Begin typing your search above and press return to search.

జూబ్లీహిల్స్ లో బీఆరెస్స్ ఓటమికి కారణం చెప్పిన కవిత.. ఇది పీక్స్!

జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలో బీఆరెస్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   15 Nov 2025 3:00 PM IST
జూబ్లీహిల్స్  లో బీఆరెస్స్  ఓటమికి కారణం చెప్పిన కవిత.. ఇది పీక్స్!
X

జూబ్లీహిల్స్ లో జరిగిన ఉప ఎన్నికలో బీఆరెస్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమికి కారణం రౌడీయిజం అని ఆ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఆరోపిస్తే... బీజేపీ – కాంగ్రెస్ ల అనధికారిక కలయిక వల్లే ఓటమి పాలైనట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. ఈ ఆరోపణల సంగతి అలా ఉంటే... బీఆరెస్స్ ఓటమికి సరికొత్త కారణం చెబుతున్నారు తెలంగాణ జన జాగృతి అధ్యక్షురాలు కవిత.

అవును... జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆరెస్స్ ఓటమికి రకరకాల విశ్లేషణలు, ఆరోపణలు, సమర్ధింపులు, విమర్శలు తెరపైకి వస్తోన్న వేళ కవిత స్పందించారు. ఈ సందర్భంగా బీఆరెస్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా... సోషల్ మీడియాలో మాత్రమే బీఆరెస్స్ ఉందని.. అందువల్లే జూబ్లీహిల్స్ లో ఓడిపోయిందని తెలిపారు. దీంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

‘ఆసులు పెంచుకున్నారు.. కేడర్ ను పెంచుకోలేదు’!:

ఇదే సమయంలో బీఆరెస్స్ పార్టీలోని పలువురు నేతలపైనా కవిత తీవ్ర విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... బీఆరెస్స్ పార్టీ నేతలు ఆస్తులు పెంచుకున్నారు కానీ కేడర్ ను పెంచుకోలేదని కవిత విమర్శించారు. ఈ క్రమంలో... జగదీశ్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, మదన్ రెడ్డి, నిరంజన్ రెడ్డికి ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ఎలా వచ్చాయని ఆమె ప్రశ్నించారు.

హరీష్ రావు, కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు!:

ఇదే క్రమంలో బీఆరెస్స్ కీలక నేత, మాజీ మంత్రి హరీష్ రావుపైనా కవిత ఘాటు విమర్శలు చేశారు. ఇందులో భాగంగా... బీఆరెస్స్ లో కీలక నేతలు ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడమే సరిపోతుందని మొదలు పెట్టిన కవిత... మోసం చేయడం హరీష్ రావు నైజమని.. కేటీఆర్ ఇకనైనా సోషల్ మీడియాను వదిలి బయటకు రావాలని ఆమె అన్నారు.

ఇదే సమయంలో... బీఆరెస్స్ ఓడిపోగానే ఓటమికి కారణం తాను కాదని తప్పించుకోవడం హరీశ్‌ రావు నైజమని.. ఆయన గురించి గట్టిగా మాట్లాడితేనే తనను పార్టీ నుంచి బయటకు పంపారని చెప్పిన కవిత... కేటీఆర్‌, హరీశ్‌ పేరుకు మాత్రమే కృష్ణార్జునులని ట్వీట్‌ చేసుకోవడం తప్ప క్షేత్రస్థాయిలో పనిచేయడంలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

హరీష్ కి రేవంత్ కి ఉన్న ఒప్పందం ఏమిటి?:

ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి, హరీష్ రావుని కలిపి కవిత విమర్శలు గుప్పించారు. ఇందులో భాగంగా... ముఖ్యమంత్రి పీఆర్వో గా ఉన్న అయోధ్య రెడ్డి, హరీష్ రావు పాల వ్యాపారం అక్రమమని ఇప్పటికే చెప్పారని.. అయినప్పటికీ హరీష్ రావు అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు సీఎం కి ఎందుకు కనబడటం లేదని కవిత ప్రశ్నించారు! ఈ సందర్భంగా... హరీష్ కి సీఎం రేవంత్ కి ఉన్న ఒప్పందం ఏమిటో సమాధానం చెప్పాలని నిలదీశారు.