పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ నటి.. ఈ సడన్ ట్విస్ట్ ఏంటి?
ఈ క్రమంలోనే ఒక ప్రముఖ నటి కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టి సడన్ ట్విస్ట్ ఇచ్చింది. మరి ఆమె ఎవరు? ఏ రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది? ఏ పార్టీలోకి చేరింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
By: Madhu Reddy | 16 Aug 2025 7:00 AM ISTసాధారణంగా రాజకీయ రంగానికి, సినిమా రంగానికి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది.. చాలా మంది సెలబ్రిటీలు సినిమాలలో ఒక ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత.. రాజకీయాలలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కొంతమంది రాజకీయాలలోకి వచ్చి సొంత పార్టీని పెడితే, మరికొంతమంది లీడింగ్ లో ఉన్న పార్టీలలో చేరుతూ రాజకీయ జీవితాన్ని మొదలు పెడుతూ ఉంటారు. హీరోలే కాదు ఈ మధ్యకాలంలో హీరోయిన్ లు కూడా రాజకీయ రంగ ప్రవేశం చేస్తూ తమకంటూ ఒక ఉనికిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఒక ప్రముఖ నటి కూడా రాజకీయాలలోకి అడుగుపెట్టి సడన్ ట్విస్ట్ ఇచ్చింది. మరి ఆమె ఎవరు? ఏ రాష్ట్రంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది? ఏ పార్టీలోకి చేరింది? అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి.
ఆమె ఎవరో కాదు కస్తూరి శంకర్.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ రాజకీయ అంశాలపై కూడా స్పందించే ఈమె.. అప్పుడప్పుడు వివాదాల్లో కూడా ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేసింది. అసలు విషయంలోకి వెళ్తే తెలుగులో నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో రమ్యకృష్ణతో పాటు మరో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది కస్తూరి శంకర్. మరొకవైపు బుల్లితెర సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇంటింటి గృహలక్ష్మి సీరియల్లో చాలా హోమ్లీగా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించింది.అటు సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉన్న ఈమె తాజాగా రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చింది.
తమిళనాడు బీజేపీలో ప్రముఖ ట్రాన్స్ జెండర్ నమిత మారిముత్తుతో కలిసి కస్తూరి శంకర్ బిజెపిలో చేరారు. వీరికి తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. తమిళనాడులో బిజెపి పార్టీ బలోపేతానికి కస్తూరి కృషి చేస్తుందని భావిస్తున్నట్లు నాగేంద్రన్ తాజాగా వెల్లడించారు.
కస్తూరీ శంకర్ విషయానికి వస్తే..తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసి మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. మొత్తానికైతే అటు సినిమాలు ఇటు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులను అలరించిన కస్తూరి శంకర్ ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అటు విమర్శలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఈమె రాజకీయాల్లోకి వెళ్లడం ఏంటి ? ఇలా సడన్ గా ట్విస్ట్ ఇచ్చింది ఏంటి అంటూ ఎవరికి వారు కామెంట్ చేస్తున్నారు.
మరోవైపు గత కొన్ని రోజుల క్రితం తమిళనాడులో నివసిస్తున్న తెలుగు బ్రాహ్మణులపై చేసిన కామెంట్లకు వ్యతిరేకత ఎదుర్కొంది. పైగా ఈమెపై కేసు కూడా ఫైల్ చేశారు. కానీ తాను ఎవరిని ఉద్దేశించి నెగిటివ్ గా కామెంట్లు చేయలేదంటూ చెప్పింది. కొంతమంది తన మాటలను వక్రీకరించారని కూడా ఆరోపించింది.
