Begin typing your search above and press return to search.

వైసీపీ మాజీ మంత్రికి షాక్‌: అరెస్టుకు సుప్రీం కోర్టు ఆదేశం

ఈ నేప‌థ్యంలో కారుమూరికి ముంద‌స్తు బెయిల్‌ను తిర‌స్క‌రిం చిన న్యాయ‌స్థానం.. ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

By:  Garuda Media   |   29 July 2026 6:49 PM IST
వైసీపీ మాజీ మంత్రికి షాక్‌: అరెస్టుకు సుప్రీం కోర్టు ఆదేశం
X

వైసీపీ సీనియ‌ర్‌నేత‌, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వ‌ర‌రావుకు సుప్రీంకోర్టులో భారీ ఎదురు దెబ్బ త‌గిలిం ది. ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇచ్చేది లేద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది. అంతేకాదు.. కారుమూరిని అదుపు లోకి తీసుకుని.. విచారించాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. ఇదేస‌మ‌యంలో ఏపీ హైకోర్టు గ‌తంలో ఇచ్చి న ఆదేశాల‌ను సుప్రీంకోర్టు స‌మ‌ర్థించింది. ఈ నేప‌థ్యంలో కారుమూరికి ముంద‌స్తు బెయిల్‌ను తిర‌స్క‌రించిన న్యాయ‌స్థానం.. ఆయ‌న‌ను అరెస్టు చేసేందుకు అభ్యంత‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది.

విష‌యం ఏంటి?

వైసీపీ హ‌యాంలో లిక్క‌ర్ కుంభ‌కోణం కేసును కూట‌మి ప్రభుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుని విచార‌ణ చేస్తోంది. ఈ నేప‌థ్యంలో లిక్క‌ర్ పంప‌కాలతో పాటు.. ఈ అక్ర‌మ మ‌ద్యం స‌ర‌ఫ‌రాకు సంబంధించి.. (అంటే లిక్క‌ర్ బాటిళ్ల‌ను ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి ర‌వాణా చేయ‌డం..) కూడా విచార‌ణ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే కారుమూరి నాగేశ్వ‌ర‌రావు, ఆయన కుమారుడిపై కేసులు న‌మోదయ్యాయి. వీరు అక్ర‌మ మ‌ద్యం ర‌వాణా కాంట్రాక్టును పొందారు. దీనిలోనూ క‌మీష‌న్ల ప‌ర్వం కొన‌సాగింద‌ని ద‌ర్యాప్తు బృందం పేర్కొంది.

ఈ నేప‌థ్యంలోనే కారుమూరి కుమారుడిని పోలీసులు అరెస్టు చేశారు. కానీ.. నాగేశ్వ‌ర‌రావు మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్క‌డి నుంచే ఆయ‌న ముంద‌స్తు బెయిల్ కోసం ప్ర‌య‌త్నాలు చేశారు. తొలుత హైకోర్టు ను ఆశ్ర‌యించారు. కానీ, మ‌ద్యం కేసును తీవ్రంగా భావిస్తున్న‌ట్టు పేర్కొన్న హైకోర్టు ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాక‌రించింది. ముందు పోలీసుల వ‌ద్ద లొంగిపోవాల‌ని.. త‌ర్వాత బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు చేసుకోవాల‌ని పేర్కొంది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై తాజాగా కారుమూరి సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

దీనిపై విచార‌ణ చేసిన సుప్రీంకోర్టు 350 కోట్ల రూపాయ‌ల మేర‌కు మ‌ద్యం కుంభ‌కోణం జ‌రిగింద‌ని, ఈ కేసును తాము లైట్‌గా తీసుకునేది లేద‌ని స్ప‌ష్టం చేసింది. ముందు పోలీసుల ఎదుట లొంగి పోవాల‌ని ఆదేశించింది. లేదా పోలీసులు అరెస్టుచేసేందుకు త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని పేర్కొంది. ఈ కేసులో అనేక కుట్ర‌లు(కాన్ స్పైర‌సీ) ఉన్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంద‌ని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నేప‌థ్యంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును స‌మ‌ర్థిస్తున్న‌ట్టు పేర్కొంది. ఇక‌, నాగేశ్వ‌ర‌రావు ఆరోగ్యం బాగోలేద‌న్న వాద‌న‌ను కూడా కోర్టు కొట్టివేసింది.