పాపం పెద్దాయన....ఏదో అనుకుంటే ఏదో అయిందిగా !
ఇక చూస్తే కనుక కామినేనికి బీజేపీ కేంద్ర పెద్దలతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతారు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కుతుంది అని ఆయన అనుచరులు ధీమాగా ఉంటూ వచ్చారు.
By: Satya P | 28 Sept 2025 3:00 AM ISTఆయన వృత్తిపరంగా డాక్టర్. రాజకీయాల్లో ఆయనకు ఆసక్తి ఉంది. అందుకే ఆయన అరంగేట్రం చేశారు. 2009లో ఆయన తొలిసారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది ప్రజారాజ్యం పార్టీ తరఫునే. అలా ఆయన మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలోనే ఎమ్మెల్యేగా ఉమ్మడి ఏపీ సభలో అడుగుపెట్టారు. ఆయనే కామినేని శ్రీనివాస్. ఆయన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో కొన్నాళ్ళ పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కొనసాగారు. 2014 నాటికి బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో టీడీపీ బీజేపీ మధ్య పొత్తు ఉండడంతో ఆయనకు మంత్రి పదవి దక్కింది. అలా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు.
మూడోసారి గెలిచి :
ఇక చూస్తే 2024 ఎన్నికల్లో కామినేని ముచ్చటగా మూడోసారి గెలిచారు. ఆయన సీనియర్ నేత కావడంతో మంత్రి పదవి వస్తుందని ఆశలు పెట్టుకున్నారు. కానీ బీజేపీ నుంచి ఏకైక మంత్రిగా సత్య కుమార్ యాదవ్ కి చోటు దక్కింది. 2014లో నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి ఉంటే ఇద్దరికి ఇచ్చారు కాబట్టి ఇపుడు ఎనిమిది మంది ఉంటే కనీసం ఇద్దరు లేదా ముగ్గురికి ఇవ్వరా అన్న చర్చ కూడా బీజేపీలో ఉంది. విస్తరణలో మరో బెర్త్ బీజేపీకి ఖాయమని ప్రచారం సాగుతున్న వేళ పెద్దాయన కామినేనిలో కూడా ఆశలు చిగురించాయి.
కేంద్ర పెద్దల ఆసరాతో :
ఇక చూస్తే కనుక కామినేనికి బీజేపీ కేంద్ర పెద్దలతో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయని చెబుతారు. దాంతో ఆయనకు మంత్రి పదవి దక్కుతుంది అని ఆయన అనుచరులు ధీమాగా ఉంటూ వచ్చారు. దానికి తగినట్లుగా ఆయన తన ప్రయతంలో తాను ఉన్నారు. కూటమి పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే క్రమంలో ఆయన సభలో తన వాణిని ఎప్పటికప్పుడు బలంగా వినిపిస్తూ వస్తున్నారు. అలాగే తాజాగా ఆయన సభలో ఒక చర్చ జరుగుతున్నపుడు దానిని అనూహ్యంగా జగన్ వైపు తిప్పారు అని గుర్తు చేస్తున్నారు.
బూమరాంగ్ అయిందిగా :
జగన్ యాటిట్యూడ్ ఇది అని ఆయన నిరూపించే ప్రయత్నంలో మధ్యలో సినీ ప్రముఖుల విషయం తెచ్చారు. చిరంజీవి ప్రస్తావన కూడా ఆయన తీసుకుని వచ్చారు. అది కాస్తా బాలయ్య సభలో ఉండంతో వేరే టర్నింగ్ ఇచ్చుకుంది బూమరాంగ్ అయింది. అంతే కాదు పార్టీ పెద్దల దృష్టిలోకి కూడా ఈ ఇష్యూ వెళ్ళడంతో అక్కడ కూడా క్లాస్ తీసుకున్నారు అని ప్రచారం సాగుతోంది. దాంతో మొత్తం మీద గురువారం నాడు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో సినిమా ఇష్యూని మిక్స్ చేసి అతి ఉత్సాహంగా స్పీచ్ ఇచ్చిన కామినేని శనివారం రాగానే తమ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించమని సభాపతికి విన్నవించుకోవాల్సి వచ్చింది.
ఆశ నిరాశేనా :
ఇదిలా ఉంటే సభలో ఇంతటి వివాదం చెలరేగడానికి కారణమైన కామినేని వ్యాఖ్యల పట్ల కూటమి పార్టీలు అసహనంగా ఉన్నాయని అంటున్నారు. ఇక చూస్తే అదే రోజున ఎంతో ఆర్భాటంగా మెగా డీఎస్సీ నిర్వహించి ఏకంగా 16 వేల మందికి పైగా టీచర్లకు ఒకేసారి నియామక పత్రాలు ప్రభుత్వం అందించింది. అయితే ప్రభుత్వానికి ఎంతో పేరు తేవాల్సిన ఈ మంచి ప్రయత్నం కానీ కార్యక్రమాలు కానీ పెద్దగా ప్రచారంలోకి రాకుండా బాలయ్య ఎపిసోడ్ డామినేట్ చేసింది అని అంటున్నారు. దాంతో ఈ ఇష్యూకి కేంద్ర బిందువుగా మారిన కామినేని కూడా ఇరకాటంలో పడిపోయారు అని అంటున్నారు. ఎనిమిది పదుల వయసుకు చేరువలో ఉన్న పెద్దాయన మంత్రి పదవిని చేపట్టి రాజకీయంగా విరమించాలని అనుకున్నారని చెబుతారు. కానీ ఇపుడు ఆయన ఆశలు నిరాశలు అయ్యేలా ఉన్నాయని అంటున్నారు. దాంతో పెద్దాయనా నీవు ఒకటి అనుకుంటే వేరొకటి జరిగిందా నాయనా అని సెటైర్లు కామెంట్స్ సోషల్ మీడియాలో పడుతున్నాయి.
