Begin typing your search above and press return to search.

బీసీ బంద్ లో కవిత డ్రామా..? మానవహారం సక్సెసా..?

ఇది ఇలా ఉంటే.. ఆమె బీసీ రిజర్వేషన్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ జరిగి తీరాలని ఈ విషయంలో తాను కాంగ్రెస్ తో కలిసి నడుస్తానని చెప్పారు.

By:  Tupaki Political Desk   |   18 Oct 2025 2:20 PM IST
బీసీ బంద్ లో కవిత డ్రామా..? మానవహారం సక్సెసా..?
X

తెలంగాణ రాజకీయాల్లో కొన్ని రోజులుగా కవిత గురించి ఎక్కువగా వినిపిస్తోంది. పార్టీ నుంచి వెలివేయబడ్డ ఆమె మేనబావ, కజిన్ పై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని వీడారు. ‘కేసీఆర్ నాకు మెంటర్.. ఆయన ఆదర్శంతోనే పని చేస్తా.. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటా’ అంటూ చెప్పి పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత సొంత పార్టీ పెడతానని ప్రకటించారు. కానీ ఆ దిశగా ఎటువంటి పురోగతి సాధించలేదు. కానీ తను కలిసి నడిచిన తెలంగాణ జాగృతినే పార్టీగా అనౌన్స్ చేస్తుందని ఆమె అనుచరులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని కార్యక్రమాలు చేపడుతున్నారు. ‘జాగృతి జనం బాట’ అనేక కార్యక్రమాన్ని రూపొందించుకున్నారు. దీని ద్వారా ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని ప్రకటించారు. దీని కోసం తాను కేసీఆర్ ఫొటోను వాడుకోనని మరో సారి సంచలన కామెంట్లు చేశారు.

ఇది ఇలా ఉంటే.. ఆమె బీసీ రిజర్వేషన్ కు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు. బీసీ రిజర్వేషన్ జరిగి తీరాలని ఈ విషయంలో తాను కాంగ్రెస్ తో కలిసి నడుస్తానని చెప్పారు. శనివారం, అక్టోబర్ 18న కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బీసీ బంద్ కు మద్దతిచ్చారు. ఇందులో భాగంగా ఆమె పెద్ద ఎత్తున పాల్గొన్నట్లు కనిపిస్తుంది. సోషల్ మీడియాలో హైప్ కూడా పెంచుకుంటున్నారు. సోషల్ మీడియాలో తీవ్రమైన దుమారం రేపుతున్నారు.

బీసీ బంద్ కు కల్వకుంట్ల కవిత ఆటో ర్యాలీ తీయబోతున్నారని, ఖైరతాబాద్ చౌరస్తాకు పెద్ద ఎత్తున ఆటోలతో చేరుకుంటుందని, వేలాది అటోలతో జనం ఊహించని విధంగా రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె కూడా ఆటో ర్యాలీ నిర్వహించి ఖైరతాబాద్ చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేసింది. తన పార్టీ తరుఫున నిర్వహించని మానవ హారంలో కార్యకర్తలు, ఫాలోవర్స్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాలతో కల్వకుంట్ల కవిత రాజకీయంగా తెలంగాణలో గుర్తింపు దక్కించుకోవాలని చూస్తోంది. ఆమె కార్యక్రమాలపై ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ‘లిక్కర్ క్వీన్’ అనే నిందమోస్తున్న కల్వకుంట్ల కవిత తను పార్టీ పెడితే జనంలోకి ఏ మేరకు వెళ్తుందన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. అయితే కొందరు మాత్రం ఆమె పార్టీ పెట్టదు చివరికి మళ్లీ బీఆర్ఎస్ గూటికే చేరుతుందని అంటున్నారు. ఇలాంటి కార్యక్రమాలతో తన ఫాలోవర్స్ ను పెంచుకోవాలని వ్యూహాలు రచిస్తుందని ఆమె వ్యతిరేకులు చెప్పుకుంటున్నారు.

ఏది ఏమైనా ఆమె కార్యక్రమాల పట్ల ప్రజలు ఎక్కువగా ఇంట్రస్ట్ చూపించడం లేదని తెలుస్తోంది. ఖైరతాబాద్ లో పెద్ద ఎత్తు మానహారం అన్నారు. కానీ అది అంత సక్సెస్ కాలేదు. పైగా తన కొడుకును కూడా ఇందులో పాల్గొనేలా చేసి తన వైపునకు అటెన్షన్ తిప్పుకోవడంలో మాత్రం కొంచెం సక్సెస్ అయ్యారు.