Begin typing your search above and press return to search.

ప్రియుడి కోసం భర్తకు భారీ స్కెచ్ తో మస్కా.. పోలీసులకు దొరికేసింది

కానీ.. అవేమీ చేయకుండా.. సినిమాటిక్ ఎత్తుగడతో అందరిని ఏమార్చాలన్న అతితెలివి ఇప్పుడు ఆమెను జైలుపాలు చేసింది.

By:  Garuda Media   |   17 Feb 2026 4:00 PM IST
ప్రియుడి కోసం భర్తకు భారీ స్కెచ్ తో మస్కా.. పోలీసులకు దొరికేసింది
X

అదేం దరిద్రమో కానీ.. మోసం చేసేందుకు తప్పుడు పనులు చేయటం.. తమలాంటి తెలివైనోళ్లు ఎవరికీ దొరకరన్న అతితెలివితో అడ్డంగా బుక్ కావటం.. జైల్లో ఊచలు లెక్కేసే బ్యాచ్ ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజాగా ఈ తరహా ఉదంతమే కర్ణాటకలో వెలుగు చూసింది. భర్తను మోసం చేస్తూ.. ప్రియుడి కోసం బరితెగించిన ఒక మహిళ వేసిన భారీ స్కెచ్ చూస్తే.. నోట మాట రాదంతే. ఇంతా చేసి.. పోలీసులకు ఇట్టే చిక్కేసిన వైనం చూసినప్పుడు.. అదేదో.. భర్తకే నిజాయితీగా.. సూటిగా.. నిజాన్ని నిర్బయంగా చెప్పేసి.. విడిపోతే ఏ చిక్కులు ఉండవు. చట్టప్రకారం విడిపోతే మరెలాంటి ఇబ్బందులు ఎదురుకావు.

కానీ.. అవేమీ చేయకుండా.. సినిమాటిక్ ఎత్తుగడతో అందరిని ఏమార్చాలన్న అతితెలివి ఇప్పుడు ఆమెను జైలుపాలు చేసింది. అసలేం జరిగిందంటే.. కర్ణాటకలోని కల్కెర గ్రామంలో తన స్నేహితురాలి పెళ్లికి హాజరయ్యేందుకు 29 ఏళ్ల వివాహిత వచ్చింది. తమకూరు జిల్లాలోని కుణిగల్ ప్రాంతానికి చెందిన ఆమె భర్తతో కలిసి చిక్కమగుళూరులో ఉంటోంది. పెళ్లికి స్నేహితురాలి ఊరికి వచ్చి.. అక్కడ ఆమె తన దుస్తులు.. వ్యానిటీ బ్యాగ్.. చెప్పులు.. ఆధార్ కార్డుతో పాటు.. లోదుస్తులు.. అన్నింటిని కనిపించకుండా పోయింది.

వీటిని చూసిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆధార్ సాయంతో భర్తకు సమాచారం అందించారు. తన భార్యను ఎవరో డబ్బుల కోసం ఆమె ఒంటి మీద ఉన్న రూ.30 లక్షల బంగారు ఆభరణాల కోసం కిడ్నాప్ చేసి ఉంటారని.. అత్యాచారానికి పాల్పడి ఉంటారని వేదన చెందాడు. దీంతో.. పోలీసులు ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకొని.. సీసీ కెమేరాల ఫుటేజ్ కోసం రంగంలోకి దిగారు. దీంతో.. కనిపించకుండా పోయిన మహిళ పేరు ప్రియాంకగా గుర్తించటమే కాదు.. ఆమె బేలూరు బస్టాండ్ వద్ద కనిపించిన ఫుటేజ్ తో మరింత లోతుల్లోకి వెళ్లారు.

అక్కడ లభించిన ఆధారాలతో పాటు.. ఆమె ఫోన్ ను ఆధారంగా చేసుకొని ఆమె ఎక్కడ ఉందో లొకేషన్ ను ట్రాక్ చేశారు. చివరకు ఆమె తన పాత స్నేహితుడు డేవిడ్ దగ్గర ఉందన్న విషయాన్ని గుర్తించారు. దీంతో వారిద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ప్రియుడి కోసం ఇంత పెద్ద స్కెచ్ వేసిన విషయం తెలుసుకున్న పోలీసులు అవాక్కైన పరిస్థితి. ప్రస్తుతం వారిద్దరూ పోలీసుల అదుపులో ఉన్నారు. అదేదో భర్తకు.. తన పాత ప్రియుడి గురించి చెప్పి.. అతని వద్దకు వెళ్లిపోతానని చెప్పి.. విడాకులు తీసుకుంటే ఏ కష్టం ఉండేది కాదు కదా?