజం నాడిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌రకు ఏ రాజ‌కీయ పార్టీ అయినా.. స‌ర్వేల ఆధారంగానే ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు క‌విత కూడా ఇదే బాట ఎంచుకున్న‌ట్టు చెబుతున్నారు.

స‌ర్వేల విష‌యాలు..

1) నాయ‌కురాలిగా: క‌విత సొంత పార్టీ పెట్టుకున్న‌ప్ప‌టికీ.. నాయ‌కురాలిగా.. తెలంగాణ స‌మాజం ఏమేర‌కు అంగీక రిస్తున్న‌ద‌న్న విష‌యాన్ని తెలుసుకుంటారు. గ‌తంలో ఎంపీగా, ఎమ్మెల్సీగా చేసిన‌ప్ప‌టికీ.. ఇప్పుడు ఒక పార్టీకి అధ్య‌క్షురాలిగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో గ‌తానికి భిన్న‌మైన పంథాలో ప్ర‌జ‌లు ఏమేర‌కు ఆమె స్వాగ‌తిస్తున్నార‌న్న విష‌యాన్ని ప‌రిశీలించుకుని.. త‌న‌లో తాను మార్పులు చేసుకునేందుకు క‌విత రెడీ అవుతున్నారు.

2) ఓటు బ్యాంకు: బీఆర్ ఎస్‌, కాంగ్రెస్, బీజేపీ వంటి సంస్థాగ‌త ఓటు బ్యాంకు బ‌లంగా ఉన్న పార్టీల‌కు దీటుగా త‌న పార్టీని కూడా బ‌లోపేతం చేసుకునే క్ర‌మంలో క‌విత‌.. ఓటు బ్యాంకుపైనా దృష్టి పెట్టారు. ఏయే వ‌ర్గాల‌కు తాను చేరువ కావాలి? ముఖ్యంగా మ‌హిళా ఓటు బ్యాంకు ఎటు వైపు ఉంది? దీనికిగాను తాను ఏ విధంగాముందుకు సాగాలి? యువ‌త ఓటు బ్యాంకు ఎలా ఉంది? అనే విష‌యాల‌పై స‌మ‌గ్రంగా తెలుసుకుంటారు. త‌ద్వారా త‌న సొంత ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తారు.

3) పాంచ‌జ‌న్యం: టీఆర్ ఎస్ పార్టీని ప్రారంభించే ముందు.. క‌విత‌.. పాంచ‌జ‌న్యం పేరుతో ఐదు హామీల‌ను ప్ర‌జ‌ల‌కు ప్ర‌క‌టించారు. వీటిపై త‌ర‌చుగా ఆమె ప్ర‌జ‌ల్లో చెబుతున్నారు. అయితే.. ప్ర‌జ‌లు ఈ హామీల‌ను ఏ మేర‌కు విశ్విస్తు న్నారు? ఇంకా ఏమైనా తాను స్పృశించ‌ని హామీలు ఉన్నాయా? ప్ర‌జ‌ల అభిప్రాయం ఏంటి? అనే కోణంలో ఈ పాంచ‌జ‌న్యం హామీల‌పైనా స‌ర్వేలో జ‌నం నాడిని తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

మొత్తంగా: బ‌ల‌మైన మూడు పార్టీల‌ను ఢీకొంటూ.. ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్న క‌విత‌.. ప్ర‌జ‌ల నాడిని ప‌సిగ‌ట్టేందుకు స‌ర్వేల ద్వారా.. త‌న రూట్‌ను మ‌రింత క్లియ‌ర్ చేసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.దీనిలో వ‌చ్చే రిజ‌ల్ట్‌ను అనుస‌రించి ఆమె నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది.