Begin typing your search above and press return to search.

బీఆర్ఎస్ ఈటెలను కమిషన్ కలుపుతోందా ?

ఈటెల రాజెందర్ ఒకనాడు కేసీఆర్ కి రైట్ హ్యాండ్ గా ఉండేవారు. బీఆర్ఎస్ లో ఆయన నంబర్ టూగా వ్యవహరించేవారు.

By:  Satya P   |   5 Aug 2025 2:00 PM IST
బీఆర్ఎస్ ఈటెలను కమిషన్ కలుపుతోందా ?
X

కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద జస్టిస్ పీసీ ఘోష్ కమిషని నివేదిక ఇపుడు తెలంగాణా రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నివేదికలో బీఆర్ఎస్ లో ఉన్న పెద్ద తలకాయలను ఎక్కడా వదలలేదు అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి బయటపడి బీజేపీలో ఎంపీగా ప్రస్తుతం ఉన్న ఆనాటి మాజీ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ని సైతం ఈ నివేదికలో ఎక్కడా వదలలేదు. ఆయన మీద కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు కమిషన్ చేయడం విశేషం.

నిశ్శబ్ద నేరస్తుడిగా :

ఈటెల రాజెందర్ ఒకనాడు కేసీఆర్ కి రైట్ హ్యాండ్ గా ఉండేవారు. బీఆర్ఎస్ లో ఆయన నంబర్ టూగా వ్యవహరించేవారు. ఆయన బీఆర్ఎస్ తొలి ప్రభుత్వంలో అత్యంత కీలకమైన ఆర్ధిక మంత్రిగా వ్యవహరించారు. ఆ సమయంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ టేకప్ చేశారు. ఇక నిధులు వ్యవహారంలో ఆర్ధిక శాఖది కూడా ముఖ్య భూమిక కాబట్టి ఈటెల విషయంలో పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో తప్పు పట్టారు. అంతే కాదు ఆయనను నిశ్శబ్ద నేరస్తుడిగా అభివర్ణించడం అయితే ఆసక్తి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. కమిషన్‌ తన నివేదికలో ఆనాటి ఆర్థిక, ప్రణాళిక శాఖల మంత్రి కుట్రదారుగా వ్యవహరించారు అని కూడా పేర్కొన్నది.

కేసీఆర్ పేరు అన్నేసి సార్లు :

ఇక ఈ కమిషన్ నివేదికలో కేసీఆర్ పేరు ఏకంగా 36 సార్లు పేర్కొన్నారు. పదే పదే అనేక చోట్ల కేసీఆర్ పేరు దొర్లుతూనే ఉంది. అలాగే అప్పటి జలవనరుల శాఖ మంత్రి హరీష్ రావు పేరు అయితే ఏకంగా 19 సార్లు పేర్కొన్నారు. వీరితో సమానంగా ఈటెలను కూడా చేర్చారు. పైగా ఈటెల నాటి ఆర్ధిక పరిస్థితి మీద అవగాహన లేదని పేర్కొంది అంతే కాదు నిబద్ధత కానీ సమగ్రత కానీ ఆయనకు లేదని ఈటెల మీద కీలక వ్యాఖ్యలు చేసింది. దాంతో కేసీఆర్ హరీష్ తో పాటుగా ఈటెలను ముందుకు తెచ్చినట్లు అయింది అంటున్నారు.

ఈటెల ఏం చేస్తారు :

కాళేశ్వరం నివేదికలో నేరుగా అప్పటి మంత్రిని కుట్రదారుగా పేర్కొనడం నిజంగా తీవ్రంగా ఆక్షేపణీయం. ఇక ఈ విషయంలో ఈటెలకు బీఆర్ఎస్ నుంచి సానుభూతి దక్కుతోంది. ఆయన మీద ఇంతటి పరుష పదజాలం ఒక కమిషన్ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది అని బీఆర్ఎస్ లో చర్చ సాగుతోంది. ఒక బాధ్యతాయుతమైన మంత్రి విషయంలో కమిషన్ చేసిన వ్యాఖ్యలు సరిగ్గా లేవని అంటున్నారు. ఇక ఈటెలకు బీజేపీలో చూస్తే అంతగా అనుకూలత లేదని అంటున్నారు. ఆయనే ఈ మధ్య తన మద్దతుదారులతో మాట్లాడుతూ బాహాటం అయ్యారు.

సొంతంగా అభ్యర్ధులను సర్పంచ్ ఎన్నికల్లో పెట్టాలని కూడా ఆలోచిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపధ్యంలో కాళేశ్వరంలో ఈటెల మీద కమిషన్ చేసిన ఆరోపణల మీద బీజేపీకి ఒక విధంగా ఇరకాటమే అంటున్నారు. కేసీఆర్ నే విమర్శించి ఊరుకుంటే కుదరదు, అలాగని ఈటెలను సమర్ధించలేరని అంటున్నారు. మరో వైపు ఈటెల కూడా ఈ విషయంలో ఏమి చేస్తారు అన్నది చర్చగా ఉంది. ఈటెల బీఆర్ఎస్ లను ఈ విధంగా కమిషన్ కలిపనుందా అన్న మరో చర్చ కూడా సాగుతోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో. ఏది ఏమైనా ఈటెల మీద పరుష పదజాలమే కమిషన్ నివేదికలో ఉపయోగించడం పట్ల అయితే అంతటా చర్చ అయితే సాగుతోంది.