Begin typing your search above and press return to search.

కాపు మ‌హిళా నేత‌లు: స‌పోర్టు ఇస్తే తారాజువ్వలు ..!

రాష్ట్రంలో బ‌ల‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న కాపు సామాజిక వ‌ర్గం నుంచి నాయ‌కత్వం పెద్ద గా క‌నిపించ‌డం లేదు.

By:  Garuda Media   |   30 Nov 2025 6:00 AM IST
కాపు మ‌హిళా నేత‌లు:  స‌పోర్టు ఇస్తే తారాజువ్వలు ..!
X

రాష్ట్రంలో బ‌ల‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకున్న కాపు సామాజిక వ‌ర్గం నుంచి నాయ‌కత్వం పెద్ద గా క‌నిపించ‌డం లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు నాయ‌క‌త్వం-నాయ‌కుల గ్యాప్ ఈ సామాజిక వ‌ర్గంలో ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అందుకే.. గ‌తంలో ప్ర‌జారాజ్యం పెట్టిన‌ప్పుడు.. 2014లో జ‌న‌సేన పెట్టిన‌ప్పుడు.. కాపు సామాజి క వ‌ర్గం ఎడాప్ట్ చేసుకుంది. ఇక‌, కాపుల్లో మ‌హిళా నాయ‌కుల విష‌యానికి వచ్చినా.. వీరు త‌క్కువగానే ఉన్నారు. మేల్ లీడ‌ర్స్ ఎలా ఉన్నా.. ఫిమేల్స్ మాత్రం చాలా వ‌ర‌కు త‌క్కువ సంఖ్య‌లో క‌నిపిస్తున్నారు.

వార‌సులుగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన కాపు మ‌హిళ‌లు మ‌రింత త‌క్కువ సంఖ్య‌లో ఉన్నారు. ఇలాంటివారిలో తాజాగా కాపుల త‌ర‌ఫున క‌నిపిస్తున్న నాయ‌కులు ఇద్ద‌రు. వీరిని కాస్త ఎంక‌రేజ్ చేస్తే.. కాపు సామాజిక‌వర్గం లో మ‌హిళా నాయ‌కత్వం దూకుడు పెరిగేందుకు.. ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. కాపు ఉద్య‌మ మాజీ నాయ‌కుడు, వైసీపీ నేత‌.. ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం కుమార్తె క్రాంతి ప్ర‌స్తుతం జ‌నసేన‌లో ఉన్నారు.

మంచి వాక్చాతుర్యం, వాయిస్‌.. తెలుగు భాష‌పై ప‌ట్టు ఉన్న క్రాంతి.. పార్టీకి మేలు చేస్తార‌న‌డంలో సందే హం లేదు. పైగా యువ‌తుల‌ను మ‌రింత ఎక్కువ‌గా ఆక‌ర్షించే అవ‌కాశం కూడా ఉంటుంది. అయితే.. జ‌న సేన‌లోనే ఉన్నా.. యాక్టివ్‌గా మాత్రం క‌నిపించ‌డం లేదు. ఈమెకు కొంత అవ‌కాశం క‌ల్పిస్తే.. పార్టీప‌రంగా పుంజుకుంటుంద‌న్న చ‌ర్చ సాగుతోంది. పైగా రాజ‌కీయంగా వైసీపీని టార్గెట్ చేసే విష‌యంలో క్రాంతి దూకుడు కూడా పార్టీకి ప్ర‌యోజ‌నకరంగా మారుతుంద‌న్న చ‌ర్చ‌సాగుతోంది.

ఇక ఇటీవ‌ల మీడియా ముందుకు వ‌చ్చి ప్ర‌జాజీవితంలోకి అడుగు పెడ‌తాన‌ని చెప్పిన వంగ‌వీటి రంగా కు మార్తె ఆశాకిర‌ణ్ కూడా.. మంచి వాయిస్ అయ్యే అవ‌కాశం ఉంది. పార్టీ ఏదైనా.. ఆమెకు ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్‌.. తండ్రి వార‌స‌త్వం వంటివి క‌లిసి వ‌చ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే..ప్ర‌స్తుతం ఆశా కిర‌ణ్ రాజ‌కీయాల్లోకి చేరే విష‌యంపై స‌స్పెన్స్ బాట‌లో ఉన్నారు. త్వ‌ర‌లోనే అంటూ.. రాజ‌కీయాల గురించి దాట వేసినా.. మ‌రో ఏడాదికైనా ఆమె రాజ‌కీయాల్లోకి రావాల్సిందే. సో.. ఇలాంటి వారిని ప్రోత్స‌హిస్తే.. కాపు సామాజిక‌వ‌ర్గంలో మంచి ఇమేజ్ ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.