Begin typing your search above and press return to search.

గులాబీ పార్టీ ఓటమి వేళ కవిత ట్వీట్ వైరల్

ఈ మాట గులాబీ పార్టీలో చాలానే వినిపించింది. ఆమెని పార్టీ నుంచి బయటకు పంపించినపుడు ఇదే రకంగా కొంతమంది హేళన చేశారు. కవితక్కతో ఏమిటి జరిగేది ఒరిగేది అని అన్నారు.

By:  Satya P   |   14 Nov 2025 8:43 PM IST
గులాబీ పార్టీ ఓటమి వేళ కవిత ట్వీట్ వైరల్
X

గులాబీ పార్టీకి కంచుకోట లాంటి సీట్లో భారీ ఓటమిని తలకెత్తుకుంది. ఏకంగా పాతిక వేళ ఓట్ల తేడాతో ఓటమిని చవి చూసింది. 2018, 2023 ఎన్నికల్లో వరసగా బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి గోపీనాధ్ విజయం సాధించారు. అక్కడ చాలా ప్యాకెట్లలో బీఆర్ ఎస్ కి బలం ఉంది. బీఆర్ఎస్ కి పట్టణ ఓటర్లలో పాజిటివిటీ కూడా ఉంది. దాంతో బీఆర్ఎస్ కంచుకోటలో కాంగ్రెస్ కే అగ్ని పరీక్ష అని అంతా అనుకున్నారు. కానీ జరిగింది వేరు. తీరా ఫలితాలు వచ్చిన తరువాత చూస్తే బీఆర్ఎస్ గెలుపునకు ఆమడ దూరంలో ఉండిపోయింది. పైగా గతంలో ఎన్నడూ లేని మెజారిటీ కాంగ్రెస్ సొంతం అయింది. ఒక విధంగా ఇది రికార్డుని క్రియేట్ చేసింది.

కవిత సంచలనం :

బీఆర్ఎస్ లో నిన్నటి దాకా ఉంటూ ఒక అగ్రే శ్రేణి నాయకురాలిగా చలామణీలో ఉన్న కవిత బీఆర్ఎస్ ఓటమి వేళ వేసిన ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. అది సంచలనంగా మారింది. కవిత జస్ట్ మూడు పదాలతో మొత్తం చెప్పాల్సింది చెప్పేశారు. మరి అది ఎవరిని ఉద్దేశించి చేశారో ఎవరికి తగలాలో వారికి తగిలేలాగానే ఆ ట్వీట్ ఉంది. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కవిత ట్వీటేశారు. దానికి దండం పెట్టే ఎమోజీలు కూడా యాడ్ చేశారు.

కవితక్కతో ఏమి కాదు :

ఈ మాట గులాబీ పార్టీలో చాలానే వినిపించింది. ఆమెని పార్టీ నుంచి బయటకు పంపించినపుడు ఇదే రకంగా కొంతమంది హేళన చేశారు. కవితక్కతో ఏమిటి జరిగేది ఒరిగేది అని అన్నారు. కానీ అలా ఎద్దేవా చేసిన వారికి ఈ ఫలితం ఒక చెంపపెట్టు అని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే కవిత కేసీఅర్ ని తప్పించి బీఆర్ఎస్ అగ్ర నేతలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. ఇపుడు ఓటమి వేళ ఆమె ట్వీట్ ఎవరి మీద చేశారు, ఏమిటి అన్నది కూడా చర్చగా ఉంది.

ఆమె ప్రభావం :

ఇదిలా ఉంటే బీఆర్ ఎస్ ఓటమికి సవాలక్ష కారణాలు ఉండొచ్చు. అందులో కవిత ప్రభావం కూడా ఏ మేరకు ఉంది అన్నది చర్చకు వస్తున్న విషయం. కవితకు బీఆర్ఎస్ క్యాడర్ లో కొంత పట్టు ఉంది. ఆమె వారిని గట్టిగా పనిచేయకుండా కంట్రోల్ చేశారు అని ప్రచారం సాగుతోంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం పాలు అయింది. దాని వెనక కవిత అభిమానులు కూడా ఉన్నారని అంటున్నారు. బీఆర్ఎస్ ఏకమొత్తంగా ఒక పార్టీగా ఉంటూ కేసీఆర్ దూకుడుగా ఉన్న వేళ జరిగిన 2018, 2023 ఎన్నికల్లో పార్టీ గెలిచింది. ఇపుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒక్కరే బాధ్యతలు వేసుకున్నారు. హరీష్ రావు తన తండ్రి మరణంతో కొంత వరకూ పనిచేయలేకపోయారు. దానికి తోడు కవిత ఎపిసోడ్ కూడా బీఆర్ ఎస్ బలాన్ని తగ్గించింది అని అంటున్నారు. పైగా గులాబీ పార్టీలో వర్గ పోరు కూడా ఓటమిని రాసింది అని అంటున్నారు.