కనిగిరి సెంటిమెంటును తిరగరాస్తారా.. ?
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరిఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వృత్తి రీత్యా డాక్టర్. వైద్యుడిగా ఆయనకు మంచి పేరు కూడా ఉంది.
By: Garuda Media | 15 Aug 2026 4:00 AM ISTఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కనిగిరిఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి వృత్తి రీత్యా డాక్టర్. వైద్యుడిగా ఆయనకు మంచి పేరు కూడా ఉంది. ఇటు రాజకీయాలు.. అటు వైద్య వృత్తిని కొనసాగిస్తున్న చాలా మంది నాయకుల తరహా లోనే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి కూడా వ్యవహరిస్తున్నారు. ప్రజలకు సమయం ఇస్తున్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇటీవల 20 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు కూడా ప్రారంభించారు.
అలానే ఇంటింటికీ టీడీపీ కార్యక్రమంలోనూ ఆయన పార్టిసిపేషన్ బాగానే ఉందని పార్టీ నాయకులు అభిప్రాయ ప డుతున్నారు. దీంతో మరోసారి కనిగిరిలో ముక్కు గెలుపు ఖాయమని చెబుతున్నారు. వాస్తవానికి గత మూడు ఎన్నిక ల్లో ఇక్కడి ప్రజలు ఒక పార్టీని ఒకసారి .. తర్వాత ఎన్నికల్లో మరో పార్టీని గెలిపిస్తున్నారు. 2014లో టీడీపీ తరఫున కది రి బాబూరావు విజయం దక్కించుకున్నారు. తర్వాత.. 2019లో వైసీపీ తరఫున బుర్రా మధుసూదన్ యాదవ్ గెలుపు గుర్రం ఎక్కారు.
ఇక, గత ఎన్నికల్లో టీడీపీ విజయం దక్కించుకుంది. ఇలా.. మూడు ఎన్నికల్లో భిన్నమైన తీర్పు కనిపించింది. ఇక, వ్యక్తుల కంటే కూడా.. పార్టీలకు కనిగిరిలో ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బీసీ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉం డడం కలిసి వస్తోంది. ఇది పార్టీలకు సంస్థాగత ఓటు బ్యాంకుగా కూడా మారింది. అందుకే.. ఇక్కడ నుంచి మూడు ఎన్నికల్లో భిన్నమైన తీర్పు కనిపించింది. ఇక, వచ్చే ఎన్నికల నాటికి ఈ సెంటిమెంటును మార్చి.. వరుసగా టీడీపీ ని విజయ తీరాలకు చేర్చే అంశంపై పార్టీ ప్రణాళికలు రూపొందించింది.
ఈ క్రమంలోనే బీసీ సంక్షేమాన్ని ప్రాతిపదికగా తీసుకుని కనిగిరిలో గుర్తింపు చేపట్టారు. తద్వారా బీసీ కుటుంబాల్లో సంక్షేమాన్ని అందుకోకుండా వెనుకబడిన వారిని గుర్తిస్తారు. వారికి మరింత మేలు చేయనున్నారు. ఇక, పార్టీల పరంగా కూటమి నాయకుల మధ్య సఖ్యత బాగానే ఉంది. ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి సాఫ్ట్ కావడం.. అందరినీ కలుపుకొనిపోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం వంటివి వ్యక్తిగతంగా ఆయనకు కలిసి వస్తున్నాయి. ఇక, కనిగిరిలో కీలకమైన నీటి సమస్య పరిష్కారానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఇలా.. అటు పార్టీ, ఇటు ఎమ్మెల్యే కూడా వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ప్రయత్నాలు ప్రారంభించడం గమనార్హం.
