ఈ ఎమ్మెల్యే కార్లు చూస్తే షాకవ్వాల్సిందే... వీడియో వైరల్!
ఇదే క్రమంలో తాజాగా ఓ ఎమ్మెల్యే కూడా నివాసం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిపించిన కార్లు మినీ ఆటో ఎక్స్ పోని తలపించడం గమనార్హం.
By: Raja Ch | 5 Oct 2025 4:59 PM ISTసాధారణంగా రాజకీయ నాయకులు ప్రజాసేవలో ఉన్నంతకాలం వీలైనంతవరకూ సింపుల్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారని అంటారు. తాను వందల కోట్లకు పడగలెత్తిన వ్యక్తిని కాదని.. సామాన్యుల్లో ఒకడిని అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తారని అంటారు. అలా అని అంతా అలా ఉంటారని కాదు! ఆ సగతి అలా ఉంటే.. తాజాగా ఓ ఎమ్మెల్యే కార్ల ప్రదర్శన విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది!
అవును... దసరా సందర్భంగా ఆయుధ పూజ చేయడం ఆనవాయితీ అనే సంగతి తెలిసిందే. ప్రధానంగా ఆ రోజు కొత్త వాహనాలు కొనడం, ఉన్న వాహనాలకు ప్రత్యేక పూజలు చేసి, పూల మాలలతో అలంకరించడం చేస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా ఓ ఎమ్మెల్యే కూడా నివాసం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కనిపించిన కార్లు మినీ ఆటో ఎక్స్ పోని తలపించడం గమనార్హం.
వివరాళ్లోకి వెళ్తే... విజయదశమి సందర్భంగా కర్ణాటక రాష్ట్రంలోని కృష్ణరాజపురం నియోజకవర్గం ఎమ్మెల్యే బైరతి బసవరాజ్ కూడా తన నివాసం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా తన పాత ఇళ్లు, కొత్త ఇంటితో పాటు కార్లన్నింటికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో ఇంటి ముందు కనిపించిన.. సన్ రూఫ్ కలిగిన తెల్లటి లగ్జరీ కార్లకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
ఈ సందర్భంగా ఇంటి ముందు డజన్ల కొద్దీ లగ్జరీ కార్లను ఉంచిన ఎమ్మెల్యే.. వాటికి పూజలు నిర్వహించారు. ఆ విధంగా దాదాపు మినీ ఎక్స్ పోని తలపించిన ఈ దృశ్యానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఈ ఎమ్మెల్యేకి ఇన్ని కార్లా అంటూ షాకవుతున్నారు.
కాగా... బైరతి బసవరాజ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై, రెండుసార్లు మంత్రిగా పని చేశారు. సామాజిక సేవను ప్రారంభించి రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన... 2009లో హూడి వార్డుకు కార్పొరేటర్ అయ్యారు. ఈ క్రమంలో... 2013లో కృష్ణరాజపుర విధానసభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.
ఇదే క్రమంలో.. 2018 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి రెండోసారి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన... అనంతరం రాజీనామా చేసి, 2019లో బీజేపీ నుంచి ఉప ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు. ఈ క్రమంలోనే యడియూరప్ప మంత్రివర్గంలో పట్టణాభివృద్ధి మంత్రిగా, బసవరాజ్ బొమ్మై మంత్రివర్గంలో రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు!
