మండలిలో కవిత కన్నీరు.. బీఆర్ ఎస్‌పై తీవ్ర విమర్శలు
తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత.. కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం శాసన మండలికి వచ్చిన ఆమె.. సభలో మాట్లాడారు.
By: Garuda Media | 5 Jan 2026 3:31 PM ISTతెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత.. కన్నీరు పెట్టుకున్నారు. సోమవారం శాసన మండలికి వచ్చిన ఆమె.. సభలో మాట్లాడారు. తనను బీఆర్ ఎస్ పార్టీ అత్యంత ఘోరంగా అవమానించిం దన్నారు. ఈ అవమానం పగవారికి కూడా రారాదని కోరుకుంటున్నట్టు తెలిపారు. ముఖ్యంగా.. బీఆర్ ఎస్ పార్టీ వ్యవహారాలపైనే ఆమె ప్రధానంగా ఫోకస్ చేయడం విశేషం.
ముందుగానే ఆమె ఈ నెల 5న మండలికి వస్తున్నట్టు ప్రకటించారు. అన్నట్టుగానే ఆమె సభకు వచ్చారు. తన రాజీనామా సహా బీఆర్ ఎస్ ఏవిధంగా వ్యవహరించిందన్న విషయాలను సభలో చెబుతానని తెలిపా రు. ఆ విషయాలపైనే సోమవారం ఆమె సభలో మాట్లాడారు. పార్టీలో జరుగుతున్న అవకతవకలను ప్రశ్నిం చినందుకే.. తనపై కక్ష కట్టారని కవిత పేర్కొన్నారు. తనకు తీవ్ర అవమానం జరిగిందన్నారు.
ఇదే సమయంలో పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని.. నియంతృత్వ ధోరణులు కొనసాగుతున్నా యన్నారు. ప్రజాస్వామ్యం లేని పార్టీ ఎలా అభివృద్ధి చెందుతుందని ఆమె ప్రశ్నించారు. తనపై ఢిల్లీ లిక్కర్ కేసులు నమోదైనప్పుడు.. పార్టీ కనీసం తనకు అండగా నిలబడలేదన్నారు. తనపై కేసు.. కేవలం తన తండ్రి(కేసీఆర్)పై ఉన్న కక్షతోనే పెట్టారని.. లేకపోతే.. తనపై కేసు కూడా ఉండేది కాదని చెప్పారు.
బీఆర్ఎస్ హయాంలో అన్ని విషయాల్లోనూ అవినీతి రాజ్యమేలిందని సంచలన ఆరోపణలు చేశారు. ఇటు పార్టీలోనూ.. అటు ప్రభుత్వంలోనూ ప్రజల సొమ్మును తినేశారని అన్నారు. కొత్త జిల్లాల్లో నిర్మించిన కలెక్టరేట్ భవనాల నుంచి అమరవీరుల స్థూపాల వరకు కూడా.. అన్నింటిలోనూ అవినీతి జరిగినట్టు తెలిపారు. సిద్దిపేట(హరీష్ రావు సొంత నియోజకవర్గం)లో నిర్మించిన కలెక్టరేట్ చిన్నపాటి వర్షానికే కూలిపోయిందన్నారు. దీనిని బట్టి అవినీతి ఏ స్థాయిలో జరిగిందో తెలుసుకోవాలన్నారు.
''నీళ్లు-నిధులు-నియామకాలు నినాదంతో తెలంగాణ ఏర్పడింది. కానీ, ఈ నినాదాన్ని బీఆర్ ఎస్ పార్టీ.. తన రాజకీయ లబ్ధి కోసమే వినియోగించుకుంది. ఆ తర్వాత.. ఈ నినాదాన్ని గాలికి వదిలేసింది.'' అని కవిత సంచలన ఆరోపణలు చేశారు.
