మూడోసారి కేసీఅర్ సీఎం ఎందుకు కాలేదో చెప్పిన కవిత
కేసీఅర్ తెలంగాణా వచ్చుడో నేను చచ్చుడో అంటూ ఉద్యమ వేళ ఒక పవర్ ఫుల్ స్లోగన్ తో జనాలకు చేరువ అయ్యారు.
By: Satya P | 18 Nov 2025 7:58 PM ISTకేసీఅర్ తెలంగాణా వచ్చుడో నేను చచ్చుడో అంటూ ఉద్యమ వేళ ఒక పవర్ ఫుల్ స్లోగన్ తో జనాలకు చేరువ అయ్యారు. అంతే కాదు అమరణ నిరాహార దీక్షతో హడలెత్తించారు. తెలంగాణా మొత్తం సమాజాన్ని ఏకం చేశారు. జాతీయ రాజకీయాలను కుడి ఎడమల పార్టీలను కలిపి మరీ తెలంగాణా అని అందరి నోటా అనిపించారు మొత్తానికి ఆయన రాజకీయ చాణక్యం ఫలించి తెలంగాణా అన్నది సాధించారు. అంతే కాదు తెలంగాణా తెచ్చిన ఘనతను కూడా తన ఖాతాలో వేసుకుని చరిత్ర పురుషుడు అయ్యారు. ఇక తెలంగాణాకు తొలి ముఖ్యమంత్రిగా మలి ముఖ్యమంత్రిగా కూడా రెండు సార్లు గెలిచి సత్తా చాటారు.
అసలు విషయం ఏమిటో :
నిజానికి తెలంగాణా ఉద్యమాన్ని పీక్స్ లోకి తీసుకుని వెళ్ళి ఏకంగా దశాబ్దన్నర పాటు ఆ టెంపోని ఎక్కడా తగ్గకుండా కొనసాగించిన కేసీఆర్ జీవించి ఉన్నంత వరకు మరో నేత సీఎం కాకూడదు, ఆయనే అలా కొలువు ఉండాలి. ఎందుకంటే ఉద్యమ కాలంలో ఆయన దేవుడిగా అందరి చేత కీర్తించబడ్డారు. మరి కేసీఆర్ విజయం కేవలం రెండు సార్లకే సరిపోయింది. మూడవసారి వరుసగా గెలిచి హ్యాట్రిక్ సీఎం గా తెలుగు నాట సరికొత్త రికార్డుని క్రియేట్ చేయాలనుకున్న కేసీఆర్ కి అది సాధ్యపడలేదు. ఆయన మూడవసారి ఎందుకు ఓడారు అంటే గత రెండేళ్ళలో ఎన్నో రకాలైన విశ్లేషణలు వచ్చాయి. ఇపుడు ఆయన కుమార్తె, బీఆర్ఎస్ లో ఒకనాడు కీలక నాయకురాలిగా ఉన్న కవిత అసలు విషయం ఏమిటో చెప్పారు.
తుమ్మలను దూరం చేసుకోవడం :
ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా కవిత బీఆర్ ఎస్ మీద మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఆ జిల్లాకు చెందిన దిగ్గజ నేత, దశాబ్దాలుగా రాజకీయాలను శాసిస్తూ వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని దూరం చేసుకోవడం వల్లనే బీఆర్ఎస్ మూడవసారి అధికారంలోకి రాలేదని అన్నారు. అంత పెద్దాయననే పక్కన పెట్టడంతో ఆ బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం తెలంగాణా వ్యాప్తం అయి నెగిటివ్ వాతావరణం ఏర్పడి బీఆర్ఎస్ ఓటమికి దారి తీసింది అని అన్నారు.
నన్నూ అలాగే :
ఇక తాను రెండు దశాబ్దాలుగా బీఆర్ఎస్ లో పనిచేస్తే తననూ దూరం చేశారు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇవన్నీ పార్టీ చేసిన ఇప్పటికీ చేస్తున్న తప్పులుగానే ఆమె చెప్పుకొచ్చారు. మంచి నాయకులను ఎఫెక్టివ్ లీడర్స్ ని బీఆర్ ఎస్ కోల్పోవడం వల్లనే పరాజయం పాలు అవుతోందని ఆమె కఠినమైన విశ్లేషణను కేసీఅర్ ముందు ఉంచారు. నిజానికి ఇవన్నీ బీఆర్ఎస్ ఇప్పటికే మననం చేసుకుందా అంతర్మధనం చెందిందా అన్నది తెలియదు కానీ ఆ పార్టీలో నిన్నటిదాకా ఉంటూ వచ్చిన కవిత మాత్రం అసలు నిజాలు ఏమిటో గులాబీ బాస్ కి జనం ముందునే తేటతెల్లం చేశారు అన్న మాట.
నిద్రపోతున్నారు :
ఇక బీఆర్ఎస్ మీద మరిన్ని విమర్శలు కూడా కవిత చేశారు. ప్రతిపక్షంలోకి వచ్చాక కూడా బీఆర్ఎస్ లో ఏ మాత్రం యాక్టీ నెస్ లేదని గట్టిగా చెప్పాలీ అంటే ప్రతిపక్షం నిద్రపోతోంది అని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. అందువల్లనే అధికార పక్షం పట్ల జనాలకు పెద్దగా అనుకూలత లేకపోయినా వారి పని బాగుంది అన్నట్లుగా ఆమె వ్యాఖ్యానించారు.
సొంత పార్టీ విషయంలో :
తాను సొంతంగా పార్టీ పెట్టే విషయం మీద కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ పెట్టడం అంటే అనుభవం కావాలని అన్నారు. తాను జనంలో ఉంటున్నాను వారి సమస్యలు తెలుసుకునే పనిలో ప్రస్తూం ఉన్నానని అన్నారు. మొత్తానికి కవిత సొంత పార్టీ పెడతారు అన్నది ఆమె మాటలలో అర్ధం అవుతోంది. అదే సమయంలో ప్రతిపక్ష పాత్ర బీఆర్ఎస్ నిర్వహించడం లేదని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో తాను ఒక ఫోర్స్ గా ముందుకు రావాలని చూస్తున్నారు. మరి ఆమె ఆలోచనలు ఏ విధంగా ముందుకు సాగుతాయో చూడాల్సిందే.
