Begin typing your search above and press return to search.

ఆ ఇంజినీర్ కొడుకు పెళ్లి థాయ్ లాండ్ లో చేశారు

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయి.. బెయిల్ మీద బయటకు వచ్చిన నూనె శ్రీధర్.. తన కొడుకు పెళ్లిని థాయ్ లాండ్ లో నిర్వహించిన విషయాన్ని గుర్తించారు.

By:  Garuda Media   |   28 Sept 2025 9:42 AM IST
ఆ ఇంజినీర్ కొడుకు పెళ్లి థాయ్ లాండ్ లో చేశారు
X

కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఉన్న మరకలు అన్ని ఇన్ని కావు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా వేలాది కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వాదనకు బలం చేకూరేలా.. ఈ ప్రాజెక్ట లో పని చేస్తూ ఏసీబీకి చిక్కిన అధికారుల్లో ఒకరు నూనె శ్రీధర్. సదరు ఇంజినీర్ మీద జరిపిన విచారణలో కొత్త విషయాలు వెలుగు చూడటమే కాదు..మరిన్ని షాకింగ్ నిజాలు వెలుగు చూస్తున్నాయి.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు అయి.. బెయిల్ మీద బయటకు వచ్చిన నూనె శ్రీధర్.. తన కొడుకు పెళ్లిని థాయ్ లాండ్ లో నిర్వహించిన విషయాన్ని గుర్తించారు. అంతేకాదు.. ఈ పెళ్లికి హాజరైన అధికారుల్లో పలువురు ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే విదేశీ పర్యటన చేసిన వైనాన్ని గుర్తించారు. దీనికి సంబంధించిన వివరాల్ని తాజాగా నీటిపారుదల శాఖకు లేఖ రాసిన అధికారులు... తమకు వివరణ ఇవ్వాలని కోరినట్లుగా తెలుస్తోంది.

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చొప్పదండి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గా నూనె శ్రీధర్ వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఏసీబీకి పట్టుబడిన తర్వాత.. ఆయన ఆదాయం బహిరంగ మార్కెట్ లో దాదాపు రూ.110 కోట్ల వరకు ఉంటుందన్న విషయాన్ని నిర్ధారించటం తెలిసిందే. దీంతో.. మరింత లోతుగా దర్యాప్తును నిర్వహిస్తున్న సందర్భంలోనే థాయ లాండ్ లో కొడుకు పెళ్లిని డెస్టినేషన్ వెడ్డింగ్ గా నిర్వహించారని. దీనికి 110 మంది పాల్గొన్నట్లుగా గుర్తించారు. ఈ 110 మంది అతిధుల్లో 20 మందికి పైనే అధికారులు ఉన్నట్లుగా గుర్తించారు.

సాధారణంగా కీలకస్థానాల్లో ఉన్న అధికారులు ఎవరైనా విదేశాలకు వెళ్లాల్సి వస్తే.. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ.. అలాంటిదేమీ లేకుండానే థాయ్ లాండ్ కు వెళ్లినట్లుగా గుర్తించారు. ఇరిగేషన్ శాఖకు చెందిన చీఫ్ ఇంజినీర్.. సూపరింటెండింగ్ఇంజినీర్ తో సహా ఇరవై మంది ధాయ్ లాండ్ కు వెళ్లినట్లుగా గుర్తించారు. తాజాగా వెలుగు చూసిన థాయ్ లాండ్ పెళ్లి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.